ధర్మపురిలో కన్నులపండువగా పుష్కర వేడుకలు | Pushkara ending ceremony at dharmapuri | Sakshi
Sakshi News home page

ధర్మపురిలో కన్నులపండువగా పుష్కర వేడుకలు

Published Sat, Jul 25 2015 7:57 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

Pushkara ending ceremony at dharmapuri

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గోదావరి పుష్కరాలు కన్నుల పండువగా ముగిశాయి. ఇక్కడ జరిగిన ముగింపు వేడుకల కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, స్వామి పరిపూర్ణానంద, తదితరులు పాల్గొన్నారు. చివరిరోజైన 12వ రోజు ధర్మపురిలో 6.8 లక్షలు, కాళేశ్వరంలో 6 లక్షలు, కోటిలింగాలలో లక్ష మంది, మంథనిలో 50 వేల మంది, గోదావరిఖనిలో 60 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. మహిళలు గోదారమ్మకు పూజలు చేసి, పసుపుకుంకుమలు సమర్పించారు. మగవారు తమ పితృదేవతలకు పిండప్రదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్లు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement