ప్రముఖులకు ఈ జిల్లా అచ్చిరాదా!? | Road Accidents In Nalgonda | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో ప్రముఖుల రోడ్డు ప్రమాదాలు

Published Thu, Aug 30 2018 1:25 PM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Road Accidents In Nalgonda - Sakshi

నాని కారు ప్రమాద దృశ్యం

చిట్యాల (నకిరేకల్‌) : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు ప్రముఖులు రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారు. ఈ ప్రమాదాల్లో కొందరు మృతిచెందగా.. పలువురు గాయాలతో బయటపడ్డారు.  


  •  2006లో చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పటి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దంపతులు వేమవరపు ప్రసన్న, రత్నాకర్‌లు మృతిచెందారు.
  •    
     2007లో సినీనటి ప్రత్యూష (దండోర ఫేమ్‌) కట్టంగూరు శివారులో కారు బోల్తా పడడంతో మృతి చెందింది.
  •      
    2014లో ఆకుపాముల వద్ద నందమూరి జానకీరామ్‌ ప్రయాణిస్తున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఆయన మృతి చెందారు.
  •      
    2014లోనే టీడీపీ నేత లాల్‌జాన్‌పాషా నార్కట్‌పల్లి శివారులోని కామినేని జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
  •      
    2016లో సిమీ జాతీయ అధ్యక్షుడు మసూద్‌ ప్రయాణిస్తున్న కారు చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మసూద్‌  అక్కడిక్కడే మృతిచెందాడు.
  •      
    2017లో నార్కట్‌పల్లి ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై ఆగి ఉన్న లారీ ఢీకొట్టడంలో చిట్యాలకు చెందిన టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు దుబ్బాక సతీశ్‌రెడ్డి మృతి చెందారు.
  •      
    2008లో రాష్ట్ర విద్యుత్‌ శాఖ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా.. చిట్యాల పట్టణ శివారులోకి రాగానే ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
  •    
    2009లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సినీహీరో నాని చిట్యాల మండలం వెలిమినేడు ఆంజనేయస్వామి ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా  గాయపడ్డారు.
  •      
    2009లో మోతె వద్ద జరిగిన ప్రమాదంలో హీరో జూనియర్‌ ఎన్‌టీఆర్, రాజీవ్‌ కనకాల గాయపడ్డారు.
  •      
    2013లో నార్మాక్స్‌ చైర్మన్‌ గుత్తా జితేందర్‌రెడ్డి చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
  •      
    2015లో ప్రముఖ నేపథ్య గాయని శ్రావణభార్గవి హైదరాబాద్‌ నుంచి విజయవాడకు కారులో ప్రయాణిస్తుండగా చిట్యాల పట్టణ శివారులోకి రాగానే ఈమె ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రావణభార్గవి స్వల్ప గాయాలతో బయటపడింది. 
  •      
    తాజాగా టీడీపీనేత, హీరో నందమూరి హరికృష్ణ అద్దంకి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.  
     

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

ప్రణీత కారు ప్రమాద దృశ్యం

2
2/2

శ్రావణ భార్గవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement