గుండ్లపోచంపల్లి: కాచిగూడ-నిజామాబాద్ ఫాస్ట్‌ప్యాసింజర్ రైలు నుంచి ప్రయాణికులు కిందకు దూకడంతో 200 మంది గాయపడ్డారు. మంటలు అంటుకున్నాయని వదంతులు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
రంగారెడ్డి జిల్లా గుండ్లపోచంపల్లి వద్ద వెంటనే చైన్‌లాగి రైలును ప్రయాణికులు ఆపేశారు. అక్కడితో ఆగకుండా కదులుతున్న రైలు నుంచి దూకేశారు. ఈ ఘటనపై సుమారు 200 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.
వదంతులతో రైలు నుంచి దూకేశారు
Published Mon, Aug 18 2014 12:12 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement