తెలంగాణ ఎందులో అగ్రస్థానంలో ఉంది? | sarampalli Malla Reddy fired on trs government and kcr | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎందులో అగ్రస్థానంలో ఉంది?

Published Wed, Feb 8 2017 3:22 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

తెలంగాణ ఎందులో అగ్రస్థానంలో ఉంది? - Sakshi

తెలంగాణ ఎందులో అగ్రస్థానంలో ఉంది?

కేసీఆర్‌కు సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్‌  
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏ రంగంలో అగ్రస్థానం లో ఉందో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయాలని సీపీఎం నేత, ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రం 19.5 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని సీఎం చెబుతున్నారని, అయితే ఏ రంగంలో ఈ వృద్ధి రేటును సాధిం చిందో చెప్పకుండానే మన ఊరు–మన ప్రణాళిక కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిం చాలని సీఎం ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల వృద్ధి రేట్లను ప్రజలకు తెలపాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ఈ మూడు రంగాల వృద్ధి రేటునే ఎవరైనా పెరుగుదలగా గుర్తిస్తారని, ఇందులో ఒక రంగం పెరిగినా, మరొక రంగం లోటులో ఉన్నా, సగటున ఈ రంగాల స్థూల ఉత్పత్తి రేటుతో పాటు, జీవన ఆదాయం, వయో పరిమాణం పెరుగుదల, విద్య, ఆరోగ్యం, తాగునీరు, శానిటేషన్, పర్యావరణం వంటి రంగాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ అంచనా వేస్తుందని తెలియజేశారు. ఇన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తే, ఆ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement