అనాథల మధ్య వ్యాపారి పుట్టినరోజు వేడుకలు | reemadev birthday celebrates at sneha ghar home | Sakshi
Sakshi News home page

అనాథల మధ్య వ్యాపారి పుట్టినరోజు వేడుకలు

Published Wed, Jul 1 2015 7:10 PM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

అనాథల మధ్య వ్యాపారి పుట్టినరోజు వేడుకలు

అనాథల మధ్య వ్యాపారి పుట్టినరోజు వేడుకలు

రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): పుట్టిన రోజు వేడుకలను ఆడంబరంగా చేసుకోవడం నేడు సంపన్నులతో పాటు మధ్య తరగతి వారిలోనూ సాధారణమైపోయింది. కానీ ఓ మహిళా వ్యాపారవేత్త తన పుట్టిన రోజు వేడుకలను అనాథ పిల్లల మధ్య జరుపుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. బేగంపేట్‌కు చెందిన రీమాదేవ్ ఇంటీరియర్ రంగంలో వ్యాపారి.

ఆమె భర్త ప్రసూన్ దేవ్ కిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ గా చేస్తున్నారు. బుధవారం రీమాదేవ్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి వచ్చి ఆదయ్యనగర్‌లోని అమన్ వేదిక స్నేహ ఘర్ హోంలో చిన్నారుల మధ్య తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. వారికి స్వీట్లు పంచి పెట్టి విందును ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారి మధ్యే ఉండి చిన్నారులతో సందడిగా గడిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement