గజ్వేల్: గజ్వేల్ మండలం బంగ్లావెంకటాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద శనివారం పోలీసు తీరుకు నిరసనగా గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఫలితంగా పోలింగ్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయగా...గ్రామస్తులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదే క్రమంలో కేంద్రానికి కొద్ది దూరంలో కొందరు గుమిగూడటం గమనించి అక్కడికి వచ్చిన ఓ ఎస్‌ఐ .. నవీన్ అనే యువకుణ్ని కొట్టడంతో గ్రామస్తులు అగ్రహానికి గురయ్యారు.
తాము ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుంటుండగా...అకారణంగా దాడిచేస్తారా? అంటూ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఎంపీటీసీ అంజిరెడ్డి మద్దతు పలికి పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. కొందరు పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి ఓటు వేయబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న గజ్వేల్ సీఐ అమృతరెడ్డి, తహశీల్దార్ బాల్‌రెడ్డి, బేగంపేట ఎస్‌ఐ అనిల్‌కుమార్‌లు సంఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్తులను నచ్చజెప్పి పోలింగ్ ప్రక్రియ యథావిధిగా సాగేలా చూశారు.
పోలీసు తీరుపై వెల్లువెత్తిన నిరసన
Published Sun, Sep 14 2014 12:25 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement