పదవికి వన్నె తెస్తా
శివ్వంపేట: తెలంగాణ అసెంబ్లీ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయడంతో పాటు పదవికి వన్నె తీసుకవస్తానని డిప్యూటీ స్వీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని దొంతి వేణుగోపాలస్వామి ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు. దొంతి వేణుగోపాలస్వామి మహిమగల దేవుడని డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి సారిగా వేణుగోపాలస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
పద్మక్కగానే ఆదరించండి
జిల్లా ప్రజల ప్రేమానురాగాల వల్లనే తెలంగాణ రాష్ట్ర మొదటి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యానని, అందుకు జిల్లా ప్రజలకు జీవిత కాలం రుణపడి ఉంటా నిని పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక కావడం తన అదృష్టంగా భావిసున్నానన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరి సహ కారం, అండదండలు అవసరమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.
భారీ ర్యాలీ, సన్మానం
డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికై మొదటి సారిగా జిల్లాకు వచ్చిన పద్మాదేవేందర్‌రెడ్డికి టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి, సన్మానం చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ పద్మాదేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కమలపూల్‌సింగ్ నాయకులు దేవేందర్‌రెడ్డి, వెంకట్‌రామిరెడ్డి, మన్సూ ర్, కల్లూరి హరికృష్ణ, చంద్రాగౌడ్, పిట్ల సత్యనారాయణ, ఆనందరావు, నాగేశ్వర్‌రావు, లక్ష్మినర్సయ్య, మాధవరెడ్డి, అంజయ్య ఉన్నారు.
అవమానాలను ఎదుర్కొన్నాం
తూప్రాన్: సమైక్య రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి మాట్లాడుతూ రకరకాల ఇబ్బందికరమైన జీఓల తో తెలంగాణలోని వనరులను దోచుకవెళ్లే విధంగా ఎన్నో ఎత్తుగడలు శాసన సభలో జరిగేవన్నారు. అప్పుడు శాసన సభ్యురాలిగా తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం చేశామన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల స్వప్నం నేరవేరిందన్నారు. కల నేరవేరిన సందర్భంగా ప్రజలు స్వేచ్ఛా వాయివులు ఆ స్వాదిస్తూనే మరో వైపు తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ కోసం కృషి చేస్తామన్నారు. ప్రతి విషయంలోను ప్రతి పక్షాల సూచనలు, సలహాలు తీసుకుని శాసన సభ వ్యవహారాలు, సాంప్రదాయ బద్ధంగా అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
శాసన సభలో రైతు రుణమాఫీపై సీఎం స్పష్టమైన హా మీ ఇచ్చారన్నారు. రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు మాఫీ కానున్నాయ న్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా శాసన సభలో ఏకగ్రీవం తీర్మానం చేశామన్నారు. అంతకు ముందు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి తొలిసారి తూప్రాన్‌కు వచ్చిన సందర్భంగా స్థానిక సర్పంచ్ చిట్టిమిల్ల శివ్వమ్మ ఆమెను సన్మానించారు. అలాగే నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని సన్మానం చేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, నాగులపల్లిర్పంచ్ శ్రీలం యాదవ్, మధుసూదన్‌రెడ్డి, చంద్రారెడ్డి, షపీయొద్ధీన్ తదితురులు పాల్గొన్నారు.