కోరుట్లటౌన్ : 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గ్రంథాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో మువ్వన్నెల పతాకం ఎగిరింది. జాతీయ గీతాలాపనతో గణతంత్ర సంబరాలు అంబరాన్ని అంటాయి.కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ అల్లూరి వాణిరెడ్డి, వయోవృద్ధుల సంఘంలో మున్సిపల్ చైర్మన్ శీలం వేణు జెండా
ఆవిష్కరించారు.
కోరుట్ల : పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం సేవా సమితి ఆధ్వర్యంలో జాతీయ పతాకం ఆవిష్కరణ కన్నుల పండువగా జరిగింది.
కోరుట్లరూరల్ : మండలంలోని అన్ని గ్రామాల్లో 69వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ చైర్మన్ నారాయణ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సత్యనారాయణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సంతోష్‌కుమార్ జెండాను ఆవిష్కరించారు.
మెట్‌పల్లి : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. పట్టణంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జెండా ఆవిష్కరించారు. పట్టణంలో వివిధ పార్టీల కార్యాలయాల్లో ఆయా పార్టీల అధ్యక్షులు జెండావిష్కరించారు.
కథలాపూర్ : కథలాపూర్ మండలంలోని గ్రామాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయంలో, పోలీస్‌స్టేషన్‌లో, మార్కెట్ కార్యాలయం, సింగిల్‌విండో కార్యాలయాల్లో, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ, ప్రై వేట్ పాఠశాలల్లో జాతీయజెండాను ఎగురవేసి ఉత్సవాలు జరిపారు.
ఇబ్రహీంపట్నం : మండలంలో 69వ గణతంత్ర వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ కందరి లక్ష్మీ, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రామ్‌నాయక్, జెండావిష్కరించారు.
మల్లాపూర్ : మల్లాపూర్ మండల కేంద్రంతో పాటు అన్నిగ్రామాల్లో శుక్రవారం 69వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, పాఠశాలల్లో హెచ్‌ఎంలు జెండా ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment