పది రూపాయిల నాణేలపై పుకార్లు నమ్మొద్దు
Published Fri, May 5 2017 2:47 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM
రామగుండం : ఇటీవల కాలంలో నూతనంగా రిజర్వు బ్యాంకు విడుదల చేసిన పది రూపాయల కాయిన్స్ చెల్లుబాటు కావనే పుకార్లతో వ్యాపారులు, వివిధ ఆర్థిక సంస్థలు వాటిని తిరస్కరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బి.వి. సుబ్రహ్మణ్యం అన్నారు. అలాంటి పుకార్లను నమ్మవద్దని యధేచ్ఛగా పది రూపాయల కాయిన్స్ స్వీకరించవచ్చన్నారు.
బ్యాంకులలో కూడా డిపాజిట్లు, చెల్లింపుల్లో పది కాయిన్స్ తీసుకుంటారన్నారు. ఇటీవల కాలంలో నగదు కొరత ఎక్కువగా ఉండడంతో కాయిన్స్ చెలామణి పెంచామన్నారు. త్వరలోనే నగదు కరెన్సీ కొరత తీరుతుందన్నారు. కాయిన్స్ ఎవరైనా తిరస్కరించితే సెల్ నెం. 9440908845 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
Advertisement
Advertisement