పేద క్రిస్టియన్లకు ‘షాదీ ముబారక్’ | poor Christians 'Shaadi Mubarak' | Sakshi
Sakshi News home page

పేద క్రిస్టియన్లకు ‘షాదీ ముబారక్’

Published Fri, Apr 24 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

poor Christians 'Shaadi Mubarak'

హైదరాబాద్:  తెలంగాణలోని నిరుపేద క్రిస్టియన్ యువతుల వివాహాలకు షాదీ ముబారక్ పథకం కింద రూ.51 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎం.డి. డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.రెండు లక్షలకు మించని 18 ఏళ్ల వయస్సుపైబడిన పేద యువతులు అర్హులని పేర్కొన్నారు.

2014 అక్టోబర్ 2వ తేదీ తర్వాత వివాహాలు చేసుకున్నవారు సైతం పథకానికి అర్హులని తెలిపారు. షాదీ ముబారక్ పథకం కింద  ఆర్థిక సహాయం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 040-2339 1067లో సంప్రదించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement