ఘనంగా ఎమ్మెస్సార్ 85వ జన్మదిన వేడుకలు | PCC former president M. Satyanarayana Rao 85th Birthday Celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా ఎమ్మెస్సార్ 85వ జన్మదిన వేడుకలు

Published Thu, Jan 14 2016 4:48 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

ఘనంగా ఎమ్మెస్సార్ 85వ జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెస్సార్ 85వ జన్మదిన వేడుకలు

బంజారాహిల్స్ : పీసీసీ మాజీ అధ్యక్షుడు మెన్నమనేని సత్యనారాయణ రావు(ఎంఎస్‌ఆర్) 85వ జన్మదిన వేడుకలు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసంలో గురువారం ఘనంగా జరిగాయి. రాజ్యసభ సభ్యుడు కేవీపీ, మల్లు భట్టు విక్రమార్క, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ కమలాకర్‌రావు, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు చైర్మన్ కె. రవీందర్‌రావు, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు విచ్చేసి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

1930 జనవరి 14న కరీంనగర్ జిల్లా వెదిరె గ్రామంలో జన్మించిన ఎంఎస్‌ఆర్ ఏఐసీసీ జనరల్‌సెక్రటరీగా రెండుసార్లు, లోక్‌సభ సభ్యుడిగా మూడుసార్లు, పీసీసీ అధ్యక్షుడిగా, ఆర్టీసీ చైర్మన్‌గా పని చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని నేతలు, కార్యకర్తలు పంచుకున్నారు. ఎంఎస్‌ఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వందలాదిగా తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement