అటవీ సంపదను కాపాడండి | Protecting of forest wealth | Sakshi
Sakshi News home page

అటవీ సంపదను కాపాడండి

Published Sat, May 24 2014 2:57 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM

Protecting of forest wealth

వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : అటవీ ప్రాంతంలోకి భారీ వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ఇతరులు అడవిలోకి ప్రవేశించి వంట చెరుకుకూడా తీసుకెళ్లకూడదని నిజామాబాద్ రేంజ్ అధికారి రవిమోహన్‌భట్ చెప్పారు. శుక్రవార  నిజామాబాద్ రేంజ్ కార్యాలయంలో అటవీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో రవి మాట్లాడారు. అడవి సంపదను అడ్డ దారిన దోచుకునే స్మగర్లకు అడ్డుకట్ట వేసేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. సాసర్‌పిట్స్‌లో నీటిని శుభ్రంగా ఉంచాలన్నారు. వన్యప్రానులు, వేటాగాళ్లపై ప్రత్యేకదృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. వంటచెరుకును అక్రమంగాతరలిస్తే ఉపేక్షించేది లేదన్నారు.

 అడవి సంపదను కాపాడటం తమ బాధ్యత అని, ఇందుకు ఉన్నతాధికారులు డీఎఫ్‌ఓ భీమానాయక్, సబ్ డీఎఫ్‌ఓ గోపాలరావు సూచనల మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రవి పేర్కొన్నారు. అటవీ భూమిని అక్రమించినా, చెట్లు నరికినా అటవీ శాఖ యాక్ట్ ప్రకా రం కేసులు నమోదు చేస్తామన్నారు. వన్య ప్రాణులను వేటాడి చంపితే వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసులు చెస్తామన్నారు. అటవీ సంపద కాపాటడం మన అందరి బాధ్యత అని అన్నారు. సమావేశంలో సెక్షన్ అధికారులు వెంకట్రాం, ఫయాజ్ ఎల్‌హఖ్, బాల్‌రాజ్‌గౌడ్, బీట్ ఆఫీసర్లు సుబ్బారావు, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement