సాక్షి ఆసరా | sakshi janapatham in Manciryala | Sakshi
Sakshi News home page

సాక్షి ఆసరా

Published Thu, Dec 11 2014 3:02 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సాక్షి ఆసరా - Sakshi

సాక్షి ఆసరా

సమస్యల పరిష్కారమేలక్ష్యంగా ‘సాక్షి జనపథం’ గాజు కళ్లు.. ముడుతలు పడిన ఒళ్లు... 80 ఏళ్ల వయసులో ఆసరాకోసం అల్లాడుతున్న అవ్వాతాతలకు... ‘సాక్షి’ ఆసరానిచ్చింది. బుధవారం మంచిర్యాల పట్టణంలోని మారుమూల ప్రాంతమైన రంగపేటలో ‘సాక్షిజనపథం’ కార్యక్రమాన్ని నిర్వహించింది. హాజరైన ఎమ్మెల్యే దివాకర్‌రావు అప్పటికప్పుడు ఆరుగురు లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయించారు. దీంతో లబ్ధిదారుల్లో ఆనందం మిన్నంటింది.

సాక్షి, మంచిర్యాల/మంచిర్యాల టౌన్/మంచిర్యాల రూరల్ : ‘బాంఛెన్..! నా పెనిమిటి సచ్చిపోయి పన్నెండేళ్లు దాటినయ్... గిన్నేళ్లు ఎంత మొత్తుకున్నా సార్లు నాకు ‘వితంతు’ పింఛన్ ఇయ్యలే. నన్ను పట్టించునేటోళ్లు లేరు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలే. మీరు దేవుళ్ల మా వాడకొచ్చిండ్రు. నాకు న్యాయం చేయుండ్రి..’ అం టూ అంతులేని ఆవేదన వెల్లబుచ్చిన రేఖల పోశక్కకు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అప్పటికప్పుడే పెన్షన్ మంజూరు చేశారు. ఏళ్ల నుంచి పెన్షన్ పొందని వితంతు.. వికలాంగు లు.. వృద్ధులు ఆరుగురికి కొత్తగా పెన్షన్లు మం జూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మంచి ర్యాల మండలం రంగపేట గ్రామంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన జనపథం కార్యక్రమంలో పింఛన్ లబ్ధిదారులు పాల్గొని సమస్య లు విన్నవించారు. కార్యక్రమం గురించి విష యం తెలియగానే బాధిత పెన్షన్‌దారులు పెద్దమొత్తంలో అక్కడికి చేరుకున్నారు. వీరిలో 17 మంది పెన్షన్లు రాలేదని చెప్పగా.. తాజా జాబితా చూసిన అధికారులు 11 మందికి పెన్షన్లు మంజూరైనట్లు ప్రకటించారు. త్వరలోనే పెన్షన్ డబ్బులు అంద జేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఆరుగురికి ఎమ్మెల్యే దివాకర్ చొరవతో పెన్షన మంజూరయ్యింది. ‘సాక్షి’ నిర్వహించిన కార్యక్రమంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ‘ఏళ్ల నుంచి పరిష్కారం కాని మా సమస్య ‘సాక్షి’ రావడంతో తీరింది’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

సాక్షికే చెల్లింది..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ పండుటాకులకు వచ్చేదం తా పండుగ రోజులేనని, ప్రతి అవ్వకు, తాతకు, భర్తను కోల్పోయిన ఆడపడుచులకు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారందరికీ తెలంగాణ రాష్ట్రంలో ‘ఆసరా’ లభిస్తుందని భరోసా ఇచ్చా రు. వాస్తవాలను వెలికి తీసి ప్రజలను చైతన్యపరుస్తున్న ‘సాక్షి’ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించ డం అభినందనీయమని ప్రశంసించారు. ‘సాక్షి’ నిర్వహించిన ‘జనపథం’ పెన్షన్‌రాదనే ఆందోళన చెందుతున్న వారిలో ఆశ కల్పించిందని ఆయన చెప్పారు.

‘ఈ కార్యక్రమంలో నాతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులనూ పిలవడంతో వెంటనే అర్హులైన పలువురికి న్యాయం చేయగలిగా’ అని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వమూ అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఉందని, ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరూ ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మామిడి శెట్టి వసుంధర, ైవె స్‌చైర్మన్ నల్ల శంకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్ పల్ల రాజన్న, కో-ఆప్షన్ సభ్యుడు తోట తిరుపతి పాల్గొన్నారు.

పింఛన్ జాబితాలో పేర్లు నమోదు..
రంగపేట 27వ వార్డులోని 14వ బ్లాక్‌లో ఆసరా లేక అల్లాడుత్ను పండుటాకులకు ‘సాక్షి’ జనపథం ఊతకర్ర అయ్యింది. సాంకేతిక సమస్యతో అర్హత లిస్టు నుంచి తొలగించిన ఇద్దరు వృద్ధులు, ఇద్దరు వితంతువులు, ఇద్దరు వికలాంగులు మొత్తంగా ఆరుగురి పేర్లను మంచిర్యాల ఎమ్మెల్యేల దివాకర్ రావు స్థానిక మున్సిపల్ అధికారులతో మాట్లాడి జాబితాలో నమోదు చేయించారు.

గతంలో కంటే ఎక్కువే..
రంగపేటలో మొత్తం 300 మంది పింఛన్ల కో సం దరఖాస్తు చేసుకున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే వారిలో భర్తకు తొలగించి, భా ర్యకు మాత్రమే వృద్ధాప్య పింఛన్ అందించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు పైగా ఆదాయం ఉన్నా, ఏడున్నర ఎకరాల మె ట్టభూమి, మూడున్నర ఎకరాల తరి భూమి ఉ న్నవారిని కూడా ప్రభుత్వం ఫించను మంజూ రుకు పరిగణలోకి తీసుకోలేదు.

మొత్తం 300 మందికి గాను 199 మంది తొలి జాబితాకు అర్హత సాధించారు. అధికారులు మంగళవారం వరకు ఇచ్చిన తుది జాబితాలో మరో 40 మంది అర్హులుగా తేలారు. మరో ఆరుగురిని అప్పటికప్పుడే తుది జాబితాలో చేర్చారు. దీంతో మొత్తంగా 245 మంది అక్కడ అర్హులుగా గుర్తించారు. మరో పది మంది పింఛన్లకు అర్హులైనా.. ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వారి వివరాలను కూడా జనపథంలో భాగంగా అధికారులు సేకరించారు. వారికి పంఛన్ అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement