ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులకు కొత్తగూడెం శాసనసభ్యుడు జలగం వెంకటరావు వర్గీయులకు మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. తుమ్మల ఫ్లెక్సీలను జలగం వర్గీయులు తొలగించడంతో తుమ్మల వర్గీయులు వారిని అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం తుమ్మల వర్గీయులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో జలగం వర్గంపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
తుమ్మల, జలగం వర్గీయుల మధ్య ఘర్షణ
Published Fri, Mar 27 2015 1:30 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement
Advertisement