orphan house
-
ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయి.. ఇంటికి చేరిన బాలిక
వెంగళరావునగర్: దాదాపు ఎనిమిదేళ్ల కిందట తప్పిపోయిన ఓ బాలిక సోమవారం తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఓ టీవీ కార్యక్రమం ఆ బాలిక పాలిట వరంలా మారి..అనాథ జీవితానికి తెర పడింది. వివరాల్లోకి వెళ్తే..ఈసీఐఎల్ కమలానగర్‌కు చెందిన పిన్నమోని కృష్ణ, అనూరాధ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఇందు, సింధు కవలలు. 2014లో వినాయక ఉత్సవాలకు వెళ్ళిన సందర్భంగా ఇందు అనే మూడున్నరేళ్ల కుమార్తె తప్పిపోయింది. ఆ సమయంలో ఆ పాపను ఓ మహిళ తీసుకెళ్లినట్టుగా సీసీ టీవీలో కూడా కనిపించింది. దాంతో తల్లిదండ్రులు నాటి నుంచి చాలా ప్రాంతాల్లో గాలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇటీవల ఓ టీవీ చానల్ కార్యక్రమంలో ఆ పాప కనిపించడంతో తల్లిదండ్రులు గుర్తించి తమ కుమార్తెలాగానే ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఆరా తీశారు. టీవీ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు. ఎక్కడ నుంచి వచ్చారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ కమిటీ అధికారులను కలిసి విషయం తెలిపారు. వారి సాయంతో కిస్మిత్పూర్లోని చెరిస్ అనాథ బాలికల సంరక్షణ కేంద్రాన్ని చేరుకున్నారు. అక్కడ ఉన్న పిల్లల్లో తమ కుమార్తె ఉండటంతో తల్లిదండ్రులు గుర్తించి అధికారులకు తెలియజేశారు. దాంతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రంగారెడ్డి, జిల్లా బాలల హక్కుల చైర్మన్ నరేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ అధికారి ప్రవీణ్‌కుమార్, మహిళా శిశుసక్షేమశాఖ అధికారులు తల్లిదండ్రుల వద్ద వివరాలను, ఆ బాలిక వివరాలను పరిశీలించారు. ఎనిమిదేళ్ల కిందట తప్పిపోయిన పాప, అనాథాశ్రమంలో ఉన్న పాప ఒక్కరే అని నిర్ధారణకు వచ్చారు. సోమవారం స్థానిక మధురానగర్‌లో ఉన్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధాన కార్యాలయంలో తల్లిదండ్రులకు తమ కుమార్తెను అప్పజెప్పారు. తప్పిపోయిన తమ కుమార్తె తిరిగి తమ వద్దకు చేరడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి.. వంట విషయంలో గొడవపడి) -
ఆమెకు గర్భసంచితోపాటు.. ప్రేమ సంచి కూడా ఉంది..
స్త్రీలందరికీ గర్భసంచి ఉంటుంది. కాని అమెరికా టీచరమ్మ క్రిస్టిన్ గ్రేకు ప్రేమ సంచి ఉంది. జీవితంలో మగతోడు లేకుండా జీవించాలనుకున్న క్రిస్టిన్ అనాథ ఆడపిల్లలకు అమ్మ కాదలుచుకుంది. మున్ని, రూప, మోహిని, సోనాలి, సిగ్ధ... 2013తో మొదలయ్యి 2020లోపు ఐదుమంది మన దేశపు అనాథ ఆడపిల్లలను దత్తత తీసుకుంది క్రిస్టిన్. ఆడపిల్లలు అనాథాశ్రమంలో కంటే ఇళ్లల్లో కూతుళ్లుగా పెరగడం మంచిది అంటుందామె. ఆ కూతుళ్లను సొంత కూతుళ్లుగా అడాప్ట్ చేసుకునే అమ్మను మించిన ప్రేమ అందరికీ ఉండొద్దూ... 2015. గుజరాత్. కచ్‌లోని అనాథ బాలికల కేంద్రం ‘కచ్ మహిళా కల్యాణ్ కేంద్ర’లోని మూడున్నరేళ్ల బాలికను దత్తత తీసుకోవడానికి అమెరికా నుంచి క్రిస్టిన్ వచ్చింది. ఆ బాలిక పేరు రూప. సాధారణంగా అనాథ బాలికలను దత్తత తీసుకునేవారు మన దేశంలో చాలామంది ఉన్నారు. కాని వారంతా రూపను దత్తత తీసుకోవడానికి ఇష్టపడలేదు. దానికి కారణం ఆ పాపకు ముక్కు లేకపోవడమే. ఆ పాపను కన్నతల్లి చెత్త కుప్పలో పారేస్తే కుక్కలు ముక్కును కొరికేశాయి. కొనప్రాణంతో ఉన్న రూపను కాపాడి పెంచారు. ఇప్పుడు ఆ పాపను ఎంతో ప్రేమగా దత్తత తీసుకోవడానికి వచ్చింది క్రిస్టిన్. ‘ఈ పాపకు కూడా ఒక కుటుంబం ఉండే హక్కు ఉంది’ అందామె. ‘పాపకు తగిన వయసు వచ్చాక అమెరికాలో ముక్కుకు సర్జరీ చేయిస్తాను’ అని కూడా అంది. ఆమె గొప్పతనానికి అందరూ తల వొంచి నమస్కరించారు. రూపకు ఒక గొప్ప తల్లి దొరికింది. 2013. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటీలో సెకండరీ టీచర్‌గా పని చేస్తున్న క్రిస్టిన్ గ్రేకు 39 ఏళ్లు వచ్చాయి. జీవితంలో తారసపడిన మగవారు ఎవరూ ఆమెకు పెళ్ళి బంధంలోకి వెళ్లదగ్గ గట్టివాళ్లుగా కనిపించలేదు. ‘నేను నా శేషజీవితాన్ని ఒంటరిగా గడపదలుచుకున్నాను’ అని నిర్ణయం తీసుకుందామె. జీవించడానికి కావలసినవి ఆమె వద్ద ఉన్నాయి– మాతృత్వ భావన తప్ప. ‘అమ్మను కాలేకపోయాను కదా’ అనుకుంది. కొన్నాళ్లు ఆలోచించాక ‘నేనే కనాలా? ఎంతమంది అనాథ పిల్లలు ఉన్నారు. వారిని దత్తత తీసుకుంటాను’ అని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఆమె అన్వేషణ మొదలైంది. మొదట నేపాల్ నుంచి తీసుకోవడానికి బోలెడు డబ్బు ఖర్చు పెట్టింది. తీరా అడాప్ట్ చేసుకునే సమయానికి అమెరికాలో నిబంధన వచ్చింది– నేపాల్ నుంచి దత్తత తీసుకోరాదని. ఆ తర్వాత ఆమె ఇండియాను ఎంచుకుంది. రెండేళ్ల ప్రయత్నం తర్వాత ఇక్కడి దత్తత ఏజెన్సీ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. ‘పాప ఉంది. అయితే ఆమెకు ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి. తీసుకుంటారా?’ అని. ఆ పాప పేరు మున్నీ. వెంటనే సంతోషంతో క్రిస్టిన్ అంగీకరించింది. కాని తండ్రి ‘ఆ తీసుకునేదేదో మన దేశంలోని తెల్లమ్మాయిని తీసుకోవచ్చు కదా’ అన్నాడు. క్రిస్టిన్ ఆ మాటకు నొచ్చుకుంది. తండ్రి సర్దుకున్నాడు. అంతే కాదు మున్నీని అమెరికా తీసుకురావడంలో కావలసిన ధన సహాయం చేస్తూ ‘మున్నీ గ్రే’ కోసం అని చెక్ రాసి ఇచ్చాడు. అలా క్రిస్టిన్ జీవితంలో మొదటిసారి అమ్మ అయ్యింది. రెండేళ్లు గడిచాయి. మళ్లీ భారత్ నుంచి ఫోన్ వచ్చింది– ముక్కు లేని అమ్మాయి ఉంది తీసుకుంటారా అని. ముక్కు లేకపోతే పాప పాప కాకుండా పోతుందా... నేను అమ్మనవుతాను అంది క్రిస్టిన్. అలా రూప ఆమె జీవితంలోకి వచ్చింది. కాని రూప కొన్నాళ్ల పాటు రోజంతా ఏడుస్తూ ఉండేది. అప్పటికే దత్తతకు వచ్చిన మున్నీకి, రూపకు అసలు పడేది కాదు. ‘రూపను దత్తత తీసుకుని తప్పు చేశానా?’ అని అనుకుంది క్రిస్టిన్. కాని ఒకరోజు హటాత్తుగా మున్ని,రూప బెలూన్‌తో ఆడుకోవడం మొదలెట్టారు. క్రిస్టిన్ కన్నతల్లి వారితో జతయ్యింది. సంతోషాలు క్రిస్టిన్ జీవితంలో మొదలయ్యాయి. మన దేశంలో అనాథలకు కొదవలేదు. కని వదిలిపెట్టేవారు, ఇళ్ల నుంచి పారిపోయేవారు, భిక్షాటన కోసం ఎత్తుకు రాబడ్డవాళ్ళు, అయినవారిని కోల్పోయిన వారు... అలా మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు... దత్తత తీసుకుంటారా అంటే సరే అంది క్రిస్టిన్. మోహిని, సోనాలి ఆమె జీవితంలోకి వచ్చారు. ‘ఇప్పుడు నా కుటుంబం నిజంగానే కొంచెం పెద్దదయ్యింది’ అంది క్రిస్టిన్. అప్పటికే స్కూల్ జీతం చాలదని రియల్ ఎస్టేట్‌లో దిగిన క్రిస్టిన్ తన పిల్లల కోసం ఎక్కువ సంపాదించడానికి కావలసిన పనులన్నీ చేయసాగింది. నలుగురు ఆడపిల్లల తల్లి తను. ఎంత ఖర్చు ఉంటుంది. ‘నేను ఇంట్లో నుంచి ఒక్క క్షణం బయటకు వెళ్లడానికి ఇష్టపడను. నా పని కంప్యూటర్ మీదే చేస్తాను. నా సమయం అంతా ఆ నలుగురు పిల్లల నవ్వుల్ని, కొట్లాటల్ని చూడటమే సరిపోతుంది’ అంటుంది క్రిస్టిన్. ఇంతవరకు కూడా ఆమె సగటు స్త్రీ అనే అనుకోవచ్చు. కాని ఆమెకు డౌన్ సిండ్రోమ్ ఉన్న అనాథ అమ్మాయిల పరిస్థితి ఏమిటి... అలాంటి ఒక అమ్మాయిని దత్తత తీసుకుందాం అని ఎంచి మరీ డౌన్ సిండ్రోమ్ ఉన్న అమ్మాయిని 2020లో అమెరికా తెచ్చుకుంది. ఐదుగురు పిల్లల తల్లి క్రిస్టిన్ ఇప్పుడు. అమ్మల్ని మించిన అమ్మ. సంతోషంగా జీవించాలని ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ఆ సంతోషం కోసం కొందరు పిల్లల్ని వద్దు అనుకుంటుంటే క్రిస్టిన్లాంటి వాళ్లు తమకు పుట్టకపోయినా పిల్లలు కావాలనుకుంటున్నారు. జీవితం అర్థవంతం చేసుకోవడం ఇలాంటి వారి వల్లే అవుతుంది. వెల్డన్ క్రిస్టిన్. -
అమీన్పూర్ ఘటన.. గుర్తింపు తప్పనిసరి
సాక్షి, సిటీబ్యూరో: అనాథ శరణాలయాలపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేట్, ఎన్జీఓ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీస్తోంది. నగర శివార్లలోని అమీన్‌పూర్‌లోని అనాథ శరణాలయంలో లైంగిక దాడికి గురై మృతి చెందిన 14 ఏళ్ల బాలిక ఉదంతాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు ఆశ్రమం రిజిస్ట్రేషన్ రద్దు చేయడతో పాటు అక్కడి పిల్లలను సైతం ప్రభుత్వ హోమ్‌కు తరలించారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉపక్రమించినట్లు సమాచారం. ప్రధానంగా నగరంలోని అనాథాశ్రమాల వివరాలు సేకరిస్తోంది. ప్రభుత్వ అధీనంలో నిడిచే ఆశ్రమాలతో పాటు స్వచ్ఛంద సంస్ధలు, ప్రైవేట్ అధీనంలో కొనసాగుతున్న ఆశ్రమాల పరిస్థితిపై ఆరా తీసోంది. వాస్తవంగా ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆశ్రమాలేన్ని? గుర్తింపులేనివి ఎన్ని? ఎంతమంది పిల్లలు ఉన్నారు? నిబంధనల పాటింపు, వసతులు, నిర్వహణ కోసం ఆర్థిక వనరులు, నిర్వాహకుల తీరు, వారి గతం, పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణకు కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రంగంలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. పుట్టగొడుగుల్లా.. మహా నగరంలో ఆశ్రమాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎన్జీఓల ఆధ్వర్యంలో కొన్ని ఏర్పాటు కాగా, వ్యాపార దృక్పథంతో మరికొన్ని ఆశ్రమాలు కొనసాగుతున్నాయి. వీటిలో సగానికిపైగా అనుమతి లేకపోగా, మిగతా వాటిలో నిబంధనలు మచ్చుకు కూడా కనిపించని పరిస్థితి. వాస్తవంగా హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఆశ్రమాలు 10 శాతం మాత్రమే. వాస్తవంగా ప్రతి ఆశ్రమ నిర్వహణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆశ్రమాలను తనిఖీ చేసేందుకు రెవెన్యూ జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలున్నా.. ప్రభుత్వ అనుమతి తీసుకున్న ఆశ్రమాలపైనే కనీస పర్యవేక్షణ మాత్రం కరువైంది. ఇక గుర్తింపు లేని వాటిపై అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేకుండాపోయాయి. మారని తీరు.. నగరంలోని పలు ఆశ్రమాల్లో అనేక ఘటనలు వెలుగుచూస్తున్న వాటిపై చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారు. ఘటన జరిగినప్పుడు హడావుడి సృష్టించి ఆ తర్వాత గాలికి వదిలేయడం షరామామూలుగా మారింది. తాజాగా అమీన్పూర్ ఘటన దృష్ట్యా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణకు దిగినట్లు తెలుస్తోంది. ప్రతి ఆశ్రమంపై పర్యవేక్షణ కమిటీల తనిఖీలతో పాటు అంగన్వాడీలో కూడా పరిశీలనకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఆశ్రమాలపై పూర్తిస్థాయి వివరాల సేకరణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అనధికార హోమ్‌లతో పాటు నిబంధనలు పాటించని ఆశ్రమాలను సీజ్ చేసి కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. -
అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్
కాచిగూడ/నాంపల్లి: ఏకేఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో కాచిగూడలో నిర్వహిస్తున్న అంజుమన్ ఖాదిమల్ ముసల్మిన్ ఆర్ఫనేజ్ హాస్టల్లో శనివారం రాత్రి ఫుడ్ పాయిజన్ అయి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులను హుటాహుటిన అర్దరాత్రి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం ఏమీ లేదని చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే వీరంతా శనివారం రాత్రి బిర్యానీ, స్వీటు తిన్నారని అప్పటి నుంచి అస్వస్థతకు గురయ్యారని తోటి విద్యార్థులు తెలిపారు. బిర్యానీని వేరే ఫంక్షన్లో మిగిలిన తర్వాత తెచ్చారని తెలిసింది. ఇలా ప్రతి ఫంక్షన్లో మిగిలిన భోజనాన్ని ట్రస్టు ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థల్లోని విద్యార్థులకు సరఫరా చేస్తారని, ఎప్పటిలాగే నిన్న రాత్రి కూడా ఇలాగే భోజనం సరఫరా జరిగిందని తెలిసింది. కాచిగూడ పోలీసులు అసలు ఏ ఫంక్షన్ నుంచి ఈ భోజనాన్ని చిన్నారులకు తీసుకువచ్చారన్న కోణంలో విచారణ చేస్తున్నారు. కోలుకుంటున్న విద్యార్థులు... విషాహారం తిని అస్వస్థతకు గురై నిలోఫర్‌లో చికిత్స పొందుతున్న 15 మంది విద్యార్థులు కోలుకుంటున్నారు. నిలోఫర్ వైద్యులు విద్యార్థులకు అత్యవసర వైద్య సేవలందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులందరూ కాచిగూడలోని అంజుమన్ ఖాదిమల్ ముసల్మిన్ (అనాథ శరణాలయం) చదువుకుంటున్నారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో బర్గర్, షావర్మా, రోటీ, బిర్యానీ, అంజీర్కా మీఠాలను భుజించారు. రాత్రి 11 గంటల సమయంలో వీరు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం పాలైన విద్యార్థులను అర్దరాత్రి హుటాహుటిన రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన చిన్నారుల్లో ఏడుగురు బాలికలు, 8 మంది బాలురు ఉన్నారు. ఈ చిన్నారులు ఒకటో తరగతి నుంచి 6వ తరగతి మధ్యలో విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరూ ప్రస్తుతం కోలుకుంటున్నారు. విషాహారం తీసుకోవడంతోనే చిన్నారులు అనారోగ్యం పాలయ్యారని వైద్యులు నిర్ధారించారు. అనాథాశ్రమాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి పిల్లలకు నిర్లక్ష్యంగా ఆహారాన్ని అందించిన అంజుమన్ ఖాదిమల్ ముసల్మిన్ ఆనాథాశ్రమాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. పిల్లలకు విషతుల్యమైన ఆహారం అందించిన వారిని, ఆస్పత్రి పాలయ్యేలా చేసిన ఆశ్రమ నిర్వాహకులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అనాథాశ్రమ నిర్వాహకులు బయట ఎవరో తినగా మిగిలిన ఆహారాన్ని ఆశ్రమ పిల్లలకు పెట్టడంతోనే వారు అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన తెలిపారు. గుర్తింపు లేని ఈ ఆనాథాశ్రమంపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
చౌడేశ్వరి అనాథ ఆశ్రమం సీజ్
ప్రొద్దుటూరు క్రైం : పసి పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న అనాథ బాలల ఆశ్రమాన్ని సీడబ్ల్యూసీ అధికారులు సీజ్ చేశారు. నలుగురు ఆశ్రమ నిర్వాహకులను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు మండలంలోని అమృతానగర్‌లో ఉన్న శ్రీ చౌడేశ్వరి అనాథ ఆశ్రమంలోని పిల్లలు భిక్షాటన చేస్తున్నారని సమాచారం రావడంతో గురువారం సీడబ్ల్యూసీ అధికారులు ఆశ్రమ నిర్వాహకులపై రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ క్రమంలో జిల్లా జడ్జీ జి.శ్రీనివాస్ ఆదేశాల మేరకు శుక్రవారం రెండవ అదనపు జిల్లా జడ్జి జి.మనోహరరెడ్డి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ శివకామిని అమృతానగర్‌లోని ఆశ్రమాన్ని పరిశీలించారు. పాఠశాలకు పంపించడం లేదు.. పాఠశాలకు వెళ్తున్నారా అని జడ్జి పిల్లలను ప్రశ్నించగా ఇక్కడే చదువుకుంటున్నామని చెప్పారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఇక్కడికే వచ్చి చదువు చెబుతారని పిల్లలు తెలిపారు. వారిలో ఇద్దరు మాత్రం అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌కు వెళ్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇక్కడి పిల్లలందరిని ఎయిడెడ్ పాఠశాలకు పంపించాలని సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ తెలిపారు. స్థానికంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులను పిలిపించి అధికారులు మాట్లాడారు. ఈ ఆశ్రమాన్ని సీజ్ చేస్తున్నామని, మరో ఆశ్రమంలో చేర్పించి మీ పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తామన్నారు. వారిలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఆశ్రమానికి పంపించమని, ఇంటి వద్దనే పెట్టుకొని చదివించుకుంటామని చెప్పగా పిల్లలకు సంబంధించిన ఆధార్‌కార్డు, ఇతర పత్రాలను తీసుకొని కడపకు రావాలని చెప్పారు. నిర్ధారించుకున్న తర్వాత పిల్లలను అప్పగిస్తామని అధికారులు వారితో అన్నారు. పిల్లలకు విద్యను దూరం చేయడంతో పాటు వారి హక్కులను హరించడం నేరమని జడ్జి మనోహరరెడ్డి అన్నారు. భిక్షాటన చేయించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామన్నారు. ఆశ్రమంలోని పిల్లలందరికీ మంచి విద్యను అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆశ్రమ నిర్వాహకులు అరెస్ట్ ఆశ్రమంలోని 8 మంది పిల్లలను సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో అ«ధికారులు కడపకు తీసుకెళ్లారు. జడ్జి ఆదేశాల మేరకు ఆశ్రమాన్ని సీజ్ చేసి, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆశ్రమ నిర్వాహకులు పాపయ్య, స్వర్ణలత, నాగేశ్వరరెడ్డి, బాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. బాలలతో మాట్లాడిన జిల్లా జడ్జి కడప అర్బన్: ప్రొద్దుటూరులోని చౌడేశ్వరి అనాథ ఆశ్రమంలో ఉంటున్న తొమ్మిది మంది పిల్లలను కడపలోని ప్రభుత్వ బాలుర గృహానికి సీడబ్ల్యూసీ వారు శుక్రవారం తీసుకొచ్చారు. వారిని చౌడేశ్వరీ ఫౌండేషన్ వారు పెట్టిన బాధల గురించి స్వయంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు. సదరు చిన్నారులు తమను తల్లిదండ్రుల దగ్గరి నుంచి ఆశ్రయం కల్పిస్తామని తీసుకొచ్చి చందాల పేరుతో భిక్షాటన చేయిస్తున్నారని చెప్పారు. ఈ సంఘటనపై స్పందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పిల్లలకు మొదట భోజన సదుపాయాలు కల్పించాలని చెబుతూనే తన సొంత ఖర్చుతో బిస్కెట్లను తెప్పించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులపై జువైనల్ జస్టిస్ యాక్టు , బెగ్గింగ్ అండ్ మేమింగ్ యాక్టు ప్రకారం కేసు నమోదైందని, తద్వారా నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ విష్ణుప్రసాద్‌రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ సెక్రటరీ సీఎన్ మూర్తి, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి చక్రపాణి, డీపీఓ యల్లారెడ్డి, సీడబ్ల్యూసీ చైర్మన్ శివకామినితోపాటు ప్రభుత్వ బాలుర గృహం సూపరింటెండెంట్ అన్నాజీ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అనాథాశ్రమం బాలలతో భిక్షాటన
ప్రొద్దుటూరు క్రైం : అనాథ ఆశ్రమం పేరుతో పసి పిల్లల చేత భిక్షాటన చేయిస్తున్న శ్రీ చౌడేశ్వరి ఫౌండేషన్ నిర్వాహకులపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పిల్లల చేత భిక్షాటన చేస్తున్నారని సమాచారం రావడంతో డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్స్పెక్షన్ టీం గురువారం సాయంత్రం ఆశ్రమాన్ని తనిఖీ చేశారు. తనిఖీల్లో భిక్షాటన చేయిస్తున్నట్లు వాస్తవాలు వెల్లడి కావడంతో వారు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు పాపయ్య, సరోజమ్మతో పాటు కొందరు కలిసి ప్రొద్దుటూరు మండలంలోని అమృతానగర్‌లో ఐదేళ్ల నుంచి శ్రీ చౌడేశ్వరి ఫౌండేషన్ అనాథ, పేద పిల్లల ఆశ్రమ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో 14 మంది పిల్లలతో పాటు చైల్డ్వెల్ఫేర్ కమిటీ అనుమతి లేకుండా మరో ముగ్గురు పిల్లలు ఉంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పిల్లలకు ఆశ్రమంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యాబోధన జరగాల్సి ఉంది. అయితే ఆశ్రమ నిర్వాహకులు పసి పిల్లలను పాఠశాలకు పంపకుండా రోజూ భిక్షాటనకు తీసుకొని వెళ్తున్నారు. రోజు ఆటోలో కూర్చోపెట్టుకొని, వారి చేతికి అనాథ పిల్లలమనే కరపత్రాన్ని ఇచ్చి రోజుకో వీధికి తీసుకొని వెళ్లి వదిలి పెడుతున్నారు. వారు రోజుకు రూ. వందల్లో డబ్బు తీసుకొని రాగా కేవలం తమకు 10 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని పిల్లలు సీడబ్ల్యూసీ అధికారుల విచారణలో వెల్లడించారు. పిల్లలలను మరో ఆశ్రమంలో చేర్పిస్తాం ఆశ్రమాన్ని తనిఖీ చేసిన సమయంలో రికార్డులో ఉన్న 14 మందితో పాటు అనధికారికంగా ఉన్న ముగ్గురు పిల్లలను సీడబ్ల్యూసీ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ముగ్గురు పిల్లలను జిల్లా అధికారుల అనుమతితో మంచి ఆశ్రమంలో చేర్పించి మెరుగైన ఆశ్రమంలో చేర్పిస్తామని డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అధికారి ఎల్లారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అనేక ఆశ్రమాల్లో చాలా దారుణాలు జరిగాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 44 అనాథ బాలల ఆశ్రమాలు ఉండగా వాటిలో 37 స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తుండగా, 7 ఆశ్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. పిల్లలకు విద్యను అందిచకుండా వారి హక్కులను హరిస్తున్న నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పసి పిల్లల చేత భిక్షమెత్తించడం నేరమని ఆయన తెలిపారు. 14 మంది పిల్లల తల్లి దండ్రులను పిలిపించి విచారణ చేస్తామన్నారు. ఆ తర్వాత జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. సీడబ్ల్యూసీ టీం సభ్యులు డాక్టర్ ప్రసన్నలక్ష్మి, చైల్డ్వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు వరమ్మ, డీసీపీఓ శివకుమార్‌రెడ్డిలతో సీఐ ఓబులేసు మాట్లాడారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. -
పిల్లల పాలిట ‘యమకూపం’
అభం శుభం ఎరుగని పసిపిల్లలపై మర్యాదస్తులు, పెద్ద మనుషులుగా సమాజంలో చెలామణీ అయ్యేవారు పెట్టే చిత్రహింసలు చెప్పనలవి కాని రీతిలో ఉంటున్నాయి. ఈ పిల్లలు అనుభవించే హింస, వర్ణనాతీతమైన కష్టాలు చూస్తే రాళ్లు సైతం విలపిస్తాయి. ఇంతటి ఘోరాలు పసి వాళ్లపై జరుగుతున్నా చలించని ప్రభుత్వాలుంటే అవి అమలు చేయాల్సిన చట్టాలు ఏం చేయగలవు? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు మనుషులను వేధించాల్సిన సమయం వచ్చింది. ఇంత క్రూరత్వం అనుభవించిన పసివాళ్ల బాధ, మనో వేదన నిరంతరం పచ్చిపుండే. ఈ దేశ అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థలతో పాటు ప్రేక్షక పాత్ర వహిస్తున్న సమాజం–ఇలా అందరూ ఈ బిడ్డల విషయంలో దోషులే. ‘‘మనిషిగా తలెత్తి బతక లేను మానవత లేని లోకాన్ని స్తుతించలేను’’ అంటారు ప్రసిద్ధ తెలుగు కవి దేవరకొండ బాల గంగాధర తిలక్. నాలుగు సంవత్సరాల పాప లేత చేతులపై వాతలు. ఏడేళ్ల బిడ్డలపై... మరిగే నీళ్లు పోయడం, వాతలు పెట్టడం, కొట్టడం... తిట్టడం.. ఇలాంటివి చెప్పనక్కర లేదు. ఈ ఆడపిల్లలకు ఈడు రాలేదు! పాపం... కోరికంటే తెలియదు. బలవం తంగా చేసిన ఇంజెక్షన్ల కారణంగా ఈ పిల్లలు ‘పెద్ద వాళ్లయ్యారు’. అంతేకాదు, ఎందరి చేతుల్లోనో నలిగి పోయారు. ఎందుకంటే, ఈ చిన్న ఆడపిల్లలకే డిమాండ్. విటుల వికృత కోర్కెలకు వారు బలైపో తున్నారు. ఎంత చిన్న అమ్మాయి అయితే అంత ఎక్కువ రేటు. ఇలాంటి కోర్కెలున్న వాళ్లు నిజంగా మనుషులేనా? ప్రత్యేక జాతా? ఎవరీ పిల్లలు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరీ కూనలు? ఎక్కడి నుంచి ఈ నరకానికి చేరారు? ఎక్కడ దొరికితే అక్కడ ఎత్తుకు వచ్చిన వాళ్లు. ఆడుకుంటూ అమాయకంగా చాక్లెట్ల కోసం వచ్చి జీవితాలు కోల్పోయినవాళ్లే ఈ ఆడపిల్లలు. ప్రధానంగా పేదల పిల్లలు. వలస కూలీల పిల్లలు. వారి అమ్మానాన్నలకు పనికి వెళ్లక తప్పదు. ఇలాంటి కూలీల బిడ్డలకు కేర్ సెంటర్లు ఉండవు. రోడ్ల మీదే అలా తిరుగుతుంటారు. దుర్మార్గులకు దొరికిపో తారు. అయినా వారి విషయం ఎవరూ పట్టించు కోరు. పోలీసులతో సహా.. వీళ్లేమైనా ధనవంతుల బిడ్డలా? అధికారం ఉన్న వారి కడుపున పుట్టారా? గ్లామర్ ఉన్న ప్రముఖుల పిల్లలా? వారి ‘అదృశ్యం’ సంచలన వార్త అవుతుందా? కాదు గదా! చూద్దాంలే అంటారు చట్టాలు అమలు చేయాల్సినవాళ్లు. రోజూ 194 మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు భారతదే శంలో. అందులో జాడ దొరికేది సగం మంది మాత్రమే. ఈ ముక్కుపచ్చలారని పిల్లల్లో 51 శాతం మంది అపహరణకుగురయినవారే. ఈ పిల్లలందరినీ వేరే దేశాల వ్యభిచార గృహాలకు, మన దేశంలోని వ్యభిచార కూపాలకు, బూతు సినిమాలు తీయడా నికి, వెట్టి చాకిరి చేయడానికి దుండగులు తరలిస్తు న్నారు. ఇలా మాయమవుతూ దుర్భర జీవితం గడుపుతున్న పిల్లల గురించి సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలు ప్రభుత్వాలు సహా ఎవరూ పట్టించు కున్న దాఖలాలు లేవు. ఫోన్లు, వాట్సాప్ ద్వారానే మొత్తం వ్యాపారం! ఈ అమాయక ఆడపిల్లలను ఎత్తుకొచ్చినవాళ్లు, మధ్య దళారులు, వారిని కొనేవాళ్లు–వీరందరూ చాలా తెలివిగా వ్యవహారం నడుపుతుంటారు. మొత్తం వ్యాపారం ఇప్పుడు ఫోను సంభాషణలు, వాట్సాప్ ఫొటోలతో నడుస్తోంది. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పిల్ల వయసు ఎంత? ఇప్పటికి ఎంత వ్యాపారం చేయడానికి ఉపయోగప డింది? ఇలా అన్నింటికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు వారితో వ్యాపారం చేసేవారి దగ్గర ఉంటాయి. ఈ ఆడపిల్లలతో వ్యాపారం చేసే అసలు సూత్రధారులు ఇలాంటి వివరాలతోనే బేరాలు కుదుర్చుకుంటారు. గత సంవత్సరం లక్షా పదకొండు వేల మందికి పైగా పిల్లలు కనపడకుండా పోయారు. ఇరుగు పొరుగు దేశాల నుంచి ఏటా 50 వేల మంది స్త్రీలు, పిల్లలు భారతదేశంలోకి అక్రమ రవాణా అవుతు న్నారు. దేశంలో ఈ వృత్తిలో ఉన్న రెండు కోట్ల మందిలో కోటీ అరవై లక్షల మంది అక్రమ రవాణా ద్వారా ఇతరుల బలవంతంతో వచ్చినవాళ్లే. అంటే ఎనభై శాతం మంది మహిళలు ఇలా వ్యభిచారకూపా లకు అక్రమ రవాణా కారణంగా చేరుకున్నవారే. భారీ ప్రభుత్వ వ్యవస్థ ఉన్న ఈ దేశంలో బాలల అక్రమ రవాణా అరికట్టడానికి ఇంత వరకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయలేదు. నిర్ణీత కాంట్రాక్టు పద్ధతిలో పిల్లల తరలింపు కాంట్రాక్టు పద్ధతిలో పిల్లలను వ్యభిచార గృహాలకు ఇవ్వడం, ముందే నిర్ణయించిన గడువు తీరగానే మళ్లీ మరో ప్రదేశానికి తరలించడం చాలా ఏళ్లుగా జరుగు తోంది. ఇలా పిల్లలను అనేక చోట్లకు తరలించడం వల్ల వారి జాడ తెలుసుకోవడం చాలా కష్టమౌతోంది. ఇలా తీసుకొచ్చిన పిల్లలను బడి పిల్లల్లాగే తయారు చేశాక అపార్ట్మెంట్లలో నివాసాల మధ్య ఈ దుర్మా ర్గపు వృత్తి చేయిస్తున్నారు. అవసరాన్ని బట్టి వారిని నేలమాళిగల్లో దాచేస్తున్నారు. ఈ క్రమంలో ఈ పిల్లలపై మర్యాదస్తులు, పెద్ద మనుషులుగా సమా జంలో చెలామణీ అయ్యేవారు పెట్టే చిత్రహింసలు చెప్పనలవి కాని రీతిలో ఉంటున్నాయి. ఈ అక్రమ సెక్స్ వ్యాపారంలో ఆడపిల్లలతోపాటు మగపిల్లలకు కూడా గిరాకీ పెరిగిపోతున్నది. ఈ పిల్లలతో ఇలా ప్రవర్తించడానికి కారణాలేంటి? అసహజమైన బూతు దృశ్యాలు విపరీతంగా చూసి రెచ్చిపోవడం, వయసు మీరుతున్నా పెళ్లి చేసుకోవడానికి అమ్మా యిలు దొరకకపోవడం మాత్రమే కారణాలా? లేక ఎవరూ తాకని పసి కన్యలు కావాలనే మోజా? ఇలాంటి పిల్లలతో శారీరక సంబంధం పెట్టుకుంటే అప్పటికే ఉన్న రోగాలు పోతాయనే మూఢనమ్మ కమా? ముక్కుపచ్చలారని ఈ పిల్లలను ఎంతగా హింసించినా, ఎలాంటి వికృత లైంగిక చర్యలకు పాల్పడినా వారు అడ్డుచెప్పలేరనే నమ్మకమా? నిస్స హాయ స్థితిలో ఉండే అమ్మాయిలపై కామం పేరుతో శాడిజానికి పాల్పడి ఆనందించే రాక్షస లక్షణమా? ఇంకే కారణాలు మనుషులను మృగాలను మించి పోయేలా చేస్తున్నాయి? ఈ పిల్లలు అనుభవించే హింస, వర్ణనా తీతమైన కష్టాలు చూస్తే రాళ్లు సైతం విలపిస్తాయి. ఇంతటి ఘోరాలు పసివాళ్లపై జరుగు తున్నా చలించని ప్రభుత్వాలుంటే అవి అమలు చేయాల్సిన చట్టాలు ఏం చేయగలవు? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు మనుషులను వేధించాల్సిన సమ యం వచ్చింది. బిహార్ అనాథ గృహాల కథనాలు దారుణం ఉత్తరాది రాష్ట్రమైన బిహార్‌లోని అనాథ గృహాల కథ నాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఆయన రాజ కీయ నాయకుడు. మూడు పత్రికల యజమాని. రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. ఆయన ఏడేళ్ల మూగ చెవిటి అమ్మాయిని కూడా వదల్లేదు. 34 మంది చిన్న బిడ్డలకు మత్తుమందులు ఇచ్చి అత్యాచారాలు చేసిన ఘటనలు ఇక్కడే జరుగుతున్నాయి. బిహార్ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మంజూ వర్మ (ఈమె బుధ వారం పదవికి రాజీనామా చేశారు) భర్త ముజఫర్ పూర్ అనాథ బాలికల గృహంలో అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవడమేగాక తానే స్వయంగా అత్యాచారం చేశాడు. అనాథ గృహంలోని ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలపై ఎవరో ఇచ్చిన నివేదిక ఎనిమిది నెలలపాటు అతీగతీ లేకుండా మంత్రి ఆఫీసులో పడి ఉంది. ఈ పిల్లల ఆక్రందనలు ఎవరూ వినలేదు. బయటకు ఈ పిల్లల అరుపులు, ఏడుపులు వినపడుతున్నా, బాలికలను జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతున్నా చుట్టూ ఉన్న జనం మాట్లాడలేదు. ఎందుకంటే వారికి భయం. ఈ దుర్మార్గాలకు సూత్రధారి అయిన బ్రజేష్ ఠాకూర్ తనను అరెస్ట్ చేశాక భయపడలేదు. పోలీసులు తీసు కుపోతున్నప్పుడు అతను నవ్వుకుంటూ ‘ఇదంతా రాజకీయ కుట్ర’ అని మీడియాకు ధైర్యంగా చెప్పా డంటే, అతనికి రాజకీయంపై ఎంత నమ్మకం? అతని నమ్మకం వమ్ముకాలేదు. జైలు ఆస్పత్రిలో ఠాకూర్‌కు రాజభోగాలందుతున్నాయి. అనాథ పిల్ల లంతా మానసిక, శారీరక గాయాలతో కునారి ల్లుతున్నారు. బ్రజేష్ ఠాకూర్ నడిపే మరో అనాథగృ హంలో 11 మంది పిల్లల ఆచూకీ లేదు. గువాహటీ మసాజ్ సెంటర్లో... ఇలాంటి అక్రమాలకే నిలయమైన గువాహటీ మసాజ్ సెంటర్ గురించి స్థానికులు ఫిర్యాదు చేసినా చాలా కాలం పట్టించుకోలేదు. తీవ్ర ఒత్తిడి తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు 110 మంది అమ్మా యిలను రక్షించారు. ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో బ్లాక్ లిస్టులో ఉండి, అనుమతి లేని షెల్టర్ హోమ్‌కు పోలీ సులు అమ్మాయిలను ఇస్తూనే ఉన్నారు. ఈ అనాథ కేంద్రాల నుంచి రోజూ వ్యాన్లలో మైనారిటీ తీరని అమ్మాయిలను విటుల దగ్గరకు పంపడం పోలీసు లకు తెలుసు. మరి ఈ విటులు అధికారులా? రాజ కీయ నాయకులా? అనే విషయంపై పోలీసులు ఆరా తీయడం లేదు. విటులందరిపైనా పోక్సో చట్టం కింద కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు? ఈ ఘటనలన్నింటికీ అక్రమ రవాణా చట్టం, వ్యభిచార నిరోధక చట్టంతోపాటు పోక్సో చట్టం కూడా వర్తి స్తుంది. వ్యభిచార కూపాల్లో మాదిరే ఈ గృహాలకు చేరిన పిల్లలు వాటి నిర్వాహకుల దయాదాక్షిణ్యాలపై బతకాల్సిందే. ఈ హోమ్‌ల యజమానులకు రాజ కీయ పార్టీలు, అధికారుల అండదండలున్నాయి. ఇక్కడ ఇంత జరుగుతున్నా అక్రమ రవాణా బాధి తులను ఈ పునరావాస కేంద్రాలకు తరలిస్తూనే ఉన్నారు. వీటిలో పునరావాసం కల్పించేవి ఎన్ని? వ్యాపారం నడిపేవి ఎన్ని? ఎక్కడా పర్యవేక్షణ లేదు. ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు కూడా జవా బుదారీతనం లేదు. వేటిపైనా నిఘా లేదు. ‘పునరా వాసం’ మంచి లాభదాయక వ్యాపారంగా మారింది. అందుకే సుప్రీంకోర్టు ‘‘పసి పిల్లలపై అకృత్యాలు చేయడానికి ప్రభుత్వం నిధులు ఇస్తున్నదా? ఎందుకు సరైన తనిఖీ లేదు’’ అని ప్రభుత్వాన్ని నిల దీసింది. కనీసం అత్యాచార బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాన్నయినా ఎందుకు ఇవ్వలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇంత క్రూరత్వం అనుభవించిన పసివాళ్ల బాధ, మనోవేదన నిరంతరం పచ్చిపుండే. ఈ పిల్లలు మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు భరోసా ఇవ్వాలని ఎవరూ అనుకోవడం లేదు. వారి మానసిక కల్లోలం సమసిపోవడానికి చికిత్స అందిం చాల్సిన బాధ్యత మనపై ఉందని ఎవరూ భావిం చడం లేదు. ఒక గృహంలో అకృత్యాలు జరిగినట్టు తేలితే పిల్లలను మరో గృహానికి తరలించి అధికా రులు చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ దేశ అధి కార వ్యవస్థ, న్యాయ వ్యవస్థలతో పాటు ప్రేక్షకపాత్ర వహిస్తున్న సమాజం–ఇలా అందరూ ఈ బిడ్డల విష యంలో దోషులే. నిర్లజ్జగా, బాధ్యత తీసుకోకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు అసలు నేరస్తులు. వ్యాసకర్త : పి. దేవి, సాంస్కృతిక కార్యకర్త ఈ–మెయిల్ : pa_devi@rediffmail.com -
అనాథల మధ్య వ్యాపారి పుట్టినరోజు వేడుకలు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): పుట్టిన రోజు వేడుకలను ఆడంబరంగా చేసుకోవడం నేడు సంపన్నులతో పాటు మధ్య తరగతి వారిలోనూ సాధారణమైపోయింది. కానీ ఓ మహిళా వ్యాపారవేత్త తన పుట్టిన రోజు వేడుకలను అనాథ పిల్లల మధ్య జరుపుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. బేగంపేట్‌కు చెందిన రీమాదేవ్ ఇంటీరియర్ రంగంలో వ్యాపారి. ఆమె భర్త ప్రసూన్ దేవ్ కిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ గా చేస్తున్నారు. బుధవారం రీమాదేవ్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి వచ్చి ఆదయ్యనగర్‌లోని అమన్ వేదిక స్నేహ ఘర్ హోంలో చిన్నారుల మధ్య తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. వారికి స్వీట్లు పంచి పెట్టి విందును ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారి మధ్యే ఉండి చిన్నారులతో సందడిగా గడిపారు. -
అనాథ ఆశ్రమం నుంచి 8 మంది చిన్నారుల పరారీ
కృష్ణా: కృష్ణా జిల్లాలోని బుద్దవరం కేర్ అండ్ షేర్ అనాథ ఆశ్రమం నుంచి 8 మంది చిన్నారులు పరారీ అయ్యారు. పారిపోయిన ఆ ఎనిమిది మంది చిన్నారులు గన్నవరంలోని స్థానికుల సంరక్షణలో ఉంటున్నారు. అయితే నిర్వాహకులు తరచూ కొట్టడం వల్లే పరారయ్యామని చిన్నారులు వాపోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.