తెలంగాణలో రోజువారీ ఉత్పత్తి దాదాపు 14 మిలియన్ యూనిట్లు పడిపోయింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రోజువారీ ఉత్పత్తి దాదాపు 14 మిలియన్ యూనిట్లు పడిపోయింది. ఆదివారం ఉదయం రాష్ట్రంలోని థర్మల్‌ప్లాంట్ల నుంచి 44.29 మిలియన్ యూనిట్లు, హైడల్ ప్లాంట్ల ద్వారా 48.36 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పాదన జరిగింది. సోమవారం ఉదయం థర్మల్ కేంద్రాల నుంచి 37.86 మిలియన్ యూనిట్లు, హైడల్ ద్వారా కేవలం 41.62 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగినట్లు టీజెన్‌కో నివేదికలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ ఒకటో తేదీ నుంచిథర్మల్‌ప్లాంట్ల ద్వారా సగటున 45 మిలియన్ యూనిట్లు, హైడల్ ప్లాంట్ల ద్వారా 51 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. ఈ నెలలో ఇంత తక్కువ విద్యుత్తు ఉత్పత్తి జరగడం ఇదే మొదటి సారి. మరమ్మతులకోసం కొత్తగూడెంలోని పదో యూనిట్, మూడోయూనిట్‌లో విద్యుదుత్పత్తిని తెలంగాణ జెన్‌కో నిలిపివేసింది.