‘ఇంటర్’కు ఇబ్బందులెన్నో.. | principal posts vacancies in inter college | Sakshi
Sakshi News home page

‘ఇంటర్’కు ఇబ్బందులెన్నో..

Published Sun, Sep 7 2014 12:39 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

principal posts vacancies in inter college

 మంచిర్యాల సిటీ : ప్రతీ విద్యార్థికి అత్యంత కీలక దశ ఇంటర్మీడియెట్. ఉన్నత విద్యకు ఇక్కడే పునాది పడుతుంది. భవిష్యత్‌కు మార్గనిర్దేశనం చేస్తుంది. అంతటి ప్రాధాన్యం కలిగిన ఇంటర్ విద్యకు జిల్లాలో అన్నీ ఇక్కట్లే. కీలకమైన వివిధ పోస్టులు ఖాళీగా ఉండడంతో జిల్లాలోని 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితి అధ్వానంగా మారింది. ఖాళీలు వెక్కిరిస్తుండడంతో పూరిస్థాయిలో బోధన జరగక విద్యార్థులు చదువులో వెనుకబడే పరిస్థితి తలెత్తుతోంది.

 డీవీఈవో.. : జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషన్ అధికారి పోస్టు ఖాళీగానే ఉంది. ఈ అధికారి కేవలం ప్రభుత్వ కళాశాలలను పర్యవేక్షించి, ఉత్తమ ఫలితాలు సాధిం చేందుకు కృషి చేయాలి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా డీవీఈవో వెంకటయ్య ఇక్కడ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈయనే ఇంటర్ వరంగల్ ఆర్జేడీగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వెంకటయ్య 2015, జూన్‌లో ఉద్యోగ విరమణ చేయనుండగా.. ఒక్క అధికారిపైనా ఇన్ని బాధ్యతలు మోపడంతో ఇంటర్ విద్య పూర్తిస్థాయిలో న్యాయం జరగడంలేదని స్థానికంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

 ప్రిన్సిపాళ్లు.. : జిల్లాలో 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు తొమ్మిది కళాశాలల ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తానూర్, కౌటాల, దహెగాం, బెజ్జూర్, బెల్లంపల్లి(బాలికలు), మందమర్రి, కుభీర్, సారంగాపూర్, నార్నూర్ మండల కేంద్రాల్లోని కళాశాలలకు అక్కడి సీనియర్ అధ్యాపకుడే ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. కుభీర్, నార్నూర్ మండలాలకు కళాశాలలను మంజూరు చేసినా అధికారులు కనీసం ప్రిన్సిపాల్ పోస్టు కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం.

 అధ్యాపకులు.. : జిల్లాలోని 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు 552 మంది అధ్యాపకులు అవసరం. ఇం దులో నేరుగా నియామకమైన వారు 80 మంది మా త్రమే. 400 మంది కాంట్రాక్టు, ఉద్యోగ విరమణ పొం దినవారు తరగతులు బోధిస్తున్నారు. మరో 72 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉండడంతో బోధన కుంటుపడిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

 ఏకైక పీడీ.. : జిల్లాలో ఒకేఒక ఫిజికల్ డెరైక్టర్ ఉన్నాడు. అది కూడా కాసిపేట జూనియర్ కళాశాలకు మాత్రమే. మిగ తా 45 కళాశాలలకు పీడీలు లేకపోవడంతో ఆటలంటే ఎలా ఉంటాయో తెలియని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారు.

 లైబ్రేరియన్లదీ అదే పరిస్థితి..
 జిల్లాలో 12 కళాశాలల్లో లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేరడిగొండ, జైనూర్, కెరమెరి, ఉట్నూర్, తిర్యాణి, బోథ్, వాంకిడి, బెజ్జూర్, మామడ, బేల, ఇంద్రవెల్లి, కడెం కళాశాలల్లో లైబ్రేరియన్ లేరు. దీం తో విద్యార్థులు గ్రంథాలయ సేవలు పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నారు.  

 బోధనేతర సిబ్బంది
 ప్రతీ జూనియర్ కళాశాలకు అటెండర్, వాచ్‌మన్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ ఉండాలి. 90 శాతం కళాశాలల్లో పూర్తి స్థాయిలో బోధనేతర సిబ్బంది లేరు. దీంతో అన్నీ తాైమై అధ్యాపకులు, విద్యార్థులు పనులు కానిచ్చేస్తున్నారు.

 ఒక్కరికి ఎన్ని పనులో..
 బెజ్జూర్, కౌటాల, దహెగాం, నార్నూర్, తానూర్, తిర్యాణి, బెల్లంపల్లి(బాలికలు) కళాశాలలకు ఒకే ఒక్క రెగ్యులర్ అధ్యాపక పోస్టు మంజూరైంది. ఆ ఒక్కరే ఆ కళాశాలకు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించాలి. కళాశాల రికార్డులు, విద్యార్థుల ఫీజు, పరీక్ష, ప్రవేశాలు, అధికారులు.. ఉన్నతాధికారుల సమావేశాలకు హాజరు ఇలా.. వివిధ పనులన్నీ తానే చూసుకోవాల్సి వస్తోంది. ఆ పనులన్నీ చేసుకోలేక హైరానా పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement