రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోండి సులభంగా... | Registration is easy to find...!! | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోండి సులభంగా...

Published Mon, Feb 16 2015 2:51 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM

రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోండి సులభంగా... - Sakshi

రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోండి సులభంగా...

నానాటికీ పెరిగిపోతున్న మోసాల నేపథ్యంలో ఏదైనా ఆస్తులు కొనుగోలు చేయాలంటే ఎంత భయమో తెలియంది కాదు. ఆస్తిని అమ్ముతున్న వ్యక్తి  తనది కాని ఆస్తిని కూడా తనదిగా నమ్మించి తప్పుడు ధృవ పత్రాలు సృష్టించి మోసం చేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాలలో అతడు చెప్పే వివరాలను ‘ఆన్‌లైన్’లో పరిశీలించి అన్నీ నిజమని అనిపిస్తేనే ముందడుగు వేయడం ఉత్తమం. అంతేకాకుండా భూములు, ఇళ్లు, ప్లాట్లు తదితర ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు డాక్యుమెంట్లు మన పేరుపై రికార్డు అయి ఉంటాయి.

అయితే అత్యవసర సమయంలో ఆయా డాక్యుమెంట్ నఖలు కావాలంటే మాత్రం కష్టం. అయితే వాటిని వెంట తీసుకెళ్దామంటే చోరీ జరగడమో లేదా పోగొట్టుకుంటామనే భయం వెంటాడుతుంది. అయితే నేడు ఆయా డాక్యుమెంట్‌లకు సంబంధించిన నఖలు డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది. ఇంకా ఏ పేరున డాక్యుమెంట్ రిజిస్టర్ అయ్యిందో సులభంగా తెలుసుకునే విధానాన్ని ‘‘తెలంగాణ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్’’ వారు అందుబాటులోకి తెచ్చారు. మరి ఆ వివరాలను ఒకసారి చూద్దాం...

 
రిజిస్ట్రేషన్ వివరాల కోసం...
http://registration.telangana.gov.in/DeedDetails.do?methodgetDistricts లింక్‌లోకి వెళ్లాలి.
ఇక్కడ ‘‘రిజిస్ట్రేషన్ డిటేల్స్’’ ఫామ్ కనిపిస్తుంది.
కనిపిస్తున్న ఆఫ్షన్‌లలో జిల్లా, డాక్యుమెంట్ నంబరు, ఎస్‌ఆర్‌ఒ పేరు, సంవత్సరం నమోదు చేసి సబ్‌మిట్ ఆఫ్షన్‌పై క్లిక్ చెయ్యాలి.
ఇప్పుడు మీకు ప్రాపర్టీ వివరాలతో పాటు, దాని మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ తేదీ, కొన్న వారి పేరు, అమ్మిన వారి పేరు కనిపిస్తుంది.  
నోట్: రిజిస్ట్రేషన్ వివరాలలో అపార్ట్‌మెంట్, ఒపెన్ లే అవుట్‌ల గురించి కూడా తెలుసుకోవచ్చు.
 
డౌన్‌లోడ్‌కు కావాల్సిన వివరాలు
ఆయా డాక్యుమెంట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే సదరు డాక్యుమెంట్ నెంబరు,     రిజిస్ట్రేషన్ అయిన సంవత్సరం, అది రిజిస్టర్ అయిన కార్యాలయం కోడ్ లేదా పేరు (ఎస్‌ఆర్‌ఒ) తెలిసి ఉండాలి.
 
ఈ వెబ్‌సైట్‌లో చూడండి...
http://registration.telangana.gov.in:7002/TGThumbNailCC/ లింక్‌ను క్లిక్ చేయండి.
ఇక్కడ స్క్రీన్‌లో కనిపిస్తున్న ‘‘కంటిన్యూ’’ ఆఫ్షన్‌ను ఎంచుకోండి.
ఇప్పుడు మీకు విండోలో ‘‘తంబ్‌నేల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్’’ ఫామ్ కనిపిస్తుంది.
ఇక్కడ కనిపిస్తున్న సంబంధిత ఆఫ్షన్‌లలో ‘‘జిల్లా’’, ‘‘ఎస్‌ఆర్‌ఒ’’(సబ్ రిజిష్ట్ర్‌ర్ ఆఫీస్), ఆస్తి రిజిష్టర్ అయిన సంవత్సరం, డాక్యుమెంట్ నంబరు తదితర వివరాలను ఎంటర్ చేయాలి.
ఇప్పుడు మీరు అందించిన వివరాలు సరిగ్గా ఉంటే ‘‘వెరిఫైడ్ సక్సెస్’’ అనే విండో  కనిపిస్తుంది.
ఈ విండోలో కనిపిస్తున్న ‘‘డౌన్‌లోడ్’’ ఆఫ్షన్‌ను క్లిక్ చేస్తే సంబంధిత డాక్యుమెంట్‌లు పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్‌లోడ్ అవుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement