నకిలీ మందులను అరికట్టాలి | Preventing counterfeit drugs | Sakshi
Sakshi News home page

నకిలీ మందులను అరికట్టాలి

Published Tue, Jan 20 2015 3:39 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

Preventing counterfeit drugs

వినాయక్‌నగర్ : ఫార్మారంగంలో నకిలీ మందులను అరికట్టి, పేటెంట్ చట్టాన్ని సవరిస్తూ బహుళజాతి కంపెనీల పెట్టుబడులను నిలిపివేయాలని తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటీవ్స్ (సీఐటీయూ) యూని యన్ జిల్లా  ఉపాధ్యక్షులు మోహన్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. సోమవారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నేషనల్ ప్రొటెస్ట్‌డే(నిరసన దినం)ను నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ సుంకం అమ్మకందార్లపై కాకుండా ఉత్పత్తిధరలపై విధించాలన్నా రు. ప్రభుత్వ రంగ మందుల కంపెనీలను పునరుద్ధరించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలన్నారు.సమావేశంలో చేసిన తీర్మానాలు ఇలా ఉన్నాయి. భారతదేశ మందుల రంగంపై బహుళజాతి సంస్థల పెత్తనాన్ని నిరోధించాలి. పేటెంట్ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాన్ని విరమించాలి. మందుల ధరలు తగ్గించాలి.

ప్రభుత్వ రంగ మందుల సంస్థల్ని, వ్యాక్సిన్ ప్లాంట్లని పునరుద్ధరించాలి.  కేంద్ర ప్రభుత్వం బహుళజాతి సంస్థలకు మోకాలొడ్డే విధానాలు విడనాడాలి. కేంద్ర ప్రభుత్వం ప్రజలకనుకూలమైన మందుల పాలసీ,  ఆరోగ్యపాలసీలు చేయాలి. ఉత్పత్తి ధరల మీద కాకుండా అమ్మకం ధర మీద సుంకం వేసే విధానాన్ని ఆపి వేయాలి. నిఘా పటిష్ట పరిచి తనిఖీ యంత్రాంగాన్ని బలోపేతం చేసి కల్తీమందులని అరికట్టాలి. తీర్మానాల  కాపీని ప్రధానమంత్రి మోడీకి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సం పత్, జిల్లా సహాయ కార్యదర్శి నరేశ్, పవన్, శ్రీనివాస్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement