సాక్షి, హైదరాబాద్: రాబోయే పది నెలల కాలానికి తెలంగాణ రాష్ట్రానికి 76 వేల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రణాళికేతర వ్యయం రూ. 54 వేల కోట్లుగా, ప్రణాళిక వ్యయం రూ. 22 వేల కోట్లు ఉంటుందని ఆర్థికశాఖ ప్రాథమిక అంచనా. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించిన ఆర్థికశాఖ, ఆ తరువాత మంత్రివద్ద జరుగుతున్న అంతర్గత సమావేశాల్లో ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.