నాగార్జునసాగర్: వేగంగా వెళ్తున్న డీసీఎం రోడ్డు క్రాస్ చేస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో మంటలు ఎగిసి డీసీఎంలో పత్తిలోడు ఉండటంతో మంటలు పత్తికు అంటుకొని ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలోని నవీకాంప్లెక్స్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. వివరాలు.. నోర్కొ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రాత్రి విధులు పూర్తి చేసుకొని క్వార్టర్స్‌కు వెళ్తున్న సమయంలో గుంటూరు నుంచి పత్తిలోడుతో వెళ్తున్న డీసీఎం రోడ్డు దాటుతున్న కారును ఢీకొట్టింది. దీంతో మంటలు వ్యాపించి పత్తి కాలిపోయింది. సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కారులోని వ్యక్తి, డిసీఎం డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.