అయినా.. అదే నిర్లక్ష్యం..! | same negligence at railway track! | Sakshi
Sakshi News home page

అయినా.. అదే నిర్లక్ష్యం..!

Published Sun, Jul 27 2014 2:17 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

అయినా.. అదే నిర్లక్ష్యం..! - Sakshi

అయినా.. అదే నిర్లక్ష్యం..!

మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ఘోర ప్రమాదం తర్వాత కూడా అటు రైల్వే అధికారులు, ఇటు బాటసారులు అప్రమత్తంగా వ్యవహరించడం లేదనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. జగిత్యాల-సిర్పూర్ కాగజ్‌నగర్ రూట్‌లో కరీంనగర్ శివారు హనుమాన్‌నగర్ వెళ్లే దారిలో ఈ రైల్వేక్రాసింగ్ ఉంది. ఈ రూట్‌లో రోజూ ఉదయం, సాయంత్రం రెండు ట్రిప్పులు పుష్పుల్ ప్యాసింజర్ రైలు నడుస్తుంది. శనివారం ఈ క్రాసింగ్ వద్ద ఓవైపు రైలు వస్తుండగా, మరోవైపు దానిని గమనిస్తూనే వాహనదారులు, పిల్లలు ఇలా ట్రాక్ దాటారు.  రైల్వేశాఖ స్పందించి ఇక్కడ వెంటనే గేటు ఏర్పాటు చేయడంతో పాటు బాటసారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముంది.      
 - కరీంనగర్


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement