
ఆప్షన్లుండవని చెప్పడానికి కేసీఆర్ ఎవరు?
ఉద్యోగులకు ఆఫ్షన్లు ఉండవని చెప్పడానికి కేసీఆర్ ఎవరని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ప్రశ్నించారు. ఆఫ్షన్లు ఉంటాయని చట్టంలోనే ఉందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌కు తాము వ్యతిరేకం కాదని, సమస్యలుంటే కొత్తగా ఏర్పడే ఆంధ్రా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకుంటామని ఆయన అన్నారు.
ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు అక్కడ, తెలంగాణ వాళ్లు ఇక్కడ మాత్రమే ఉద్యోగాలు చేసుకోవాలని, అంతేతప్ప ఆప్షన్లు ఉండబోవని కేసీఆర్ బుధవారం నాడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాజనరసింహ స్పందించారు.