
సాహిత్య మేధోమథన కేంద్రంగా రవీంద్రభారతి
► కళాభవన్‌ను ఆధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దాలి: కేసీఆర్
► రవీంద్రభారతిలోనే సాహిత్య అకాడమీ కార్యాలయం
► రవీంద్రభారతి ప్రాంగణంలో కలియతిరిగిన ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర నడిబొ డ్డున ఉన్న రవీంద్రభారతిని సాహితీ–సాంస్కృ తిక మేధోమథన కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఇక్కడ నిరంతర ప్రక్రియలు కొనసాగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. కళాభవన్‌కు ఆధునాతన సౌకర్యాలతో హంగులు అద్దాలన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయాన్ని కూడా రవీంద్రభారతిలోని కళాభవన్‌లోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సాహిత్య అకాడమీ, సాంస్కృతిక శాఖ సమన్వయంతో పని చేయాలన్నారు. సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం రవీంద్రభారతి ప్రాంగణమంతా కలియ తిరిగారు. సాంస్కృతిక శాఖ కార్యాలయం నిర్వహిస్తున్న బ్లాకును, పరిసర పాంత్రాలను పరిశీలించారు. రవీంద్రభారతిని మరింత గొప్పగా వినియోగిం చేందుకు చేపట్టవలసిన చర్యలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవీంద్రభారతిలో పచ్చిక బయళ్లు, పార్కింగ్ స్థలాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. రవీంద్రభారతి నైరుతీ భాగంలో ఎత్తు పెంచాలని, ఆ భాగంలోని దారిని మూసేయాలని సాంస్కృతిక శాఖ అధికారులకు సీఎం సూచించారు.
పెయింటింగ్ ప్రదర్శన తిలకించిన సీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్.. తాను వస్తున్నట్లు ఒక రోజు ముందే చెప్పి రవీంద్రభారతికి వచ్చారు. సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి చాం బర్‌ను ఆయన సందర్శించారు. అదే భవన్‌లో ఉన్న భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కార్యాల యాన్ని కూడా పరిశీలించారు. ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న బాతిక్ పెయింటింగ్ ప్రదర్శనను తిలకించిన ముఖ్యమంత్రి.. తెలంగాణ సంస్కృ తికి సంబంధించిన పెయింటింగ్‌ను చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మహాసభలకు తగిన ఏర్పాట్లు చేయాలి
సాహిత్య అకాడమీకి చెందిన ప్రక్రియ అంతా రవీంద్రభారతిలోనే ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి సాహిత్య అకాడమీ కృషి చేయాల్సి ఉంటుంద న్నారు. అక్టోబర్‌లో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలకు తగిన ఏర్పాట్లు చేయాలని, దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
తెలుగు భాషను కాపాడేందుకు, తెలుగు భాష ఔన్నత్యాన్ని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సాహిత్య అకాడమీ సూచనలు చేయాలన్నారు. సీఎం వెంట హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీఎస్ ఎస్‌పీ సింగ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదిర్శ బుర్రా వెంకటేశం, టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టీనా జెడ్ ఛోంగ్తూ, సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.