కోస్టల్ కారిడార్ కోసమే ‘పోలవరం’ | polavaram for coastal corridor | Sakshi
Sakshi News home page

కోస్టల్ కారిడార్ కోసమే ‘పోలవరం’

Published Thu, Jul 3 2014 2:33 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

polavaram for coastal corridor

భద్రాచలం టౌన్: కోస్టల్ కారిడార్ నిర్మాణం కోసమే సీమాంధ్ర నాయకులు పోలవరం ప్రాజెక్టును తలకెత్తుకున్నారని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ముంపు మండలాల విలీన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా భద్రాచలంలో టీజేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు బుధవారం ఆరోరోజుకు చేరాయి. దీక్ష శిబిరాన్ని పోటు రంగారావు బుధవారం సందర్శించి మద్దతు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ... బడా పారిశ్రామికవేత్తల ఒత్తిడితోనే మోడీ సర్కారు ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిం దన్నారు. ముంపుకు గురికాని 480 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రమైన సీలేరు ప్రాజెక్టును సీమాంధ్రకు కట్టబెట్టేందుకు మోడీ, వెంకయ్య నాయుడు ఆరాటపడుతున్నారని దుయ్యబట్టారు. ఈ ఆర్డినెన్స్‌తో సుమారు 200 కిలోమీటర్ల వరకు గోదావరి నీటిపై హక్కును కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మహోద్యమంతో తెలంగాణను సాధిం చుకున్నట్టుగానే.. ముంపు మండలాలను కూడా రక్షించుకుందాం’’ అని అన్నారు. అనంతరం, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.రాజశేఖర్ మాట్లాడు తూ... ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని, ఇక్కడి ఉపాధ్యాయులకు ఆప్షన్ అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు.

 బుధవారం నాటి దీక్షలలో రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగులు జలసూత్రం సోమశేఖర్, దామల్ల రాజు, జె.సోమయ్య, జక్కం సుధీర్, ఎఎస్‌ఆర్.హనుమాన్, ఆర్.రమేష్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు రాధాకృష్ణ, బి.రాంబాబు, డి.రామకృష్ణ, ఎ.నాగరాజు, పి.నాగేశ్వరరావు, పి.వెంకటయ్య, వి.శ్రీను, ఎం.సత్యనారాయణ, ఎస్‌వివి.సత్యనారాయణ, డి.రామచంద్రప్రభు, ఎం.వెంకటేశ్వర్లు, ఐ.రాజాభాస్కర్, ఈశ్వరరావు తదితరులు కూర్చున్నారు.

 పలువురి సంఘీభావం
 దీక్ష శిబిరాన్ని డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారిణి కె.ఇందిర, పీఏసీఎస్ ఛైర్మన్ సంకా వెంకట నగేష్, నాయకులు షేక్ గౌసుద్దీన్, వెక్కిరాల రామకృష్ణ, బి.రామకృష్ణ, జి.బాలకృష్ణ, రేగలగడ్డ ముత్తయ్య, పరుచూరి (టీజేఏసీ), ఎంబి.నర్సారెడ్డి (సీపీఎం), ఎం.రామాచారి (టీఫీటీఎఫ్), బి.రాజు, ఎ.వెంకటేశ్వర్లు, టీవీస్, రాజా శ్రీను (యూటీఎఫ్), జపాన్‌రావు, తులసీదాసు (ఎస్‌టీఎఫ్), వట్టం నారాయణ దొర, గుండు శరత్, సోందె వీరయ్య (ఆదివాసీ సంఘాలు) తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు.

 48 గంటల బంద్‌కు అఖిలపక్షం పిలుపు
 ఆర్డినెన్స్ రద్దు డిమాండుతో గురు, శుక్రవారాల్లో 48 గంటల బందుకు బుధవారం ఇక్కడ జరిగిన అఖిలపక్ష సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కన్వీనర్ వట్టం నారాయణ, కో-కన్వీనర్ గుండు శరత్, నాయకులు కెచ్చెల రంగారెడ్డి (న్యూడెమోక్రసీ), బొలిశెట్టి రంగారావు (కాంగ్రెస్), మంత్రిప్రగడ నర్సింహారావు (వైఎస్‌ఆర్ సీపీ), కొమరం ఫణీశ్వరమ్మ (టీడీపీ), ఎంబి.నర్సారెడ్డి (సీపీఎం), తాళ్ల రవికుమార్ (టీఆర్‌ఎస్), ఎవి.రావు (బీఎస్పీ), ఆవుల సుబ్బారావు (బీజేపీ), ఇతర సంఘాల నాయకులు బాదం జగదీష్, దాగం ఆదినారాయణ, దాసరి శేఖర్, మడివి నెహ్రూ, కారం వెంకటేశ్వర్లు, పడిసిరి శ్రీనివాస్, వెక్కిరాల శ్రీనివాస్, బాలకృష్ణ, పూసం రవికుమారి, షేక్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement