ముసురు..!
పాలమూరు : జిల్లాలో రెండురోజుల నుంచి ముసురు వర్షం పట్టుకుంది. భారీగా కురవక పోయినప్పటికీ.. అక్కడక్కడా చిరుజల్లులు పడుతుండడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పోయింది. వాతావరణ విభాగం వారు సూచించిన మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా 13.2 మి.మీ వర్షపాతం నమోదయింది. అడ్డాకుల మండలంలో 36.4 మిల్లీ మీటర్లతో అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. దేవరక ద్ర 35.0 మి.మీ, ధన్వాడ 27.0 మి.మీ, బల్మూర్ 26. 2, కోస్గి 26.0 మి.మీ, గో పాల్‌పేట 25.2 మి.మీ, నర్వ, ఊట్కూర్ 24.0 మి.మీ, హన్వాడ 23.0 మి.మీ, కొడంగల్, వనపర్తి 22.0 మి.మీ.
మహబూబ్‌నగర్ 21.4 మి.మీ, బిజినేపల్లి 21.0 మి.మీ, పెద్దమందడి 20.2 మి.మీ, మక్తల్ 20.0 మి.మీ, అచ్చంపేట 19.0 మి.మీ, అలంపూర్ 18.2 మి.మీ, ఆత్మకూర్, అమ్రాబాద్ 18.0 మి.మీ, కొల్లాపూర్ 17.0 మి.మీ, వడ్డేపల్లి 16.8 మి.మీ, కొత్తకోట 16,2 మి.మీ, నాగర్‌కర్నూల్ 15.4 మి.మీ, దౌల్తాబాద్, మద్దూరు, భూత్పూర్ 15.0 మి.మీ వర్షం పడింది. దామరగిద్ద, లింగాల, బొంరాస్‌పేట, కొయిలకొండ, తెలకపల్లి, ఉప్పునుంతల, తాడూర్, మాగనూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, ఘనపూర్.
నవాబుపేట, బాలనగర్, కొందుర్గు, కేశంపేట, నారాయణపేట, తలకొండపల్లి, ఆమన్‌గల్, చిన్నచింతకుంట, పాన్‌గల్, పెబ్బేరు, గద్వాల,ధరూర్, మల్దకల్, గట్టు, వీపనగండ్ల, అయిజ, మాడ్గుల, వంగూరు, ఇటిక్యాల, మానోపాడు, కల్వకుర్తి, మిడ్జిల్, తిమ్మాజీపేట, జడ్చర్ల మండలాల్లో 15 మి.మీ లోపు వర్షపాతం వర్షపాతం కురిసింది.