కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలో బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లారీలో అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించిన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు.