కొందరికి ప్రత్యేకం
► క్వారీల్లో అంతులేని అక్రమాలు
► ఒక్కో దానికి ఒక్కో బినామీ
► ఏటూరు క్వారీలో భారీగా దందా
► తెరవెనక నడిపిస్తున్న అధికారులు
సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ ఇసుక క్వారీల్లో అధికారులు, కాంట్రాక్టర్ల అక్రమాలకు అంతులేకుండాపోతోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ క్వారీల్లోనూ భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి నష్టం చేసేలా ఇసుకను పరిమాణం కంటే ఎక్కువ పోసే విషయంలో మరిన్ని అవకతవకలు బయటపడుతున్నాయి. గోదావరి నుంచి డంప్‌యార్డుకు ఇసుకను తరలించే కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి ఇసుకను అక్రమ మార్గంలో అమ్ముకుంటున్నారు. ఒక్కో క్వారీలో ఒక్కో వ్యాపారితో ఒప్పందం చేసుకుని... ఆ వ్యాపారీ లారీలో రాగానే పొక్లెరుునర్‌తో ఐదు బకెట్ల వరకు ఇసుకను అనధికారికంగా అధికంగా లోడ్ చేస్తున్నారు.
పదుల సంఖ్యలో లారీలు ఉన్న వ్యాపారులతో క్వారీకి ఒకరు చొప్పున అధికారులు ఈ అక్రమాల్లో భాగస్వామలవుతున్నారు. అక్రమమార్గంలో తరలించిన ఇ సుకతో వచ్చే ఆదాయాన్ని నెలకోసారి భాగాలుగా చేసుకుంటారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 1 నుంచి ఇసుక కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానం మేరకు జిల్లాలో ప్రస్తుతం ఏటూరు-ఏ, ఏటూరు-బీ,ఏటూరు-2,ఏటూరు-3, సింగారం, తుపాకులగూడెం, రామన్నగూడెం, చుంచుపల్లిల్లో క్వారీలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎండీసీ) ఆధ్వర్యంలో ఈ క్వారీలు నడుస్తున్నాయి. ఏటూరు ఏ, ఏటూరు బీ, ఏటూరు 2, ఏటూరు 3 క్వారీల్లోకి వెళ్లే ప్రతి లారీలో అదనంగా ఐదు టన్నుల వరకు ఇసుకను అక్రమం గా లోడింగ్ చేస్తున్నారు.
ఇలా ప్రభుత్వానికి ప్రతి రోజు దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం జరుగుతోంది. దీనికి కొనసాగింపుగా ఈ క్వారీల్లోనే అధికారుల చొరవతో మరింత జోరుగా అక్రవ వ్యవహారాలు జరుగుతున్నాయి. ఏటూరు ఏ, ఏటూరు బీ, ఏటూరు 2, ఏటూరు 3 క్వారీలకు సంబంధించి 20 లారీలు ఉన్న వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ వ్యాపారుల లారీల నెంబర్లను క్వారీ ని ర్వాహకుల వద్ద ఉంటున్నారుు. లారీల నెంబర్ల జాబితా ఆధారంగా ఆ వాహనాలు రాగానే వాటిని ప్రత్యేకంగా గుర్తించి ఒక్కో లారీలో అదనంగా 20 టన్నుల ఇసుకను లోడింగ్ చేస్తున్నారు.ఇలా నాలుగు క్వారీల్లో భారీగా అక్రమ మార్గంలో ఇసుక తరలిపోతుండడంతో మిగిలిన క్వారీలపై ప్రభావం పడుతోంది.
ఈ నాలుగు క్వారీలతో పోల్చితే తక్కువ ఇసుక వస్తుందనే కారణంతో లారీల నిర్వాహకులు తుపాకులగూడెం, సింగారం, రామన్నగూడెం క్వారీలకు లా రీలు వెళ్లడం లేదు. ఇక్కడ డంప్‌లో ఇసుక పేరుకుపోతోం ది. లారీలు రాకుంటే క్వారీ ఎందుకని, అదనంగా ఇసుక పో స్తే లారీలు వస్తాయని టీఎస్‌ఎండీసీ అధికారులు ఈ క్వారీ ల నిర్వాహకులకు సలహాలు ఇస్తూ పరోక్షంగా అక్రమాలు జరిగేలా చేస్తున్నారు. అధికారుల ఒత్తిడి పెరిగితే ఈ క్వారీ ల్లోనూ అక్రమంగా ఇసుక దందా జరిగే పరిస్థితి వస్తుంది.