Sub registrations Office
-
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో... త్రినేత్రం
వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలుస్వీకరించిన వెంటనే ‘అవినీతి రహిత పాలన’తో ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు. పిలుపునివ్వడమే కాదు ఆ దిశగా అడుగులు వేస్తూ తన చుట్టూ ఉన్నవారిచే అడుగులు వేయించడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి దూరంగా పలువురు ఉద్యోగులు ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. విశాఖ జిల్లా మధురవాడ సబ్ రిజస్ట్రార్ కార్యాలయంలో సిబ్బంది కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సబ్ రిజస్ట్రార్ కార్యాలయం అంటేనే నెల,నెలా వసూళ్లకు కేరాఫ్‌గా మారిపోయింది. కానీ ఆ కార్యాలయంలో ఆ తరహా వసూళ్లను కొంతమేర తగ్గించినట్టున్నారు. కానీ అవినీతిని అడ్డుకోవలి్సన అవినీతి నిరోధక అధికారులే ‘అలా అయితే ఎలా’ అంటూ దందాకు దిగారు. మీరు అవినీతి చేస్తేనే కదా మా ‘పై జేబులు’ నిండేదంటూ హడావుడి చేశారు. అయినాసరే ‘ససేవిురా’ అనేసరికి ఓ రోజు నేరుగా కార్యాలయంలోకి చొచ్చుకొచ్చి సిబ్బంది ఫైల్లో డబ్బులు పెట్టేసి ... వారే అవినీతికి పాల్పడినట్టు తప్పుడు కేసులు పెట్టడానికి యత్నించారు. అయితే సీసీ ఫుటేజీలో మొత్తం రికార్డు అవడంతో కంగుతిన్నారు. దీనిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని కార్యాలయాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశాలు జారీ చేశారు. 1986వ సంవత్సరంలో అర్ధరాత్రి స్వతంత్రం సినిమా రిలీజైంది. ఆర్. నారాయణమూర్తి తొలి పరిచయంతోపాటు ఆయన తొలి దర్శకత్వం వహించిన సినిమా కూడా అదే. ఆ సినిమాలో ఓ సన్నివేశం ఇక్కడ ప్రస్తావించుకుందాం. తన భార్య కన్నీళ్లకు కరిగి ఓ జేబు దొంగ దొంగతనాలు మానేసి చక్కగా రిక్షా తొక్కుకొని వచ్చిన ఆదాయంతో తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు. ఇంతలో ఓ కానిస్టేబుల్ ఆ మాజీ దొంగ ఇంటికి వస్తాడు. ఏమిరా...నాకు రావల్సిన వాటా ఇవ్వడం మానేసినావని గద్దించగా దొంగతనాలు మానేసి రిక్షా తొక్కుతూ బతుకుతున్నాను...నన్ను వదిలేయమంటూ ఆ కానిస్టేబుల్ కాళ్లా,వేళ్లా పడి బతిమాలుతాడు. నువ్వు మానేస్తే నా బతుకెలా సాగేది. పెద్ద కూతురు పురిటికొచి్చంది, చిన్న కూతురికి పెళ్లి చేయాలి...వీురంతా మంచోళ్లుగా మారితే ఎలారా అంటూ లాఠీకి పని చెప్పి ‘పద దొంగతనం కేసులో నిన్ను బొక్కలేస్తే గానీ నీ పాత జీవితంలోకి పోయేటట్టు లేవంటూ’ కొట్టుకుంటూ తీసుకుపోతాడు. ఈ దృశ్యం దూరం నుంచి చూసిన మాజీ దొంగగారి పెళ్లాం...‘వీడు దొంగతనాలు ఇంకా మానలేదా’ అని మనస్థాపానికి గురై బిడ్డతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక ఈ సీన్ కట్ చేసి...2019లోకి వచ్చి వాస్తవ ఘటనలోకి వద్దాం. సాక్షి, కాకినాడ: సీసీ కెమెరా (త్రినేత్రం)...అవినీతిపరులు, అక్రమార్కుల గుండెల్లోనే కాదు...వీరి బలహీనతలను ఆసరా చేసుకొని బ్లాక్మెయిల్ చేసే వారి గుట్టును కూడా బట్టబయలు చేసే దమ్మున్న కన్ను ... గురిపెట్టే గన్నే ఈ త్రినేత్రం. మనిషి కన్ను చూడగలదు ... చూసింది నోటితో విడమరచి చెప్పగలదు ... కానీ అవతలవారి నోరు పెద్దదైతే .. గట్టిగా దబాయిస్తే గమ్మున ఉండిపోవల్సిందే. కానీ ఈ త్రినేత్రం మాత్రం చాలా గట్టిందండోయ్. నోరేసుకొని మీద పడిపోయేవారికి ‘సాక్ష్యాల’తో స‘చిత్రం’గా చూపించి ఇప్పుడేమంటావో చెప్పంటూ కాలర్ పట్టుకొని నిలదీసి ముచ్చెమటలెక్కించగలదు. ఇటీవల రాష్ట్రంలోని ఓ సబ్ రిజస్ట్రార్ కార్యాలయంలో రుబాబులకు దిగిన ఏసీబీ అధికారులనే పట్టించి ఖబడ్దార్ అని హెచ్చరించి సంచలనం సృష్టించింది. స్వయంగా సీఎం జగన్ మోహన్‌రెడ్డి రంగంలోకి దిగి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలకు తావులేకుండా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విశాఖ జిల్లాలో మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులు కావాలని ఇరికించేందుకు వెళ్లి సంబంధిత రికార్డుల్లో డబ్బులు పెట్టి బ్లాక్ మెయిల్‌కు దిగిన వైనం సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమయింది. ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్‌పై వ్యవహరించిన తీరును సీరియస్‌గా తీసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం నిజాయితీతో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ధైర్యంగా విధులు నిర్వహంచేందుకు ఎంతో తోడ్పడుతుందని ఆనందిస్తుండగా, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో వీటిని ఏర్పాటు చేయడం వల్ల సగానికి సగం అవినీతిని అరికట్టవచ్చునని పలువురు భావిస్తున్నారు. గతమంతా అవినీతిమయమే.. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల అండదండలతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో విచ్చలవిడిగా అవినీతిచోటు చేసుకున్న విషయం జగమెరిగిన సత్యం. ఆ శాఖల్లో అక్రమాలు తారాస్థాయికి చేరుకుంటుండడంతో ప్రతి మూడేళ్లకు ఒకసారి సబ్ రిజిస్ట్రార్లను తప్పనిసరిగా బదిలీలు చేస్తుంటారు. కానీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు ఐదు సంవత్సరాల్లో ఒక్క బదిలీ కూడా జరగలేదంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అప్పటి బాబు ప్రభుత్వం అండతో అధికారులు ఇష్టారాజ్యంగా దోచుకొని అవినీతికి కేరాఫ్‌గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను మార్చేశారు. ఈ దందాను నిరోధించాలి్సనవారే బ్లాక్ మెయిల్ చేసి నెలనెలా మామూళ్లకు అలవాటుపడిపోయారంటే ఆక్కడ పని చేస్తున్న అధికారుల జేబులు ఏ మేరకు అక్రమ సొమ్ముతో నిండిపోమాయో ఊహించుకోవచ్చు. సీఎం జగన్ కన్నెర్ర.. ప్రస్తుతం సీఎం అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా ఏళ్ల తరబడి బదిలీకాకుండా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖలో అధికారులను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే...అంటే జూలై నెలలోనే రిజస్ట్రార్ కార్యాలయాల్లో బదిలీలకు శ్రీకారం చుట్టారు. అవినీతి అధికంగా జరిగే ప్రధానమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని రిజస్ట్రార్లపై బదిలీ వేటు వేసి గ్రూప్ –2లో ఎంపికైన వారిని డైరెక్ట్‌గా సబ్ రిజిస్ట్రార్లుగా నియమించి ‘చెక్’ పెట్టడానికి ప్రయత్నించారు. అప్పటి వరకు ఆ కార్యాలయం నుంచి నెలనెలా మామూళ్లకు అలవాటు పడిన అధికారులకు ‘బ్రేక్’ పడింది. అయినా సరే వెనుకటి బుద్ధి ఏల మారుతుందన్నట్టుగా మామూళ్లకు అలవాటుపడిన కొంతమంది అధికారులు బ్లాక్ మెయిల్‌కు దిగడం గమనార్హం. నెల మామూళ్లు ఇవ్వకపోతే మేమే మిమ్మల్ని ఇరికిస్తామంటూ బెదిరింపులకు దిగడం ఇటీవల విశాఖ జిల్లాలో మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లాలో 12 ‘ ఏ’ కేటగిరీ కార్యాలయాలు జిల్లాలో 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, చిట్ కార్యాలయం, ఆడిట్ కార్యాలయం, డీఐజీ కార్యాలయంతోపాటు కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటిలో సబ్ రిజిస్ట్రార్లు కేటగిరి విభజన ఈ విధంగా ఉంది. సబ్ రిజిస్ట్రార్లు ఏ– కేటగిరీ కార్యాలయాలు 12 ఉండగా, బి–కేటగిరీ కార్యాలయాలు 14 , సి–కేటగిరీ కార్యాలయాలు 8 ఉన్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటును దశలవారీగా ముందుగా ఏ– కేటగిరీ కార్యాలయాల్లో, డీఐజీ, కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. అనంతరం బి–కేటగిరీ, సి–కేటగిరీల్లో ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి అంతమవుతుందని భావిస్తున్నారు. ఆదేశాలు అందిన వెంటనే అమలు చేస్తాం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు కారణంగా ఉద్యోగులకు, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో రికార్డులు భద్రత వలయంలో ఉంటాయి. రికార్డులు తారుమారయ్యే అవకాశం ఉండదు. – టి.సరోజ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ), స్టాంప్ అండ్‌రిజిస్ట్రేషన్ శాఖ -
పాస్‌బుక్స్ లేకుండానే రిజిస్ట్రేషన్!
సాక్షి, యాదగిరిగుట్ట(నల్గొండ) : పాస్‌పుస్తకాలు లేకుండానే తమ భూమిని వేరేవారి పేరుమీద ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావని యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన ఓ కుటుంబం సబ్ రిజిస్ట్రార్‌ను నిలదీశారు. ఈ సంఘటన మంగళవారం గుట్ట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గౌరాయపల్లికి చెందిన బైరా ఎల్లయ్య, సిద్ధమ్మలకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమారుడు వెంకటేష్ ఇటీవల మరణించాడు. దీంతో పెద్ద కోడలు యాదమ్మ పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటుంది. ఎల్లయ్యకు గ్రామంలోని 267, 268, 269 సర్వేనంబర్లలో 4ఎకరాల 9 గుంటల భూమి ఉంది. ఈ భూమిని పంచాలని వృద్ధులైన ఎల్లయ్య–సిద్దమ్మ దంపతులను పెద్ద కోడలు అడగడంతో చిన్న కుమారుడు సిద్ధులుతో పాటు సమానంగా పంచి, మిగిలిన భూమిని తాము, ఆడ పిల్లలకు ఇస్తానని చెప్పారు. దర్శనానికి వచ్చి.. గతనెల రోజుల క్రితం వృద్ధుడైన ఎల్లయ్యను కోడలు యాదమ్మ హైదరాబాద్‌కు తీసుకెళ్లింది. గత శనివారం ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దర్శనానికి తీసుకొచ్చింది. అక్కడ అతడి దగ్గర ఉన్న జీరాక్స్ భూమి పత్రాలను తీసుకొని, సబ్ రిజిస్ట్రేషన్ వద్ద ఓ డ్యాక్యుమెంట్ కార్యాలయంలో రిజిస్టేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసింది. అనంతరం కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి సహాయంతో 4.9 ఎకరాల్లో 2.5ఎకరాల భూమిని యాదమ్మ తన పేరున చేసుకుంది. రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో పెట్టాలని వినతి.. ఇది తెలుసుకున్న ఎల్లయ్య భార్య సిద్ధమ్మ, బిడ్డలు కనకమ్మ, రజిత, అనితలు అదే రోజు సాయంత్రం అధికారుల వద్దకు వచ్చి యాదమ్మ జీరాక్స్ పాస్ పుస్తకాలతో రిజిస్ట్రేషన్ చేసుకుందని, దానిని పెండింగ్‌లో పెట్టాలని, 4.9 ఎకరాలకు సంబంధించిన ఒరి జినల్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడీలు తమ వద్ద ఉ న్నాయని వినతిపత్రం ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్న మరో సారి ఎల్లయ్య భార్య, కుమార్తెలు కార్యాలయానికి వచ్చి జీరాక్స్ పేపర్లతో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారని, మీరు ఎంత లంచం తీసుకున్నారని, కార్యాలయంలో పని చేసే నవీన్ అనే వ్యక్తే డాక్యుమెంట్ దగ్గరుండి తయారు చేశారని ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకొని బాధితుల వద్ద సమాచారం సేకరించి శాంతిపజేశారు. ఇదే విషయమై సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ వివరణ అడగగా.. ఎల్లయ్య పెద్ద కొడలు యాదమ్మ గత శనివారం సర్వే నంబర్ 267, 268, 269లో ఉన్న 4.9 ఎకరాల భూమిలో 2.5 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డాక్యుమెంట్ తీసుకువచ్చారని, అందులో జీరాక్స్ ఉన్న విషయాన్ని అంతగా గమనించలేదన్నారు. ఈ విషయమై ఎల్లయ్య భార్య సిద్ధమ్మ, ముగ్గురు కూతుర్లు వచ్చారు. జిరాక్స్ పత్రాలతో, తమ నాన్నను మోసం చేసి యాదమ్మ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుందని, దానిని నిలిపివేయాలని వినతి ఇచ్చారు. ప్రస్తుతం దానిని పరిశీలిస్తున్నామని, ఈ విషయంలో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని సబ్ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. -
ఖజానా గలగల
జడ్చర్ల: పట్టణంలో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. దాని ఫలితంగా స్థానిక సబ్‌రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏకంగా రూ.42.76 కోట్లు ఆదాయం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తు త ఆర్థిక సంవత్సరం కూడా ఇదే స్థాయిలో ఆదాయం సమకూర్చుకునే దిశగా ముందుకు సాగుతుంది. ఏప్రి ల్, మే నెలల్లోనే దాదాపు రూ.కోటి వరకు ఆదాయం వచ్చిందంటే ఇక్కడ నిత్యం వందకుపైగా రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. జోరుగా రియల్ వ్యాపారం జడ్చర్ల సబ్‌రిజిస్ట్రేషన్ పరిధిలోని బాలానగర్, రాజాపూర్, మిడ్జిల్, భూత్పూర్ మండలాల్లో రియల్ బూమ్ కొనసాగుతుండడంతో రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా పెరు గుతూ వస్తోంది. వందల ఎకరాల్లో వెంచర్లు వెలుస్తుండడం, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఎప్పటికప్పుడు చేస్తుండటం, మళ్లీ అవే ప్లాట్లు చేతులు మారుతుండడంతో రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం లభిస్తోంది. అదేవిదంగా వ్యవసాయ భూములు కూడా భారీగా చేతులు మారుతుండడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. ప్రధానంగా జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, భూత్పూర్ మండలాల పరిధిలో 44వ నంబర్ జాతీయరహదారి ఉండడంతో ఈ రహదారిని అనుసరించిన భూములు, ప్లాట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. అదేవిధంగా 167 నంబర్ జాతీయరహదారిని అనుసరించి ఉన్న జడ్చర్ల, మిడ్జిల్ మండలాల పరిధిలో సైతం భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు జోరందుకోవడంతో రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతుంది. జడ్చర్లలో మరింత డిమాండ్ జడ్చర్ల పరిధిలో భూములు, ప్లాట్లకు మంచి డిమాండ్ ఉంది. అటు ఇటుగా జాతీÆయ రహదారులననుసరించి ఎకరం భూమి ధర రూ.3 కోట్ల నుంచి రూ.5కోట్ల దాక పలుకుతుందంటే డిమాండ్ ఎలా ఉందో అంచనా వేయవచ్చు. ఇక జడ్చర్ల చుట్టుపక్కల చదరపు గజం ధర రూ.10వేలు మొదలు రూ.40వేల దాక కొనసాగుతోంది. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడం, పోలేపల్లి సెజ్‌లో పరిశ్రమల కొనసాగింపుతో ఈ ప్రాంత భూములకు రెక్కలొచ్చాయి. -
రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోండి సులభంగా...
నానాటికీ పెరిగిపోతున్న మోసాల నేపథ్యంలో ఏదైనా ఆస్తులు కొనుగోలు చేయాలంటే ఎంత భయమో తెలియంది కాదు. ఆస్తిని అమ్ముతున్న వ్యక్తి తనది కాని ఆస్తిని కూడా తనదిగా నమ్మించి తప్పుడు ధృవ పత్రాలు సృష్టించి మోసం చేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాలలో అతడు చెప్పే వివరాలను ‘ఆన్లైన్’లో పరిశీలించి అన్నీ నిజమని అనిపిస్తేనే ముందడుగు వేయడం ఉత్తమం. అంతేకాకుండా భూములు, ఇళ్లు, ప్లాట్లు తదితర ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు డాక్యుమెంట్లు మన పేరుపై రికార్డు అయి ఉంటాయి. అయితే అత్యవసర సమయంలో ఆయా డాక్యుమెంట్ నఖలు కావాలంటే మాత్రం కష్టం. అయితే వాటిని వెంట తీసుకెళ్దామంటే చోరీ జరగడమో లేదా పోగొట్టుకుంటామనే భయం వెంటాడుతుంది. అయితే నేడు ఆయా డాక్యుమెంట్లకు సంబంధించిన నఖలు డౌన్లోడ్ చేసుకునే వీలుంది. ఇంకా ఏ పేరున డాక్యుమెంట్ రిజిస్టర్ అయ్యిందో సులభంగా తెలుసుకునే విధానాన్ని ‘‘తెలంగాణ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్’’ వారు అందుబాటులోకి తెచ్చారు. మరి ఆ వివరాలను ఒకసారి చూద్దాం... రిజిస్ట్రేషన్ వివరాల కోసం... http://registration.telangana.gov.in/DeedDetails.do?methodgetDistricts లింక్‌లోకి వెళ్లాలి. ⇒ ఇక్కడ ‘‘రిజిస్ట్రేషన్ డిటేల్స్’’ ఫామ్ కనిపిస్తుంది. ⇒ కనిపిస్తున్న ఆఫ్షన్లలో జిల్లా, డాక్యుమెంట్ నంబరు, ఎస్ఆర్ఒ పేరు, సంవత్సరం నమోదు చేసి సబ్మిట్ ఆఫ్షన్‌పై క్లిక్ చెయ్యాలి. ⇒ ఇప్పుడు మీకు ప్రాపర్టీ వివరాలతో పాటు, దాని మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ తేదీ, కొన్న వారి పేరు, అమ్మిన వారి పేరు కనిపిస్తుంది. నోట్: రిజిస్ట్రేషన్ వివరాలలో అపార్ట్మెంట్, ఒపెన్ లే అవుట్ల గురించి కూడా తెలుసుకోవచ్చు. డౌన్‌లోడ్‌కు కావాల్సిన వివరాలు ఆయా డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవాలంటే సదరు డాక్యుమెంట్ నెంబరు, రిజిస్ట్రేషన్ అయిన సంవత్సరం, అది రిజిస్టర్ అయిన కార్యాలయం కోడ్ లేదా పేరు (ఎస్ఆర్ఒ) తెలిసి ఉండాలి. ఈ వెబ్సైట్లో చూడండి... http://registration.telangana.gov.in:7002/TGThumbNailCC/ లింక్‌ను క్లిక్ చేయండి. ⇒ ఇక్కడ స్క్రీన్‌లో కనిపిస్తున్న ‘‘కంటిన్యూ’’ ఆఫ్షన్‌ను ఎంచుకోండి. ⇒ ఇప్పుడు మీకు విండోలో ‘‘తంబ్నేల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్’’ ఫామ్ కనిపిస్తుంది. ⇒ ఇక్కడ కనిపిస్తున్న సంబంధిత ఆఫ్షన్లలో ‘‘జిల్లా’’, ‘‘ఎస్ఆర్ఒ’’(సబ్ రిజిష్ట్ర్ర్ ఆఫీస్), ఆస్తి రిజిష్టర్ అయిన సంవత్సరం, డాక్యుమెంట్ నంబరు తదితర వివరాలను ఎంటర్ చేయాలి. ⇒ ఇప్పుడు మీరు అందించిన వివరాలు సరిగ్గా ఉంటే ‘‘వెరిఫైడ్ సక్సెస్’’ అనే విండో కనిపిస్తుంది. ఈ విండోలో కనిపిస్తున్న ‘‘డౌన్లోడ్’’ ఆఫ్షన్‌ను క్లిక్ చేస్తే సంబంధిత డాక్యుమెంట్లు పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతాయి.