diwakar rao
-
మంచిర్యాల రాజకీయ చరిత్ర : గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
మంచిర్యాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఎన్.దివాకరరావు నాలుగోసారి గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ ఐ నేత ప్రేమ్ సాగరరావుపై 4877 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. దివాకరరావు వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. గతంలో మంచిర్యాల ఏర్పడకముందు రెండుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. 2014లో ఆయన టిఆర్ఎస్లో చేరి వరసగా మరో రెండుసార్లు గెలుపొందారు. దివాకరరావుకు 75070 ఓట్లు రాగా, ప్రేమ్ సాగరరావుకు 70193 ఓట్లు వచ్చాయి. ప్రేమ్ సాగరరావు ఎమ్మెల్సీగా పని చేశారు. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసి ఎర్రబెల్లి రఘునాధరావుకు 4981 ఓట్లు వచ్చి మూడోస్థానంలో నిలిచారు. మంచిర్యాలలో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మూడుసార్లు టిఆర్ఎస్ పార్టీనే గెలిచింది. భారీ తేడాతో పరాజయం.. మంచిర్యాల నియోజకవర్గంలో 2014 వరకు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అరవింద్ రెడ్డి టిఆర్ఎస్ను వదలి కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసి భారీ తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక్కడ 2014లో కాంగ్రెస్ ఐ నుంచి టిఆర్ఎస్లోకి వచ్చిన ఎన్. దివాకరరావు విజయం సాధించారు. దివాకరరావు అంతకుముందు ఉన్న లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొంది, తిరిగి మరో రెండుసార్లు మంచిర్యాల నుంచి గెలిచారు. 2014లో దివాకరరావుకు 59,250 ఓట్ల ఆధిక్యత వచ్చింది. దివాకరరావు వెలమ సామాజికవర్గానికి చెందినవారు. మంచిర్యాలలో రెడ్డి వర్గానికి చెందిన అరవిందరెడ్డి 2009 సాధారణ ఎన్నికలోను, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలోను గెలుపొందారు.2014లో ఓటమిపాలయ్యారు. గతంలో లక్సెట్టిపేట నియోజకవర్గం ఉండేది. అక్కడ ఒకరు చుంచు లక్ష్మయ్య (బిసి) తప్ప మిగిలినవారంతా వెలమ సామాజికవర్గానికి చెందినవారు కావడం విశేషం. రెండుసార్లు గెలిచిన అరవింద్‌రెడ్డి ప్రముఖ కాంగ్రెస్ నేత, జడ్.పి.చైర్మన్‌గా రెండుసార్లు, ఓసారి ఎమ్.పి.గా గెలిచిన జి.నరసింహారెడ్డి కుమారుడు. అంతకు ముందు పాత నియోజకవర్గం లక్సెట్టిపేటకు 13 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి రెండుసార్లు, జనతాపార్టీ, సోషలిస్టు పార్టీ ఒక్కోసారి గెలవగా ఒక ఇండిపెండెంటు కూడా మరోసారి నెగ్గారు. మాజీ ఉప ముఖ్యమంత్రి జె.వి. నరసింగరావు ఇక్కడ 1967,72లలో గెలవగా అంతకుముందు 1962లో ఆయన బంధువు జి.వి.పితాంబరరావు చేతిలో ఓడిపోయారు. జె.వి. నరసింగరావు 1957లో బేగంబజార్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. రెండు సార్లు పీతాంబరరావు గెలిస్తే, ఆయన సోదరుడు జి.వి.సుధాకరరావు కూడా మరో రెండుసార్లు విజయం సాధించారు. మరో దళిత నేత రాజమల్లు ఇక్కడ ఒకసారి, సిర్పూరులో మరోసారి, చిన్నూరులో మూడు సార్లు గెలిచారు. జె.వి. నర్సింగరావు గతంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాలలో సభ్యునిగా ఉండగా, జి.వి.సుధాకరరావు 1978లో శాసనసమండలి సభ్యునిగా ఉన్నప్పుడు చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గాలలో, 1989లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేసారు. రాజమల్లు 1974లో జలగం క్యాబినెట్లో పనిచేసారు. జె.వి. నర్సింగరావు అప్పట్లో కాసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంచిర్యాలలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కమీషన్ల కోసం ఎంసీహెచ్‌ను ముంచారు!
మంచిర్యాలటౌన్: స్థానిక నడిపెల్లి ఎమ్మెల్యే దివాకర్‌రావు కమీషన్లకు కక్కుర్తిపడి మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)ను గోదావరి ఒడ్డున వరద నీటిలో మునిగే చోట నిర్మించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. హాథ్‌సే హాథ్ జోడో యాత్ర కొనసాగింపులో భాగంగా చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 31వ రోజు ఆదివారం మంచిర్యాల పట్టణంలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ నివాసం నుంచి ప్రారంభమై ఐబీ చౌరస్తాలో ప్రభుత్వ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న ఐబీ ఆవరణలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించి మాట్లాడారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఐబీ ఆవరణలో నిర్మించి ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో ఉండి, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ఎన్నిసార్లు చెప్పినా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. గోదావరి ఒడ్డున నిర్మించడం వల్ల ప్రజలకు దూరభారం కావడంతోపాటు, ప్రభుత్వాసుపత్రికి దూరంగా ఉంటుందని, గోదావరికి వరదలు వస్తే మునిగి పోయే ప్రమాదం ఉందని చెప్పినా వినలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కమీషన్ల కోసమే ఎంసీహెచ్‌ను గోదావరిలో ముంచారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లాలో పంటలతోపాటు ఎంసీహెచ్ కూడా మునిగిందన్నారు. నిధులు ఖర్చు చేయాల్సింది ప్రజల సంక్షేమం కోసమే కానీ, ఎమ్మెల్యేల కమీషన్ల కోసం కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు విద్య, వైద్యం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. -
ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటిని ముట్టడించిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ మహిళా నేతలు
-
ఎన్నికలకు రెండేళ్ల ముందే వేడెక్కిన మంచిర్యాల రాజకీయం
-
విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్‌లో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే పురాణం సతీశ్, ఎమ్మెల్సీ దివాకర్ రావు భూమిపూజ చేశారు. రూ. కోటి రూపాయలతో ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణంతో మండలంలోని విద్యుత్ సమస్యలు తీరుతాయని వారు తెలిపారు. -
సాక్షి ఆసరా
సమస్యల పరిష్కారమేలక్ష్యంగా ‘సాక్షి జనపథం’ గాజు కళ్లు.. ముడుతలు పడిన ఒళ్లు... 80 ఏళ్ల వయసులో ఆసరాకోసం అల్లాడుతున్న అవ్వాతాతలకు... ‘సాక్షి’ ఆసరానిచ్చింది. బుధవారం మంచిర్యాల పట్టణంలోని మారుమూల ప్రాంతమైన రంగపేటలో ‘సాక్షిజనపథం’ కార్యక్రమాన్ని నిర్వహించింది. హాజరైన ఎమ్మెల్యే దివాకర్‌రావు అప్పటికప్పుడు ఆరుగురు లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయించారు. దీంతో లబ్ధిదారుల్లో ఆనందం మిన్నంటింది. సాక్షి, మంచిర్యాల/మంచిర్యాల టౌన్/మంచిర్యాల రూరల్ : ‘బాంఛెన్..! నా పెనిమిటి సచ్చిపోయి పన్నెండేళ్లు దాటినయ్... గిన్నేళ్లు ఎంత మొత్తుకున్నా సార్లు నాకు ‘వితంతు’ పింఛన్ ఇయ్యలే. నన్ను పట్టించునేటోళ్లు లేరు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలే. మీరు దేవుళ్ల మా వాడకొచ్చిండ్రు. నాకు న్యాయం చేయుండ్రి..’ అం టూ అంతులేని ఆవేదన వెల్లబుచ్చిన రేఖల పోశక్కకు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అప్పటికప్పుడే పెన్షన్ మంజూరు చేశారు. ఏళ్ల నుంచి పెన్షన్ పొందని వితంతు.. వికలాంగు లు.. వృద్ధులు ఆరుగురికి కొత్తగా పెన్షన్లు మం జూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంచి ర్యాల మండలం రంగపేట గ్రామంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన జనపథం కార్యక్రమంలో పింఛన్ లబ్ధిదారులు పాల్గొని సమస్య లు విన్నవించారు. కార్యక్రమం గురించి విష యం తెలియగానే బాధిత పెన్షన్‌దారులు పెద్దమొత్తంలో అక్కడికి చేరుకున్నారు. వీరిలో 17 మంది పెన్షన్లు రాలేదని చెప్పగా.. తాజా జాబితా చూసిన అధికారులు 11 మందికి పెన్షన్లు మంజూరైనట్లు ప్రకటించారు. త్వరలోనే పెన్షన్ డబ్బులు అంద జేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఆరుగురికి ఎమ్మెల్యే దివాకర్ చొరవతో పెన్షన మంజూరయ్యింది. ‘సాక్షి’ నిర్వహించిన కార్యక్రమంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ‘ఏళ్ల నుంచి పరిష్కారం కాని మా సమస్య ‘సాక్షి’ రావడంతో తీరింది’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. సాక్షికే చెల్లింది.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ పండుటాకులకు వచ్చేదం తా పండుగ రోజులేనని, ప్రతి అవ్వకు, తాతకు, భర్తను కోల్పోయిన ఆడపడుచులకు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారందరికీ తెలంగాణ రాష్ట్రంలో ‘ఆసరా’ లభిస్తుందని భరోసా ఇచ్చా రు. వాస్తవాలను వెలికి తీసి ప్రజలను చైతన్యపరుస్తున్న ‘సాక్షి’ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించ డం అభినందనీయమని ప్రశంసించారు. ‘సాక్షి’ నిర్వహించిన ‘జనపథం’ పెన్షన్రాదనే ఆందోళన చెందుతున్న వారిలో ఆశ కల్పించిందని ఆయన చెప్పారు. ‘ఈ కార్యక్రమంలో నాతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులనూ పిలవడంతో వెంటనే అర్హులైన పలువురికి న్యాయం చేయగలిగా’ అని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వమూ అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఉందని, ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరూ ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మామిడి శెట్టి వసుంధర, ైవె స్‌చైర్మన్ నల్ల శంకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్ పల్ల రాజన్న, కో-ఆప్షన్ సభ్యుడు తోట తిరుపతి పాల్గొన్నారు. పింఛన్ జాబితాలో పేర్లు నమోదు.. రంగపేట 27వ వార్డులోని 14వ బ్లాక్‌లో ఆసరా లేక అల్లాడుత్ను పండుటాకులకు ‘సాక్షి’ జనపథం ఊతకర్ర అయ్యింది. సాంకేతిక సమస్యతో అర్హత లిస్టు నుంచి తొలగించిన ఇద్దరు వృద్ధులు, ఇద్దరు వితంతువులు, ఇద్దరు వికలాంగులు మొత్తంగా ఆరుగురి పేర్లను మంచిర్యాల ఎమ్మెల్యేల దివాకర్ రావు స్థానిక మున్సిపల్ అధికారులతో మాట్లాడి జాబితాలో నమోదు చేయించారు. గతంలో కంటే ఎక్కువే.. రంగపేటలో మొత్తం 300 మంది పింఛన్ల కో సం దరఖాస్తు చేసుకున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే వారిలో భర్తకు తొలగించి, భా ర్యకు మాత్రమే వృద్ధాప్య పింఛన్ అందించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు పైగా ఆదాయం ఉన్నా, ఏడున్నర ఎకరాల మె ట్టభూమి, మూడున్నర ఎకరాల తరి భూమి ఉ న్నవారిని కూడా ప్రభుత్వం ఫించను మంజూ రుకు పరిగణలోకి తీసుకోలేదు. మొత్తం 300 మందికి గాను 199 మంది తొలి జాబితాకు అర్హత సాధించారు. అధికారులు మంగళవారం వరకు ఇచ్చిన తుది జాబితాలో మరో 40 మంది అర్హులుగా తేలారు. మరో ఆరుగురిని అప్పటికప్పుడే తుది జాబితాలో చేర్చారు. దీంతో మొత్తంగా 245 మంది అక్కడ అర్హులుగా గుర్తించారు. మరో పది మంది పింఛన్లకు అర్హులైనా.. ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వారి వివరాలను కూడా జనపథంలో భాగంగా అధికారులు సేకరించారు. వారికి పంఛన్ అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. -
‘మార్కెట్’ లొల్లి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అధికార టీఆర్ఎస్లో ‘మార్కెట్’ లొల్లి షురూ అవుతోంది. ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న నేతలకు, ఇటీవల ఎన్నికలు, ఆ తర్వాత పార్టీలో చేరిన నాయకులకు మధ్య పోరు రగులుతోంది. ఈ రెండు వర్గాల మధ్య అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం ఈ రెండు వర్గాలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఈ పదవులను తమ అనుచరులకు ఇప్పించుకుని పార్టీలో, నియోజకవర్గంలో తమ పట్టు నిలుపుకునేందుకు ఇరువర్గాల ముఖ్యనేతలు కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుండటంతో పోరు ఆసక్తికరంగా తయారైంది. ఎన్నికలకు ముందు రాష్ట్రపతి పాలన నేపథ్యంలో కాంగ్రెస్ హయాంలో నియమించిన మార్కెట్ కమిటీలు రద్దయ్యాయి. మంత్రివర్గ విస్తరణ అనంతరం కేసీఆర్ సర్కారు నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించే అవకాశాలున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పదేళ్లుగా ఉద్యమం చేస్తూ.. పార్టీ పటిష్టత కోసం పాటుపడిన నేతలను కాదని ఇటీవల పార్టీలో చేరిన నాయకులకు పదవులు ఎలా కట్టబెడతారని ఒక వర్గం నేతలు పేర్కొంటున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. * నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవుల కోసం నియోజకవర్గంలో ఆసక్తి కరమైన పోరు సాగుతోంది. పార్టీలో సీనియర్లుగా కొనసాగిన క్రియాశీలక నేతలు శ్రీహరీరావు వర్గం తరుఫున మార్కెట్ చైర్మన్ పదవులు ఆశిస్తుండగా, సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి అనుచరులు కూడా పట్టుబడుతుండడం ఇరువురి నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే ఒకవర్గం నేతలు హరీష్‌రావును కలువగా, మరో వర్గం నేతలు కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. * బోథ్, ఇచ్చోడ మార్కెట్ కమిటీల విషయంలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఎంపీ నగేష్ వర్గీయులకు, ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు వర్గీయులకు మధ్య పోటీ నెలకొంది. కొన్నేళ్లుగా టీఆర్ఎస్లో పనిచేస్తున్న రాథోడ్ వర్గీయులతోపాటు, ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరిన ఎంపీ గోడం నగేష్ అనుచరులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. * భైంసా, కుభీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల విషయంలో కూడా ఆసక్తి కరమైన పోటీ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి వర్గీయులు, ఇటు టీఆర్ఎస్ అనుబంధ ఎమ్మెల్యే అన్నంత స్థాయిలో జి.విఠల్‌రెడ్డి అనుచరులు ఈ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవులు విఠల్‌రెడ్డి అనుచరులైన కాంగ్రెస్ నేతలకు దక్కుతాయా, చారీ వర్గీయులను వరిస్తాయా వేచిచూడాల్సిందే. * మంచిర్యాల, లక్సెట్టిపేట మార్కెట్ కమిటీలపై ఎమ్మెల్యే దివాకర్‌రావు అనుచరులతోపాటు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా ఆశిస్తున్నారు. ఎన్నికలకు ముందు దివాకర్‌రావుతోపాటు ఆయన అనుచరులు టీఆర్ఎస్లో చేరారు. ఈ పదవులు ఎవరికి దక్కుతాయోననే ఆసక్తి నెలకొంది. * బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం నేతల ప్రయత్నాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులతోపాటు, పార్టీలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రేణికుంట్ల ప్రవీణ్ అనుచరులు కూడా ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. -
మిథానీ ఆర్టీసీ డిపోలో రూ.40లక్షల అద్దెలు స్వాహా
హైదరాబాద్: మరో అవినీతి జలగ గుట్టురట్టయ్యింది. అవినీతి అధికారులు బాగోతం రోజూ రోజుకూ హెచ్చురిల్లుతూనే ఉంది. ఆర్టీసీలో మాజీ సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వహించిన దివాకర్ రావు భారీగా అవినీతికి పాల్పడినట్లు తాజగా వెల్లడైయ్యింది. మిథానీ ఆర్టీసీ డిపోలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించే సమయంలో దివాకర్‌రావు దాదాపు రూ.40 లక్షల మేర స్వాహా చేసినట్లు తేలింది. షాపు అద్దెల పేరుతో ఈ మోసానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. దీంతో అతన్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.