
రాహుల్ పర్యటన వాయిదా
హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్రంలో చేపట్టనున్న రైతుభరోసా యాత్ర వాయిదా పడింది. ఈ నెల 11న రావాల్సి ఉండగా వాయిదా నేపథ్యంలో 14న హైదరాబాద్ చేరుకోనున్నారు.పార్లమెంట్‌లో ఈ నెల 11 నుంచి 13 తేదీల్లో కీలకమైన భూసేకరణ బిల్లుపై చర్చ నేపథ్యంలో ఆయన పర్యటనలో మార్పులు జరిగాయి. రాహుల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు శుక్రవారం నిర్మల్‌కు వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఏఐసీసీ వర్గాల నుంచి ఈ సమాచారం అందింది. 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ హైదరాబాద్‌కు చేరుకుంటారు.
రోడ్డు మార్గాన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తారు. 15వ తేదీ ఉదయం నిర్మల్‌లోని మడియాల నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారు. అదేరోజు సాయంత్రం పొరటికల్‌లో ఆయన పర్యటన ముగియనుంది. రాహుల్ గాంధీ పర్యటన తేదీల్లో మాత్రమే మార్పు చోటు చేసుకుందని, మిగిలిన పర్యటన అంతా ముందు ప్రకటించిన విధంగానే కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. లోక్‌సభ సమావేశాలు మరో 3 రోజులు పొడిగించినందున మే 11, 12 తేదీల్లో ఉండాల్సిన తెలంగాణ పర్యటన 14, 15 తేదీలకు వాయిదాపడినట్లు రాహుల్‌గాంధీ కార్యాలయం ట్వీటర్‌లో ప్రకటించింది.