డిచ్‌పల్లి : ఖిల్లా డిచ్‌పల్లి రామాలయంలో శ్రీసీతారామ స్వామి తిరుక్కణోత్సవాలు శుక్రవారం సాయంత్రం వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆరాధన, పుష్పయాగం, ఉద్వాసనబలి, భూతబలి, నివేదన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను ఆలయప్రధానార్చకులు వానమాములైన కృష్ణమాచార్యులు, సహాయ అర్చకులు శ్యాంసుందరన్ ఆద్వర్యంలో నిర్వహించారు. సాయంత్రం నాగవెళ్లి కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. మహిళలు ఒకరిపై ఒకరు గులాలు చల్లుకుంటూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. రాత్రి 8 గంటలకు సీతారాములకు ఏకాంత సేవ, నివేదన, హారతి, మంత్రపుష్ఫం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలతో తిరుక్కల్యాణోత్సవాలు ముగిసినట్లు ఆలయ ధర్మకర్త గజవాడ రాందాస్‌గుప్తా తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారుపాక సాయిలు, సర్పంచ్ రూప్‌సింగ్‌రాథోడ్, ఎంపీటీసీ సభ్యులు మేకల లింబాద్రి, ఉప సర్పంచ్ గురడి ప్రతాప్‌రెడ్డి, మాజీ చైర్మన్లు గురడి నర్సారెడ్డి, మహేందర్‌రెడ్డి, లక్ష్మన్, దువ్వ సాయిలు, మాజీ సర్పంచులు ఏజీదాస్, బూస సుదర్శన్, నాయకులు దేశ్‌పెద్ది శ్రీనివాసరావు, వీడీసీ సభ్యులు, అర్చకులు సేనాపతి సంపత్‌కుమార్‌చారి, ప్రదీప్‌దేశ్‌పాండే, శ్రీనివాసచారి, భక్తులు తదదితరులు పాల్గొన్నారు.
కల్యాణోత్సవంలో విదేశీయుల సందడి
రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఫ్రెండ్‌షిప్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ ప్రొగ్రాంలో భాగంగా జిల్లాకు వచ్చిన అమెరికాలోని జార్జియా స్టేట్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధులు స్వామివారిని దర్శించుకున్నారు. నాగవెళ్లి కార్యక్రమాన్ని తిలకించి వారు ఆనందభరితులయ్యారు. భారతదేశ సాంస్కృతి ఎంతోప్రత్యేకమైనదని, సీతారాముల బ్రహ్మోత్సవ వేడుకల్లో తాము పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment