‘ధరలను అరికట్టలేని ప్రభుత్వాలు గద్దె దిగాలి’
నిర్మల్‌రూరల్ : పెరుగుతున్న నిత్యవసరాల ధరలను అరికట్టలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర కార్యదర్శి గద్దల శంకర్, జిల్లా అధ్యక్షుడు దేవోళ్ల గంగాధర్ డిమాండ్ చేశారు. స్థానిక ఎస్‌టీయూ భవన్‌లో బుధవారం పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దల శంకర్ మాట్లాడుతూ ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్‌తోపాటు నిత్యవసరాల ధరలను ఏమాత్రం అరికట్టలేకపోయిందని విమర్శించారు.
ఇప్పటికీ పప్పుల ధరలు చుక్కలనంటుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లా అధ్యక్షుడు దేవోళ్ల గంగాధర్ మాట్లాడుతూ ముఖ్య కార్యకర్తలకు ఈ నెల 26న శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ నియోజకవర్గం నుంచి 25మందికి తగ్గకుండా హాజరు కావాలని పేర్కొన్నారు. సమావేశంలో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిదాస్ హస్డే, బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ పట్ల బాపురావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మార రాజన్న, నిర్మల్, ముథోల్, బోథ్, ఆదిలాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల అధ్యక్షుడు బొరోళ్ల ముత్యం, రవిచంద్రగౌడ్, హెచ్.ప్రకాశ్, డాక్టర్ గంగాధర్, రొడ్డ నారాయణ, హరినాథ్, పుట్టి పోశెట్టి, మనోజ్, జంగుబాబు, గంగయ్య, రాజేశ్వర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.