
సాక్షి, ఖమ్మం : ఆర్టీసీ డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సంతాపం ప్రకటించారు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘శ్రీనివాస్‌రెడ్డి మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. శ్రీనివాస్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెందిన శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఆత్మాహుతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఖమ్మం డిపోలో డైవర్‌గా పనిచేస్తుండేవాడు.
(చదవండి : డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత)
Comments
Please login to add a commentAdd a comment