విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పై వచ్చిన అవినీతి ఆరోపణలపై నివేదిక ఇవ్వాలంటూ పలు శాఖలకు లోకాయుక్తా నోటీసులు ఇచ్చానా కేసీఆర్ ప్రభుత్వం స్పందించటం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
హైదరాబాద్: విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పై వచ్చిన అవినీతి ఆరోపణలపై నివేదిక ఇవ్వాలంటూ పలు శాఖలకు లోకాయుక్తా నోటీసులు ఇచ్చానా కేసీఆర్ ప్రభుత్వం స్పందించటం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. జగదీశ్ రెడ్డిపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన బుధవారమిక్కడ అన్నారు. అవినీతికి తావు లేదంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ...మంత్రి జగదీశ్ రెడ్డి వ్యవహారంపై విచారణ జరిపించాలని పొన్నం డిమాండ్ చేశారు.