పాప ప్రాణం తీసిన కోడి | pet hen killed baby girl in nalgonda district | Sakshi
Sakshi News home page

పాప ప్రాణం తీసిన కోడి

Published Mon, Aug 4 2014 2:01 AM | Last Updated on Sun, Sep 2 2018 3:30 PM

పాప ప్రాణం తీసిన కోడి - Sakshi

పాప ప్రాణం తీసిన కోడి

మునుగోడు: పెంపుడు కోడి దాడి చేయడంతో ఎనిమిది నెలల పసిపాప మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం లక్ష్మిదేవిగూడంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కొంపల్లి సైదులు, గీతలకు ఎనిమిది నెలల క్రితం మొదటి సంతానంగా పాప జన్మించింది. పాప పేరు జాహ్నవి. వారిది వ్యవసాయ కుటుంబం కావడంతో పెరట్లో కోళ్లను పెంచుతున్నారు.

గురువారం ఉదయం తల్లి పాపను ఇంటి వరండాలో పడుకోబెట్టి పనులు చేసుకుంటుంది. ఆ సమయంలో కోడి పాప వద్దకు వచ్చి తలపై బలంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక వైద్యుడి వద్ద ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండలోని ప్రైవేటు పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారం జాహ్నవి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement