ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం | public's confidence on the judiciary | Sakshi
Sakshi News home page

ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం

Published Wed, Nov 12 2014 3:30 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

public's confidence on the judiciary

ఆదిలాబాద్ క్రైం : సమస్యలు సత్వరమే పరిష్కరించడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందని హైకోర్టు జడ్జి జి.చంద్రయ్య అన్నారు.రెండవ జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకొని మంగళవారం  జిల్లా కోర్టు ఆవరణలో గల న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో సన్నద్ధ సమావేశం ఏర్పాటు చేశా రు.

 ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి చం  ద్రయ్య ప్రసంగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39-ఏ ప్రకారం 1987లో న్యాయసేవాధికార చట్టం అమల్లోకి వచ్చిందని, కేసులను సత్వరమే పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రెండో జాతీయ లోక్ అదాలత్‌లో అన్ని ప్రభుత్వ శాఖలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంక ర్లు, కక్షిదారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా జడ్జి గోపాలకృష్ణమూర్తి, ప్రత్యేక కోర్టు జడ్జి రాజ్‌కుమార్, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి అజిత్‌సింహరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బిపిన్‌కుమార్‌పటేల్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement