
సాక్షి, హైదరాబాద్: మోటార్ సైకిల్‌పై వేగంగా వస్తూ డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన ఆదివారం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్, ఎస్‌ఐ రాము తెలిపిన వివరాల ప్రకారం..ఉపేందర్ (23), మోహిన్ (35), జకీర్ (40)లు స్నేహి తులు. వీరు టైలరింగ్ పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం బైక్‌పై చాంద్రా యణగుట్ట నుంచి దుర్గానగర్ చౌరస్తా వైపు వస్తుండగా ముత్తూట్ ఫైనాన్స్ వద్ద డివైడర్ పైనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు.
ఈ ఘటనలో ఉపేందర్ అక్కడికక్కడే చనిపోగా, మోహిన్, జకీర్‌లు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఉపేందర్‌కు పుట్టుకతోనే పోలియోతో కాళ్లు చచ్చుపడిపోయాయి. ఇతర పనులు చేయలేని క్రమంలో టైలరింగ్ వృత్తినే ఎంచుకొని బిహార్ రాష్ట్రం నుంచి వచ్చి బాబుల్‌రెడ్డినగర్‌లో కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. ఉస్మానియా ఆస్పత్రి లో పోస్టుమార్టం అనంతరం ఉపేందర్ మృతదేహాన్ని బిహార్‌కు తరలించారు. మోహిన్, జకీర్ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.