దగాపడ్డ రైతన్న
► విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.50 వేల లంచం
► సొమ్ము తీసుకొని అమర్చని వైనం
► వేమనపల్లి ఏఈ, ఎంపీపీపై రైతుల ఆరోపణ
► ఎండుతున్న 60 ఎకరాలు
► ట్రాన్స్‌కో ఎస్‌ఈ దృష్టికి వ్యవహారం
సాక్షి, మంచిర్యాల : క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటు న్న కరెంట్ సమస్య విద్యుత్ అధికారులు, ప్రజాప్రతినిధులపై కాసుల వర్షం కురిపిస్తోంది. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారిని నిలువు దోపిడీ చేస్తున్న సంఘటన లూ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. జిల్లా విశాలంగా ఉండడం.. మారుమూల ప్రాంతంలో జరిగే ఇలాంటి సం ఘటనలు అధికారుల దృష్టికి రాకపోవడంతో పలుచోట్ల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కలిసి రైతులను మోసం చేస్తున్నారు. తాజాగా.. వేమనపల్లి మండలం మంగెనపల్లి లో 20 మంది రైతులు విద్యుత్ ఏఈ, ఎంపీపీ మాయమాటలు విని మోసపోయామని బాధిత రైతులు ‘సాక్షి’తో వా పోయారు. సోమవారం మంచిర్యాల ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి గోడు వెల్లబోసుకున్నారు.
ప్రభుత్వం నుంచి ఉ చితంగా వచ్చిన ట్రాన్స్‌ఫార్మర్ కోసం రూ.50 వేలు పు చ్చుకున్న ఆ ఇద్దరు 45 రోజులు గడుస్తున్నా ఇంత వరకు ట్రాన్స్‌ఫార్మర్ బిగించలేదని ఆరోపించారు. ఫలితంగా మంగెనపల్లిలో 60 ఎకరాల వరి ఎండిపోయే పరిస్థితి నెల కొందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము మోసపోయిన తీ రును బాధిత రైతులు తలండి సురేశ్, ఎనగంటి చిన్నన్న వివరించారు. ‘మా గ్రామంలో మొత్తం 34 రైతు కుటుం బాలున్నాయి. 120 ఎకరాల్లో పంట సాగవుతోంది. ప్ర స్తుతం అందరికీ బోర్లు ఉన్నాయి. గ్రామంలో 100 కె.వి ట్రాన్స్‌ఫార్మర్ ఒక్కటే ఉంది. ఓవర్‌లోడ్‌తో మోటర్లు పాడవుతున్నాయి. చేనుకు నీరందక.. పంటలు ఎండిపోతున్నా యి.
దీంతో ఊర్లో ఇంకో ట్రాన్స్‌ఫార్మర్ కోసం విద్యుత్ ఏఈను కోరాం. దీంతో ఆయన రూ.50 వేల నగదును ఎంపీపీకి ఇవ్వమన్నారు. అవసరం ఉన్న చోట ట్రాన్స్‌ఫార్మర్ పెడ్తాం అన్నరు. మేమందరం డబ్బులు పోగు చేసి ఆత్రం వెంకటస్వామి, తొర్రెం పోచం, సూరం మొండయ్యతో కలిసి మేమూ ఎంపీపీ ఇంటికి వెళ్లి ఆయనకు రూ. 50 వేలు ఇచ్చినం. సొంత రవాణా ఖర్చులు పెట్టుకుని ట్రాన్స్‌ఫార్మర్‌ను గ్రామానికి తీసుకొచ్చినం. నేటికి 45 రో జులు దాటింది. ఇంత వరకు ట్రాన్స్‌ఫార్మర్ బిగించలేదు. ప్రభుత్వం నుంచి ట్రాన్స్‌ఫార్మర్ ఉచితంగా వచ్చినా.. మా నుంచి రూ.50 వేలు తీసుకున్నరు. ఎన్నిసార్లు అడిగి నా స్పందిస్త లేరు. ఇటేమో.. చేనుకు నీరందక 60 ఎకరా ల్లో మా పంటలు ఎండిపోతున్నయ్.
ఇంకొన్ని రోజులు ఇ లానే ఉంటే మేం ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే...’ అని చెప్పారు. ఈ విషయం ట్రాన్స్ కో ఎస్‌ఈ జయవంతరావు చౌహాన్ దృష్టికి వెళ్లడంతో ఆయన బాధితులతో మాట్లాడా రు. వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై వేమనపల్లి ఎంపీపీ కుర్రు వెంకటేశ ం వివరణ ఇ స్తూ..‘రైతులు ఇచ్చిన డబ్బులు ట్రాన్స్‌ఫార్మర్ కోసం వా రితోనే ఖర్చు చేయించా. నేను ఎవరినీ మోసం చేయలే దు. మిగతా విషయాలు ఏఈ వెంకటేశ్వర్లుతో మాట్లాడి తె లుసుకోండి’ అన్నారు. ఏఈ వెంకటేశ్వర్లును సంప్రదించాలని ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.