చెదిరిన బతుకు చిత్రం! | Sad story of kondagattu bus accident victims | Sakshi
Sakshi News home page

చెదిరిన బతుకు చిత్రం!

Published Wed, Sep 19 2018 1:46 AM | Last Updated on Wed, Sep 19 2018 1:46 AM

Sad story of kondagattu bus accident victims - Sakshi

హైదరాబాద్‌ యశోదలో చికిత్సపొందుతున్న వనిత, గడ్డం జలజ

కొడిమ్యాల (చొప్పదండి): జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది కాళ్లు, చేతులు కోల్పోయి జీవచ్ఛవాలుగా మిగిలిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎందుకు బతికాంరా దేవుడా..! అని రోదిస్తున్నారు. అయినవారు లేక.. ఆదుకునేవారు కనిపించక.. దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతు న్నారు. ప్రమాదంలో 58 మంది గాయపడగా, అందులో కొడిమ్యాల మండలానికి చెందినవారే 47 మంది ఉన్నారు. డబ్బుతిమ్మయ్యపల్లికి చెంది న 11 మంది, హిమ్మత్‌రావుపేటకు చెందిన 10 మంది, శనివారంపేటకు చెందిన 11 మంది, రాంసాగర్‌కు చెందిన 9 మంది, తిర్మలాపూర్‌కు చెందిన ఐదుగురు, సంద్రాలపల్లికి చెందిన ఒక్క రు ఉన్నారు. క్షతగాత్రులు జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్‌ ఆçస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా రు. తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన ఎన్‌.లక్ష్మికి, ఎ.లింగవ్వకు 2 కాళ్లు, చేతులూ విరిగిపోయాయి. ప్రస్తుతం వీరు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన తైదల లింగయ్యకు 2 కాళ్లు విరిగిపోయాయి.  తైదల లతకు కుడిచేయి విరిగింది, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి కుటుంబసభ్యులు ఆస్ప త్రులకే పరిమితమై వారికి సేవలు చేస్తున్నారు.  

ఇళ్లకు తాళాలు వేసి..  
ప్రమాదంలో డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన కొంపెల్లి విజయ రెండు కాళ్లు విరిగాయి. ఈమె భర్త నచ్చయ్య 15 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. కొడుకు తిరుపతి ఆర్నెల్ల క్రితం దుబాయ్‌కి వెళ్లాడు. కూతురు స్వప్న ఇంటికి తాళం వేసి తల్లి వెంట కరీంనగర్‌ ఆస్పత్రిలో ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన లైసెట్టి శారద రెండుకాళ్లు విరిగాయి, తండ్రి కమలాకర్‌ దుబాయ్‌లో ఉండగా.. తల్లి లక్ష్మితో పాటు చెల్లి జయ, తమ్ముడు గణేశ్‌ బాధితురాలితో ఆస్పత్రిలో ఉంటున్నారు.  సందడిగా ఉండే వీరి ఇంటికి తాళం పడింది. పెద్దమ్మ కళావతిని ప్రమాదంలో కోల్పోయింది. డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన సీహెచ్‌ విజయకు రెండుకాళ్లు, పక్కటెముకలు విరిగాయి. మనవడు సూరజ్‌కు కాళ్లకు గాయాలయ్యాయి. బాధితులు హైద   రాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. బాధితురా లి ఇద్దరు కుమారులు, కోడళ్లు ఆస్పత్రిలోనే  ఉంటున్నారు. ప్రమాదంలో గోల్కొండ విజయ పక్కటెముకలు విరిగాయి. గర్భవతైన కూతురు సుమలతను ప్రమాదంలో కోల్పోయింది. కొడుకు అనిల్‌ ఆస్పత్రిలో తల్లి వెంట ఉంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన వనితకు కడుపులో తీవ్ర గాయాలు కావడంతో హైదరాబా ద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భర్త సంజీవ్‌రెడ్డి సింగపూర్‌ నుంచి వచ్చి ఆస్పత్రిలో ఉంటున్నాడు. పక్కటెముకలు విరగిన గడ్డం జలజ హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతోంది.
 
‘హిమ్మత్‌’ కోల్పోయింది 
బస్సు ప్రమాదంతో హిమ్మత్‌రావుపేట తన హిమ్మత్‌ను కోల్పోయింది. గ్రామానికి చెందిన లంబ మల్లవ్వ కాళ్లు విరిగాయి, కోడలు రజిత కాలు, చేయి విరిగింది. కొడుకు మహేష్‌ దుబాయ్‌ నుంచి వచ్చి, తల్లి, భార్యకు సపర్యలు చేస్తున్నాడు. ఎ.రమకు కాళ్లు, చేతులకు తీవ్ర గాయా లయ్యాయి. భర్త, పిల్లలు లేకపోవడంతో తమ్ము డు ఆస్పత్రిలో ఆమెతో ఉన్నాడు. ఆరె రాజమ్మ కా ళ్లు విరిగి హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది.

రాంసాగర్‌.. విషాదసాగరం
రాంసాగర్‌ గ్రామం విషాద సాగరమయ్యింది. గ్రామానికి చెందిన డి.అనిత కాలు విరిగింది, ప్రమాదంలో భర్త స్వామి చనిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బీ కీర్తన కాలుకు గాయాలయ్యాయి. ప్రమాదం లో కూతురు రితన్యను కోల్పోయింది. డిగ్రీ వి ద్యార్థినులు వైష్ణవి, సంగీత కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్నారు. సాహితికి గాయాలయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement