
ఎస్‌ఆర్‌ఓతో మాట్లాడుతున్న రాజీవ్ కనకాల
జడ్చర్ల : జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సినీనటుడు రాజీవ్ కనకాల బుధవారం కొద్దిసేపు సందడి చేశారు. ఆయన బాలానగర్ మండలంలోని హేమాజీపూర్ గ్రామ శివారులో గల తన సొంత భూమికి సంబందించి బ్యాంకు లోన్ నిమిత్తం తనఖా పెట్టేందుకు కార్యాలయానికి వచ్చారు.
ఈ సందర్బంగా ఆయన స్థానిక సబ్‌రిజిస్ట్రార్ అశోక్‌తో మాట్లాడి నిబందనల మేరకు సంతకాలు చేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న కొందరు ఆయనను చూసేందుకు వచ్చారు. మరికొందరు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment