బెల్లంపల్లి: జీపు అదుపుతప్పి ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం కాంట చౌరస్తాలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని భీమిని మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన జిల్లెల శంకర్‌గౌడ్ (55)గా గుర్తించారు. భార్యా, పిల్లలతో కలసి ఆటోలో వెళ్లాల్సిన శంకర్‌గౌడ్ ఏదో వస్తువు తీసుకువస్తానని చెప్పి ఆటో స్టాండ్ నుంచి పక్కకు వెళ్లాడు. అంతలోనే అదుపుతప్పి వచ్చిన జీపు అతన్ని ఢీకొంది. బలమైన గాయాలు కావడంతో అతడు అక్కడే ప్రాణాలు విడిచాడు.
జీపు ఢీకొని వ్యక్తి మృతి
Published Sun, Sep 20 2015 5:10 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement