రంగారెడ్డి: జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం రామదాసుపల్లిలో ఆదివారం పోలీసులు దాడులు జరిపారు. నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారు చేస్తున్న కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 42 డ్రమ్ముల నకిలీ ఇంజిన్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.