sarampalli Malla Reddy
-
Telangana: కోతుల బెడద మార్చిన పంట విధానం
తెలంగాణ రాష్ట్రంలో కోతుల బెడదతో ఏటా వేలకోట్ల విలువగల పంటలకు నష్టం వాటిల్లుతోంది. కోతులకు భయపడి రైతులు కొన్ని పంటలు వేయడం లేదు. ముఖ్యంగా వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలూ, కొన్ని చోట్ల వరిపంటలు కూడా వేయడం లేదు. పండ్ల తోటలు, కూరగాయల పంటల సంగతి ఇక చెప్పవలసిన పనే లేదు. పంట పూర్తిగా కోతకు రాకముందే కోతుల మందలు వచ్చి నాశనం చేస్తున్నాయి. రాష్ట్రంలో కోతులవల్ల ఏకంగా పంటల విధానమే మారిపోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించవచ్చు. వరి, పత్తి మినహా మరే పంట పండించే పరిస్థితి లేదు. పప్పుధాన్యాలు, నూనెగింజలు కోతుల బెడదతో విస్తీర్ణం తగ్గాయి. కోతులు ఏడాదికి 2 లేదా 3 పిల్లలకు జన్మనిస్తాయి. అందువల్ల వీటి సంఖ్య వేగంగా పెరుగు తోంది. ఆహారం కొరకు మందలు మందలుగా వచ్చి ఎంతకైనా తెగబడతాయి. ఇంట్లో దూరి ఆహార వస్తువు లతోపాటు ఇతర వస్తువులను కూడా నాశనం చేస్తున్నాయి. మనుషులపై దాడిచేసి, గోళ్ళతో గీకి, పండ్లతో కొరికి గాయపరుస్తున్నాయి. వీటితో గాయాలపాలైన వారు కోలుకోవడం ఖర్చుతో కూడిన పని. రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్‌లో కోతుల రక్షణ కేంద్రం ఏర్పాటుచేసి వాటి పుట్టుకను నియం త్రిస్తున్నామని ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ కేంద్రం పనిచేయడం లేదు. సర్వే చేసి రూ. 2.25 కోట్లు వ్యయం చేసి కోతులను పట్టుకొని వాటికి పిల్లలు పుట్టకుండా స్టెరిలైజ్ చేస్తున్నామనీ, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నిర్మల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామనీ అటవీశాఖా మంత్రి చెప్పారు. కోతులను అడవుల్లోకి పంపడానికి పండ్ల చెట్లను నాటుతామనీ, తద్వారా వీటి బాధను తగ్గిస్తామనీ 2017 నవంబర్‌లో ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కానీ ఇది ఆచరణలోకి రాలేదు. కోతులు హైదరాబాద్‌లో అనేక ఇండ్లల్లోకి దూరి నష్టాలు కలిగి స్తున్నాయి. ముఖ్యంగా స్లవ్‌ు ఏరియాల్లో పేదల ఇండ్లల్లో తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వీటిద్వారా కొత్త జబ్బులు కూడా ప్రజలకు సోకు తున్నాయి. ఒక సర్వేలో 50 శాతం కోతులకు జబ్బులున్నాయనీ, అవి గ్రామాల్లో, పట్టణాల్లో తిరగడం ద్వారా ఆ జబ్బులు మనుషులకు వ్యాపింప చేస్తున్నాయనీ తేలింది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కోతుల బెడదను నివారించడనికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించలేదు. రోడ్లపక్కన చెట్లునాటడం, గ్రామాల్లో హరితహారం పేరుతో చెట్లు నాట డానికి వందలకోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ నాటిన చెట్లు కూడా ఎందుకూ ఉపయోగం కానివి. అవి ఎలాంటి కాయలుగానీ, పండ్లుగానీ చివరకు పూలుగానీ ఇచ్చేవికావు. వీటివల్ల కోతులు వెళ్తాయని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం హాస్యాస్పదంగా వుంది. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో అడవులున్నాయి. ఈ అడవుల్లో 40 శాతం భూమిలో ఎలాంటి చెట్లు చేమా లేవు. విలువైన టేకు, నల్లమద్ది లాంటి చెట్లను నరికివేసి స్మగ్లర్లు పట్టణాలకు అమ్ముకున్నారు. అడవిలో ఉన్న విప్ప, తునికి, అడవి మామిడి, పరికి, ఉసిరికాయల చెట్లు వంటి వాటిని పూర్తిగా లేకుండా చేశారు. కోతులకే గాక ఏ అడవి జంతువులకూ ఆహారం దొరకకుండా చేశారు. అందువల్ల అడవి పందులు, చివరికి చిరుతపులులు కూడా గ్రామాల్లోకి వస్తున్నాయి. దశాబ్దం క్రితంవరకు ఏ అడవి జంతువులు గ్రామాల్లోకి రాలేదు. కోతులపై పరిశోధ నలు చేసే పేరుతో, వాటి రక్తం సేకరించే పేరుతో కొన్ని ప్రైవేటు కంపెనీలు అడవుల్లో కోతులను పట్టి మందలకు మందలు పట్టణా లకు తెచ్చారు. ఇక్కడ పరిశోధన జరిగిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లో విడిచిపెట్టమని చెప్పినప్పుడు... వాటిని తీసుకెళ్లే వ్యక్తులు అడవిదాకా వెళ్లకుండానే, గ్రామాల్లోనే విడిచిపెట్టారు. అవి సంతాన వృద్ధి చేసుకొని గ్రామాలు వదిలిపెట్టకుండా వుంటున్నాయి. ఇది రైతులకు, గ్రామస్థులకు శాపంగా మారింది. (క్లిక్: డియాగేట్‌కు గుమ్మడికాయ కడదాం!) రైతులు ధైర్యంగా వచ్చే వానాకాలం నాటికి అన్ని రకాల పంటలు వేసేవిధంగా అవకాశం కల్పించాలంటే కోతులు, పందుల బెడదను పూర్తిగా నివారించాలి. ఆ హామీ ప్రభుత్వం ఇవ్వాలి. కోతుల బెడదతో ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటున్నది. ఇందువల్ల మొత్తం పారిశ్రామిక, సేవారంగాలు దెబ్బతింటాయన్న ఆర్థిక సూత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. (క్లిక్: ఆహార స్వావలంబన విధాన దిశగా...) - సారంపల్లి మల్లారెడ్డి ఉపాధ్యక్షులు, అఖిల భారత కిసాన్ సభ -
PM PRANAM Scheme: ఈ పథకంతో ఆహార భద్రతకు ప్రమాదం
కేంద్ర ప్రభుత్వం ‘పీఎం ప్రణామ్’ పథకాన్ని చర్చల కోసం విడుదల చేసింది. ఈ పథకాన్ని రాష్ట్రాలు ఆమో దిస్తే చట్టం చేయాలని నిర్దేశించారు. దేశంలో ఎరువుల వాడకం విచక్షణా రహితంగా పెరుగుతున్నదనీ, ఆ విని యోగాన్ని తగ్గించాలనీ ఈ పథకాన్ని రూపొందించారు. ఎరువుల వినియోగం తగ్గితే వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గిపోతుంది. ఇప్పటికే వంటనూనెలు, పప్పులు, పంచదార, పత్తి, ముతక ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నాము. గతంలో ఇవన్నీ ఎగుమతి చేసిన దేశం మనది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) విధానాలు వచ్చిన తర్వాత, స్వయంపోష కత్వంలో ఉన్న దేశం సబ్సిడీలు తగ్గించడంతో దిగుమతులపై ఆధారపడుతున్నాము. ‘పీఎం ప్రణామ్’(పీఎం ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజేమెంట్) పథకం ఎరువుల సబ్సిడీలను కోత పెట్టాలని స్పష్టంగా చెపుతున్నది. 2017–18లో 528 లక్షల టన్నుల ఎరువులు విని యోగించాము. 2021–22లో 640 లక్షల టన్నులకు వినియోగం పెరిగింది. ఈ పెరుగుదలను తగ్గించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ప్రకారం ఎరువులకు ఇస్తున్న సబ్సిడీని ఆదా చేస్తారు. ఆదా చేసిన దానిలో 50 శాతం రాష్ట్రాలకు ఇస్తారు. ఈ 50 శాతంలో 70 శాతం గ్రామ, జిల్లా, బ్లాక్‌లకు ప్రత్యామ్నాయ ఎరువుల సాధనకు ఇస్తారు. మిగిలిన 30 శాతం ఎరువుల తగ్గింపుపై, సేంద్రీయ ఎరువులపై అవగాహన కల్పించడానికీ, రైతులను చైతన్యపర్చడానికీ శిక్షణ ఇస్తారు. మిగిలిన 50 శాతం కేంద్రప్రభుత్వం తన బడ్జెట్లో కలుపుకొంటుంది. భారతదేశంలో హెక్టారుకు 175 కిలోల ఎరువులు వాడుతున్నాము. హెక్టారు ఉత్పాదకత 3,248 కిలోలు వస్తున్నది. 43 కోట్ల ఎకరాలు సాగుచేస్తున్న దేశంలో నేటికి 9 కోట్ల ఎకరాల భూమి బీడుగా మారింది. జనాభా ఏటా 1.9 శాతం పెరుగుతున్నది. పెరిగిన జనాభాకు ఆహారధాన్యాల ఉత్పత్తిని మరింత పెంచాలి. వాస్తవానికి భారతదేశంలో 80 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. అందులో 40 కోట్ల మంది దినసరి ఆహారధాన్యాల వాడకం 450 గ్రాముల నుండి 325 గ్రాములకు తగ్గిపోయింది. సేంద్రీయ ఎరువులను, రసాయనిక ఎరువులను కలిపి వాడడం ద్వారానే వ్యవసాయోత్పత్తులు పెరుగుతాయి. చైనాలో 25.5 కోట్ల ఎకరాలలో 61.22 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి చేస్తున్నారు. హెక్టారుకు 6,081 కిలోలు ఉత్పత్తి అవుతున్నది. 2018 గణాంకాల ప్రకారం హెక్టారుకు 393.2 కిలోల ఎరువులు వాడుతున్నారు. ఎరువుల వినియోగం పెంచడంతో మనదేశం కన్నా రెట్టింపు ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతున్నది. పైగా వారు 2.77 బిలియన్ డాలర్ల ఎరువులను ఎగుమతి చేస్తున్నారు. ఎరువుల వినియోగాన్ని పెంచకుండా ఉత్పత్తి, ఉత్పాదకత పెరగదు. ఈమధ్య శ్రీలంక అనుభవం చూసినపుడు సేంద్రీయ ఎరువుల వాడకంతో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయి తీవ్ర సంక్షోభంలో పడి ప్రభుత్వమే కూలిపోయింది. ఈ పథకం అమలుచేస్తే భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే వ్యవసాయ రంగంలోకి 8 కార్పొరేట్ సంస్థలు వచ్చి తమ వ్యాపారాలు సాగిస్తున్నాయి. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయడంకన్నా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటేనే వారికి మంచి లాభాలు వస్తాయి. 2015లో శాంత కుమార్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం, కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థలను ఎత్తివేయడం, సబ్సిడీని నగదు బదిలీగా మార్చడం చేయాలని ఇచ్చిన సలహాలను ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్నది. మనకు ఎగుమతులు చేస్తున్న దేశాలు తమ బడ్జెట్లలో 7 నుండి 10 శాతం వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నాయి. పైగా ముడి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి అదనపు లాభానికి భారతదేశానికి ఎగుమతి చేస్తూ వేలకోట్ల లాభాలు గడిస్తున్నాయి. దిగుమతులు రావడం వల్ల స్థానిక పంటల ధరలు తగ్గి రైతులకు గిట్టుబాటు కావడంలేదు. కార్పొరేట్ సంస్థలు వ్యవసాయరంగంలో తమ ప్రాబల్యం పెంచడానికి వీలుగా ఇలాంటి పథకాలను తేవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం రుణాలు ఇవ్వక పోవడం, సబ్సిడీలకు కోతపెట్టడంతో రైతులు మైక్రోఫైనాన్స్ సంస్థల బారిన పడి, వారికి వడ్డీ చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో 2.5 శాతం మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు. దీనిని 7 శాతానికి పెంచాలి. ఎరువులను శాస్త్రీయంగా వినియోగించడానికి వీలుగా భూసార పరీక్షలు జరిపి రైతులను చైతన్య పరచాలి. అంతేగానీ ఇలాంటి ప్రమాదకర పథకాలను అమలు పరచరాదు. - సారంపల్లి మల్లారెడ్డి ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు -
ఏది ఉచితం? ఏది అనుచితం?
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇస్తున్న రాయితీలను, సబ్సిడీలను ఉచితాలుగా ప్రకటించి... వాటిని రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచనలు, సలహాలు ఇస్తూ ప్రకటన చేసింది. ఏవి ఉచితాలో, వేటిని ఉపసంహరించుకోవాలో స్పష్టంగా చెప్పలేదు. ఉచితం అంటే పూర్తి సబ్సిడీగా ఇచ్చేది. ఎలాంటి శ్రమ, ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చేది. ఈరోజు దేశంలో 80 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన బతుకుతున్నారు. వారికి కనీస పౌష్టికాహారం అందుబాటులో లేదు. ఐదేళ్ల లోపు పిల్లలు వెయ్యికి 40 మంది మరణిస్తున్నారు. ఉత్పత్తి ధర చెల్లించి కొనుగోలు చేసే శక్తి ప్రజలలో లేదు. అలాంటి ప్రజలకు రాయితీలు ఇవ్వాలి. శ్రమ చేయడానికి శక్తిలేని వారు, వయస్సు మళ్లినవారు, ఆనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వం ఉచితంగా సహకారం అందించాలి. ప్రస్తుతం రాష్ట్రాలు చౌక డిపోల ద్వారా బియ్యం ఇస్తున్నాయి. వీటికి తోడు ఆసరా పింఛన్లు, భరోసా పింఛన్లు వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇస్తున్నారు. వీటితోనే వీరు బతుకుతున్నారు. ఈ ఉచితాలు రద్దు చేస్తే వీరిలో చాలామంది బతకలేరు. వ్యవసాయ రంగానికి ఎరువులు, విత్తనాలు, విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పేర్లతో రాయితీలు ఇస్తున్నారు. వ్యవసా యోత్పత్తులకు పెట్టిన పెట్టుబడిని శాస్త్రీయంగా ప్రభుత్వం లెక్కించడంలేదు. చివరికి మార్కెట్లలో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక దేశంలో ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఏదో రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన ప్రజలకు సబ్సిడీల పేరుతో రాయితీలు ఇస్తూనే ఉన్నాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ రాయితీలన్నింటినీ రద్దు చేయాలని సలహా ఇస్తున్నది. వార్షిక తలసరి ఆదాయం దేశంలో రూ. 1,50,326గా కేంద్రం ప్రకటించింది (2021–22). అంతకు తక్కువ వచ్చిన వారు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల రాయితీలను గమనించి ఆహార సబ్సిడీ (రూ. 2,06,831 కోట్లు), ఎరువుల సబ్సిడీ (రూ. 1,06,222 కోట్లు), గ్యాస్ (రూ. 8,940 కోట్లు), పెట్రోల్ సబ్సిడీ (రూ.3.30 లక్షల కోట్లు) ఏటా ఇస్తున్నది. ఈ మధ్య రైతు కుటుంబానికి రూ. 6,000 చొప్పున కిసాన్ సమ్మాన్ పేర రూ.68,000 కోట్లు, వడ్డీమాఫీకి రూ. 19,500 కోట్లు, పంట బీమాకు రూ. 15,500 కోట్లు... మొత్తం రూ.1,03,000 కోట్లు సబ్సిడీగా ఇస్తున్నది. దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ కార్పొరేషన్లు, ఆయా వర్గాలకు 20 శాతం సీడ్‌మనీ పేర సబ్సిడీలు ఇచ్చి బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నారు. వాటితో ఉపాధి చాలామంది సంపాదించుకుంటున్నారు. రాష్ట్రాలు రాయితీలను రద్దు చేయాలంటున్న కేంద్రం ఈ రాయితీలను కూడా రద్దు చేయాల్సి ఉంటుంది! పేదలు తమ పిల్లలను బడికి పంపకుండా కూలీకి తీసుకుపోవడంతో అక్షరాస్యత పెరగడం లేదు. అక్ష్యరాస్యతను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద కుటుంబాలకు సంవత్సరానికి ఉచితంగా రూ. 12,500 ఇవ్వడంతో వారు పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నారు. ఆ విధంగా విద్య వ్యాప్తి జరుగుతున్నది. మరి ఈ సహాయాన్ని ఆపాలంటారా? కాలేజీలలోగానీ, యూనివర్సిటీలలో గానీ పేదలకు అనేక రాయితీలు ఉన్నాయి. వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పేరుతో ఉచిత వైద్యం చేయిస్తున్నారు. ఈ ఉచితాలన్నింటినీ లెక్కవేసినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లలో 15 శాతానికి మించవు. కానీ, కార్పొరేట్ సంస్థలు ఈ రాయితీలను రద్దు చేయాలనీ, తమకు అనుకూల విధానాలు తేవాలనీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కార్పొరేట్లకు తలొగ్గింది. సెప్టెంబర్ 2019న ఒక జీఓ ద్వారా కార్పొరేట్లు చెల్లించే 30 శాతం పన్నును 22 శాతానికి తగ్గించారు. మార్చి 2033 నాటికి 25 శాతం నుండి 15 శాతానికి తగ్గిస్తామని ప్రకటించారు. విదేశాలలో 35 నుండి 40 శాతం పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ, ఇక్కడ పన్నులు తగ్గిస్తున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటివాళ్ళు 13 రంగాలలో మోసాలు చేసి లక్షల కోట్లు ఎగనామం పెట్టారు. 2019 ఏప్రిల్ 14కు ముందు రూ. 7 లక్షల కోట్లు వారి ఖాతాల నుండి ‘రైట్ ఆఫ్’ చేశారు. నిరర్థక ఆస్తుల పేర 10 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ చేశారు. రూ. 2.11 లక్షల కోట్లు బెయిల్ ఔట్ కింద ఇచ్చారు. జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, ఇటలీ తదితర దేశాలలో కార్పొరేట్లపై 30–40 శాతం పన్నులు వసూళ్ళు చేయడంతోపాటు నెలవారీ వేతనాలపై పన్ను వసూలు చేస్తూ ఆహార, ఇతర సంక్షేమ సబ్సిడీలు పెద్ద ఎత్తున ఇస్తున్నారు. ఈ విషయాలు తెల్సినప్పటికీ భారత దేశంలో ఉచితాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను రద్దుచేసి, కార్పొరేట్లకు బహి రంగంగా లాభాలు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. కేంద్రం ప్రకటించిన ‘ఉచితాల రద్దు విధానాన్ని’ ఉపసంహరించుకోవాలి. (క్లిక్: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర) - సారంపల్లి మల్లారెడ్డి అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు -
వరి కొనుగోలు బాధ్యత కేంద్రానిదే
తెలంగాణలో వరి పంటను రాజకీయ సమస్యగా మార్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో చెలగాటం ఆడు తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం, బాయిల్డ్ రైస్ కొనమని రాష్ట్ర ప్రభు త్వానికి నోటీసులు పంప డంతో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బలపరుస్తూ, రాష్ట్రంలో వరి పంట వేయరా దనీ, ప్రత్యామ్నాయాలు వేయమనీ, కేంద్రం వరి పంటను కొనననీ చెప్పినట్లు ప్రచారం చేసింది. అసలు వరి పంటను ఎవరు కొనుగోలు చేయాలి? దశాబ్దాలుగా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం సేకరణ చేస్తోంది. ఎఫ్‌సీఐ చౌక డిపోలకు బియ్యాన్ని సరఫరా చేసే బాధ్యతను తీసుకొని కొన్ని రాష్ట్రాల నుండి బియ్యం సేకరిస్తోంది. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, ఛత్తీస్‌గఢ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల నుండి బియ్యాన్ని సేకరిస్తోంది. 2020–21లో దేశంలో 12.23 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా, 25 రాష్ట్రాల నుండి 5.99 కోట్ల టన్నులు సేకరించింది. ఇందులో బఫర్ స్టాక్ 1.35 కోట్ల టన్నులు పోగా మిగిలిన బియ్యాన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. కొన్ని రాష్ట్రాలు కొనుగోలు కేంద్రాలు తెరిచి కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసి మిల్లర్ల ద్వారా ఎఫ్‌సీఐకి పెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ముందు తమ సొంత డబ్బులతో కొనుగోలు చేసి, ఎఫ్‌సీఐ ఇచ్చే డబ్బులతో తమ పెట్టుబడిని పూడ్చు కుంటున్నాయి. ఈ విధంగా రాష్ట్రాలు సబ్ ఏజెం ట్లుగా పని చేస్తున్నాయి. అంతేగానీ రాష్ట్రాలు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసి, నిల్వ ఉంచుకొని వ్యాపారం చేయడం సాధ్యం కాని పని. నిల్వ సౌకర్యాలు కూడా రాష్ట్రాలకు లేవు. 2004 నుండి రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ, సహకార సంఘాల ద్వారా వడ్లు కొనుగోలు చేసి మిల్లర్లతో ‘కస్టం మిల్లింగ్’ ద్వారా బియ్యాన్ని చేసి ఎఫ్‌సీఐకి ఇస్తోంది. క్వింటాలు వరి ధాన్యానికి 66 కిలోల బియ్యం మిల్లర్లు ఇచ్చే ప్రాతిపదికపై కొనుగోలు జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరు వాత (2014) కూడా ఆదే విధానం కొనసాగుతోంది. రెండేళ్లుగా వర్షాలు అనుకూలంగా పడటంతో వరి ధాన్యం పెరిగింది. తెలంగాణలో 26 లక్షల ఎకరాల నికర విస్తీర్ణం 60 లక్షల ఎకరాలకు పెరిగింది. వానా కాలం వడ్లు ముడి బియ్యం (పచ్చి బియ్యం) గానూ, యాసంగి వడ్లు బాయిల్డ్ రైస్‌గానూ (ఉప్పుడు బియ్యం) వస్తాయి. ఈ రెండు రకాల బియ్యానికి కేంద్ర ప్రభుత్వ సేకరణకు నాణ్యత ప్రమాణాలు నిర్ణయించారు. వాటి ప్రకారం మిల్లర్ల నుండి బియ్యం ఎఫ్‌సీఐ కొనుగోలు చేయాలి. కానీ గత సంవత్సరం యాసంగి బాయిల్డ్ రైస్‌ను 24.60 లక్షల టన్నుల మాత్రమే కొనుగోలు చేస్తామనీ, మిగిలినవి ముడి బియ్యంగా ఇవ్వాలనీ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. యాసంగి బియ్యం ముడి బియ్యంగా మార్చాలంటే 25 శాతం నూక వస్తుంది. ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల యాసంగి బియ్యం ముడి బియ్యంగా 66 శాతం రావు. అయితే మార్కెట్లలో బాయిల్డ్ బియ్యానికి కూడా గిరాకీ ఉంది. అందువల్ల కేంద్రం తగాదా పెట్టకుండా సేకరించాల్సింది. కేంద్ర ప్రభుత్వం సేకరించిన బియ్యం బఫర్ స్టాక్స్, ఆహార పంపిణీ వ్యవస్థకు పోగా మిగిలినవి ఎగుమతి చేయాలి. 2018–19లో 128.75 లక్షల టన్నులు, రూ.50,308 కోట్లు; 2019–20లో 120.14 లక్షల టన్నులు, రూ.53,990 కోట్ల విలువైన బియ్యం ఎగుమతి చేయడం జరిగింది. మిగులు ఉత్పత్తి జరిగినప్పుడు కూడా రాష్ట్రాల నుండి అద నంగా కేంద్రం సేకరించి ఎగుమతులు చేసే అవ కాశం ఉంది. కానీ 2020–21 నుండి కేంద్రం బియ్యం సేకరించడానికి ఆంక్షలు పెడుతున్నది. ఇది గత విధానానికి వ్యతిరేకం. వర్షాలు సక్రమంగా పడి, నీటి లభ్యత ఎక్కువున్నప్పుడు ఎక్కువగా పండిం చమని ప్రోత్సాహించాల్సింది పోయి, వరి పండిం చకూడదని కేంద్రం చెప్పడం సరి కాదు. పైగా పంట పండిన తరువాత సన్నబియ్యం కావాలనడం కన్నా, పంట వేసే ముందే సన్నధాన్యం విత్తనాలను రైతు లకు అందుబాటులోకి తెచ్చి ఆ పంటను సేకరిం చాలి. రాష్ట్రాలను ఇబ్బందులు పెట్టడానికి కేంద్రం ఈ నాటకం ఆడుతున్నది. ఈ మాత్రం ఉత్పత్తి పెరుగుదలను కేంద్రం భరించలేకపోతోంది. మన దగ్గర హెక్టారుకు 2.3 టన్నులు మాత్రమే వరి దిగుబడి వస్తుండగా, చైనాలో 8 టన్నులు, అమెరికాలో 6 టన్నులు వస్తోంది. వారు తమ అవసరాలు పోగా మిగిలినవి ఎగుమతులు చేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, బియ్యాన్ని పిండిగా మార్చి, పిండిని రొట్టెలుగా మార్చి వినియోగానికి ఉపయోగపడే విధంగా సరుకులను తయారు చేయాలి. అప్పుడే అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమ తులకు మంచి గిరాకీ ఉంటుంది. కానీ, ఈ ప్రభు త్వాలు గతంలో ఉన్న చిన్న తరహా ప్రాసెసింగ్ యూనిట్లను (వడ్ల మిల్లులు, నూనె మిల్లులు, పప్పు మిల్లులు) ఎత్తివేసే విధంగా భారీ పరిశ్రమలతో పోటీ పెట్టాయి. సహకార సంఘాల ద్వారా గానీ, ఎఫ్పీఓల ద్వారా గానీ, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి రైతుకు అదనపు ఆదాయం వచ్చే విధంగా ప్రాసెసింగ్, గ్రేడింగ్ చేసే విధానాన్ని కొన సాగించాలి. ఈ విధానం వల్ల దేశంలో కూడా విని యోగం పెరుగుతుంది. అంతేగానీ వరి పండించ కూడదని చెప్పడమంటే రానున్న కాలంలో ప్రజలను ఆకలి చావులకు గురి చేయడమే తప్ప మరొకటి కాదు. కార్పొరేట్ సంస్థల ఆదేశాల మేరకు వ్యవసా యోత్పత్తుల విధానాన్ని మార్చడం జరుగుతున్నది. అంతేగానీ దేశ ప్రయోజనాలను గానీ, ఆహార అవస రాలను గానీ గుర్తించడం లేదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతతో రాష్ట్రాలలో పండిన పంటలను కనీస మద్దతు ధరలకు (ఆ ధరలు తక్కువైనా) కొనుగోలు చేసి రైతులను రక్షించాలి. వ్యాసకర్త: సారంపల్లి మల్లారెడ్డి ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు మొబైల్: 94900 98666 -
ఉత్పత్తిరేటు తగ్గినా మాంద్యం లేదంటే ఎలా?
జాతీయ స్థూల ఉత్పత్తి రేటు తగ్గినప్పటికీ, భారతదేశంలో మాంద్యం లేదంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ పార్లమెంట్ శీతాకాలం సమావేశాలలో ప్రకటించారు. మరోవైపు దేశంలో మాంద్యం కొనసాగడం వల్ల జాతీయ స్థూల ఉత్పత్తి తగ్గుతున్నదని ప్రధాని మోదీ ప్రకటించారు. పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రధాని, ఆర్థిక మంత్రి భారత ప్రజానీకాన్నే కాక ఆర్థిక మేధావులను కూడా గందరగోళం చేస్తున్నారు. 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు పెంచుతామని ప్రకటించారు. 2019–20లో 2.8 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. 2025 నాటికి మరో 3.2 ట్రిలియన్ డాలర్లకు పెరగాలి. కానీ 2018–19లో 7.1 శాతంగా ఉన్న స్థూల ఉత్పత్తి రేటు ప్రస్తుతం రెండవ క్వార్టర్లో 4.5 శాతానికి తగ్గినట్లు ఆర్థిక గణాంకాలు చెపుతున్నాయి. ప్రస్తుత స్థూల ఉత్పత్తి రేటు ప్రకారం మరో 9 ఏళ్లకు అనగా 2033–34 నాటికి 5.18 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు చెపుతున్నారు. పై గణాంకాల్ని చూసినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యం వల్ల ఉత్పత్తి రేటు తగ్గినట్లు స్పష్టమవుతున్నది. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ఈ మాంద్యం ఇప్పట్లో తగ్గదని తెలుస్తుంది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిలోకి తెస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని ఎన్నికల హామీ సందర్భంగా ప్రకటిం చారు. కానీ వ్యవసాయరంగం స్థూల ఉత్పత్తి ప్రస్తుతం 2.1 శాతంగా ఉంది. లక్ష్యం 4 శాతం పెట్టుకున్నప్పటికీ ఏనాడూ ఆ లక్ష్యాన్ని చేరలేదు. 2001 నాటికి 58.3 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడిన జనాభా ప్రస్తుతం 52.7 శాతంగా ఉన్నారు. 2050 నాటికి వీరి సంఖ్య 25.7 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రధాని ప్రకటించిన పథకాలలో ఉత్పాదకత పెంచడం, గిట్టుబాటు ధర కల్పిం చడం, మంచి ఉపకరణాలను అందుబాటులో పెట్టడం, ఇరిగేషన్ సౌకర్యం కల్పించడం, విత్తన బదలాయింపు, తగినంత ఎరువు వాడకం, నూతన టెక్నాలజీ వినియోగం చేపట్టాలని ప్రణాళికలో చెప్పారు. మద్య దళారీలను తొలగించి ముందే నిర్ణయించిన కనీస మద్దతు ధరను మార్కెట్లో అమలు జరపడంతోపాటు, నిర్ణయించిన ధరకన్నా తక్కువ వచ్చినప్పడు ఆ లోటు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. కానీ పై అంశాలేవీ వాస్తవంలో అమలుకు నోచుకోవడం లేదు. దేశంలో 2018–19లో 43 కోట్ల ఎకరాలు సాగులో ఉండగా 30 కోట్ల ఎకరాలలో ఆహార ధాన్యాలు (7 కోట్ల ఎకరాలలో పప్పుధాన్యాలు కలిపి), 6.5 కోట్ల ఎకరాలలో నూనెగింజలు, 1.25 కోట్ల ఎకరాలలో చెరకు, 3 కోట్ల ఎకరాలలో పత్తి తదితర పంటలు వేస్తున్నారు. పై పంటల సాగుభూమి క్రమంగా తగ్గుతున్నది. ఉత్పాదకత కూడా గత అయిదేళ్లలో పెరగలేదు. ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచడానికి అనేక పథకాలను ప్రకటిం చింది. కిసాన్ సమ్మాన్ కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 6,000ల చొప్పున దేశంలోని 14.65 కోట్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి రూ. 75,000 కోట్లు ఫసల్‌బీమాకు ప్రీమియం కింద రు. 14 వేల కోట్లు, వడ్డీ మాఫీకి 18 వేల కోట్లు, కృషి సించాయ్యోజనకు 3,500 కోట్లు, మార్కెట్ జోక్యం పథకం కింద 3 వేల కోట్లు, రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన కింద 3,500 కోట్లు, మొత్తం రూ. 1,29,585 కోట్లను 2019–20 బడ్జెట్లో కేటాయిం చారు. మొత్తం బడ్జెట్లో ఇది 4.6 శాతంగా ఉంది. కానీ కిసాన్ సమ్మాన్‌కి 75వేల కోట్లు మినహాయిస్తే వ్యవసాయ బడ్జెట్ కేటాయింపు 54,585 కోట్లు మాత్రమే. అనగా మొత్తం బడ్జెట్లో 1.96 శాతం మాత్రమే కేటాయించారు. దేశీయ స్థూల ఉత్పత్తికి 15 శాతం ఆదాయాన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్న వ్యవసాయ రంగానికి 1.96 శాతం బడ్జెట్ కేటాయింపుతో అభివృద్ధి జరుగుతుందా? ప్రపంచంలోని అన్ని దేశాలు తమ వ్యవసాయ రంగాలకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నాయి. కానీ పత్తి ఎగుమతి రాయితీలు నిషేధించాలని 2017 జనవరి 1న భారతదేశం తరఫున ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ సంతకం చేశారు. 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశం ఆహారధాన్యాల దిగుమతులపై ఆధారపడే దుస్థితికి నెట్టబడింది. 1996లో స్వయంపోషకత్వంగా ఉన్న దేశం నేడు దిగుమతులపై ఆధారపడుతున్నది. ఇంతవరకు వ్యవసాయ రంగానికి దేశీయంగా లేదా రాష్ట్రాలలో భూ వినియోగంపై ప్రణాళికలు లేవు. రైతులు తమ కోర్కెల మేరకు పంటలు వేస్తున్నారు. ప్రధానంగా ఎగుమతి ఆధారిత పంటలవైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. అనేక వైపరీత్యాలకు ఓర్చి పండించిన ఎగుమతి ఆధారిత పంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు దివాలా తీస్తున్నారు. ఇప్పటికీ 52 శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. క్రమంగా వీరు వ్యవసాయ రంగాన్ని వదిలేసి ఇతర రంగాలకు తరలిపోతున్నారు. 2022 నాటికి వ్యవసాయ రంగంలో 18 అంశాలను అమలు జరపడం ద్వారా 2018 ఫిబ్రవరి 3న రైతుల ఆదాయం రేటు పెంపు చేస్తానని ప్రధాని ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి 6 సం‘‘లు కావస్తున్నా ప్రభుత్వం ప్రకటిం చిన హామీలలో ఏ ఒక్కటీ అమలు జరగలేదు. చివరకు ‘రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు’ ఏర్పాటు చేసి పెద్ద కమతాలుగా మార్చి ఆ కమతాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి యాంత్రీకరణ ద్వారా అధికోత్పత్తి సాధిస్తామని ప్రణాళికలు వేస్తున్నారు. వీలైనంతవరకు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను దిగుమతి చేసుకోకుండా చూడాలి. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కనీసం 8 శాతం నిధులు కేటాయించాలి. వ్యవసాయ రంగానికి రాయితీల కల్పనలో వెనుకాడరాదు. విత్తనం మొదలు మార్కెట్ వరకు గల అంశాలలో ప్రభుత్వ జోక్యం తప్పనిసరిగా ఉండాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తిని సాధించే దిశగా ప్రణాళికల రూపకల్పన చేయాలి. భూమి సాగుతో సంబంధం ఉన్నవారందరికీ చట్టపరంగా హక్కులు కల్పించాలి. పై చర్యలు చేపట్టడం ద్వారా ప్రస్తుత మాంద్యం నుండి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను బయటపడవేయాలి. అంతేకానీ ప్రపంచవ్యాపితంగా కొనసాగుతున్న మాంద్యం భారతదేశంలో లేదని ఆర్థికమంత్రి చెప్పడం వల్ల ప్రస్తుత మాంద్యం పరిస్థితులు దూరం కావు. సారంపల్లి మల్లారెడ్డి వ్యాసకర్త అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు ‘ 94900 98666 -
కార్పొరేట్ల లాభాలకే విత్తన చట్టం!
కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం 2019 ముసాయిదాను విడుదల చేస్తూ నవంబర్ 15 నాటికి సూచనలు, సలహాలు, సవరణలు పంపాలని వెబ్సైట్లో పెట్టారు. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం విత్తన బిల్లు తేవడానికి 2004 నుండి మల్లగుల్లాలు పడుతూనే వుంది. విత్తన కార్పొరేట్లకు లొంగి ప్రభుత్వాలు విత్తన చట్టం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇదే సందర్భంలో దేశీయ పరిశోధనల వల్ల విత్తనోత్పత్తి భాగా పెరిగింది. 1995లో దేశంలో ప్రవేశపెట్టిన సరళీకృత వ్యవసాయ విధానాల వల్ల, డబ్ల్యూటీఓ షరతులు అమలు జరపడం వల్ల విదేశీ బహుళజాతి సంస్థలు తమ టెక్నాలజీతో వచ్చి ఇక్కడ విత్తనం ఉత్పత్తి చేయడమే కాక రైతులు వాణిజ్య పరంగా సాగుచేయడానికి విత్తనాలను అమ్ముతున్నారు. ప్రస్తుతం మోన్శాంటో, డూపాయింట్, సింజెంటా, కార్గిల్ లాంటి కంపెనీలు భారతదేశంలో 20 శాతం విత్తనాలు అమ్ముతున్నాయి. లాభాలు ఆశిస్తున్న బహుళజాతి కంపెనీలు రైతులకు నాణ్యతలేని విత్తనాలను, కల్తీ విత్తనాలను సరఫరా చేసి వేల కోట్లు లాభాలార్జిస్తున్నారు. ఏటా ఉభయ తెలుగు రాష్ట్రాలలో 5.6 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతింటున్నాయి. దీనిపై రైతు సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేసి, మారిన పరిస్థితులకు అనుగుణంగా విత్తన చట్టం తేవాలని కోరారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం విత్తన ముసాయిదా చట్టం తెచ్చింది. దానికి రైతులు, రైతు సంఘాలు, లా కమిషన్ చేసిన సూచనలను జతపరిచి బిల్లుగా రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందకుండా బహుళజాతి సంస్థలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ఆమోదాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత రైతుల ఆందోళన ఫలితంగా 2010లో మరొకసారి సవరణలతో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. మళ్లీ అదే ఒత్తిడి రావడంతో బిల్లును ఆమోదానికి పెట్టలేదు. రాజ్యాంగంరీత్యా విత్తన చట్టం రాష్ట్ర ప్రభుత్వాలు తేవాలి. కానీ కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి వారు చేయకుండా తానే చేస్తానని అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తూ లేఖలు రాసింది. అయినప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సంఘం ఆందోళన ఫలితంగా 2012లో శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టింది. తరువాత కేంద్రం ఒత్తడితో రాష్ట్రం బిల్లును ఉపసంహరించుకుంది. 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం ముసాయిదాను చర్చల కోసం సూచనలు చేయాలని విడుదల చేసింది. కానీ శాసనసభలో నేటికి పెట్టలేదు. తిరిగి 2019 విత్తన ముసాయిదాలో కార్పొరేట్లకు స్వేచ్ఛ కల్పిస్తూ, రైతులు నష్టపోయిన ఎడల వినియోగదారుల కోర్టుకు వెళ్లమని బిల్లులో పెట్టింది. గత పదేళ్లలో వరంగల్, గుంటూరు వినియోగదారుల కోర్టుల్లో వేలాది కేసులు వేయడం జరిగింది. 80 శాతం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తీర్పు వచ్చిన 20 శాతం కేసులపై కంపెనీలు హైకోర్టులో అప్పీల్ చేశాయి. మొత్తంపై కంపెనీలు పరిహారం నుంచి తప్పించుకున్నాయి. కోరలు తీసిన ఈ బిల్లు రైతులకు ఏమాత్రం ఉపయోగపడదు. బహుళజాతి సంస్థలకు లాభాలు తెవడానికి మరోవైపున రైతులకు బిల్లు తెచ్చామని చెప్పుకోవడానికి ఉభయతారకంగా ఈ బిల్లు తెచ్చారు. వ్యాసకర్త సారంపల్లి మల్లారెడ్డి, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు, మొబైల్ : 94900 98666 -
మద్దతుధరలా! గిట్టుబాటుధరలా?
సంధర్భం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జూలై 4న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి 14 వ్యవసాయోత్పత్తుల ఉత్పత్తి ఖర్చుపై యాభై శాతం అమ్మకపు ధర నిర్ణయిం చినట్టు ప్రకటించింది. కానీ ఈ ధరలు పరిశీలిస్తే ఉత్పత్తి ధరలు ఎవరు నిర్ణయించారో ప్రకటించలేదు. అటు రాష్ట్రం గానీ, ఇటు కేంద్రం గానీ సాంకేతికంగా ధర నిర్ణయించకుండా, ధర నిర్ణాయక సంఘం 2016–17లో నిర్ణయించిన ఉత్పత్తి వ్యయాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ఉత్పత్తి వ్యయంలో ప్రధానంగా మూడు భాగాలుం టాయి. 1. ఏ2= విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహా రక మందులు, యంత్రాల అద్దెలు, తదితర నగదు కొనుగోళ్లు 2. ఎఫ్ఎల్ అంటే కుటుంబ శ్రమ, కూలీల శ్రమ 3. సీ2 అంటే పెట్టుబడికి తెచ్చిన అప్పులపై వడ్డీ, భూమి అద్దె, ఇతర వ్యయాలు. పై మూడు వ్యయాలను కలిపితే ఉత్పత్తి వ్యయం అవుతుంది. కానీ ధరల నిర్ణాయక సంఘం మొదటి రెండింటి వ్యయాలను కలిపి రైతు పెట్టుబడిగా నిర్ణయించారు. ప్రస్తుత ప్రధాని ప్రకటించిన ధరలకు మొదటి రెండు వ్యయాలను మాత్రమే గుర్తించి దానిని వ్యవసాయ పెట్టుబడిగా చూపి, యాభై శాతం కలిపి ధరలు నిర్ణయించినట్టు ప్రకటించారు. అందువల్ల మూడవ వ్యయం అనగా బ్యాంకు రుణాలు, వడ్డీ, పంటల కోసం వినియోగించే నీటి పారుదలా విద్యుత్తు వ్యయాలు, భూమి అద్దెలు గుర్తించలేదు. ఉదాహరణకు 2017–18లో ధాన్యానికి ఏ2 వ్యయం కింద క్వింటాకు రూ. 839లు వ్యయం కాగా ఏ2+ఎఫ్ఎల్కు జరిగిన వ్యయం రూ.1,117గా ఉంది. మూడు వ్యయాలను లెక్కకట్టి (సీ2)గా రూ.1,484గా వ్యయం జరిగింది. ప్రధాని 1,117ను మాత్రమే తీసుకుని దానికి 50 శాతం కలిపి 1,750ని క్వింటాల్‌కి ధరగా నిర్ణయించారు. వాస్తవానికి రూ.1,484ను గుర్తించి అదనంగా 50 శాతం అనగా రూ. 742 కలిపి రూ. రూ. 2,226 నిర్ణయించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం క్వింటాల్ ధాన్యం ఉత్పత్తికి మూడు వ్యయాలు కలిసి రూ 2,070గా నిర్ణయిం చింది. దీనికి యాభై శాతం కలుపగా రూ. 3,105గా క్వింటాల్ ధర నిర్ణయించాలి. ఆ విధంగా అన్ని పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించి యాభై శాతం కలిపి ధరలు ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర వాస్తవానికి ప్రస్తుత పెట్టుబడి అవుతుంది. గత వారం రోజుల క్రితం డీఏపీ బస్తా రూ.1,076 నుంచి రూ. 1,290కి పెంచారు. విత్తనాలు, డీజిల్, యంత్రాలు, యంత్ర విడిభాగాలు, క్రిమిసంహారక మందుల ధరలను 25 శాతం నుంచి 30 శాతం వరకు పెంచారు. ఈ పెంపుదల 2018–19 పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది. గత నాలుగేళ్లుగా మార్కెట్లలో కనీస మద్దతు ధరల అమలు జరగలేదు. ప్రతి పంట మార్కెట్‌కు రాగానే నాణ్యతా ప్రమాణాల పేరుతో మధ్య దళారులు, కనీస మద్దతు ధరలకు రూ. 200 నుంచి రూ.400 వరకు కోతలు పెడుతున్నారు. ఆ విధంగా ప్రధానంగా వరి, మొక్కజొన్న, పప్పులు, పత్తి, వేరుశనగ, సోయా పంటలకు తెలంగాణలో రూ. 8,490 కోట్లు, ఆంధ్రలో రూ. 9,800 కోట్లు రైతులు నష్టపోయారు. అంతేకాక 2017–18లో ప్రకటించిన కనీస మద్దతు ధరలకు, ఉత్పత్తి వ్యయంపై యాభై శాతం కలుపగా వచ్చిన మొత్తానికి తేడాలు పరిశీలిస్తే... తెలంగాణలో రూ. 24,592 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 29 వేల కోట్లు రైతులు నష్టపోయారు. రైతులు నష్టపోయినదంతా వ్యాపారులకు పెట్టుబడిగా పోగుపడింది. ఇప్పటికీ వ్యవసాయ రంగం నుంచే పెట్టుబడి సమీకరణ జరుగుతుందనడానికి ఇది మంచి ఉదాహరణ. వ్యవసాయ రంగం నుంచి 86 శాతం ఉన్న సన్న, చిన్నకారు రైతులను తొలగించడానికి మార్కెట్ ధరలను తగ్గిస్తున్నారు. నిజానికి రైతుల మేలుకోరే ప్రభుత్వాలు మార్కెట్లలో పెట్టుబడిపై యాభై శాతం లాభం వచ్చేవిధంగా ధర నిర్ణయించి అమలు చేయాలి. అందుకు మార్కెట్లలో తక్కువ అమ్మినప్పటికీ మిగిలిన లోటును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భర్తీ చేయాలి. అందుకు మార్కెట్ జోక్యం పథకం కింద ప్రతి రాష్ట్రం తగిన మొత్తంలో నిధులు కేటాయించాలి. గిట్టుబాటు ధర అంటే పెట్టుబడిపోగా అదనంగా రైతుకు మిగిలే ఆదాయం. కనీస మద్ధతు ధర అంటే పెట్టుబడికి తక్కువగా ధర నిర్ణయించి అమలు జరపడానికి చేసే ప్రయత్నం. అందువల్ల రైతులు గిట్టుబాటు ధరను కోరుకుంటున్నారు. గిట్టుబాటు ధర ఏర్పాటుకు ముసాయిదా చట్టాన్ని రైతు సంఘాలు ప్రవేశపెట్టాయి. ఆ చట్టాన్ని ఆమోదించాలి. అంతే కానీ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొంత ధరను పెంచినట్టు ప్రకటించటం రైతులను మోసగించటమే. వ్యాసకర్త సారంపల్లి మల్లారెడ్డి అధ్యక్షులు, అఖిల భారత కిసాన్ సభ. ఫోన్ నెంబర్: 94900 98666 -
తెలంగాణ ఎందులో అగ్రస్థానంలో ఉంది?
కేసీఆర్‌కు సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏ రంగంలో అగ్రస్థానం లో ఉందో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని సీపీఎం నేత, ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రం 19.5 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని సీఎం చెబుతున్నారని, అయితే ఏ రంగంలో ఈ వృద్ధి రేటును సాధిం చిందో చెప్పకుండానే మన ఊరు–మన ప్రణాళిక కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిం చాలని సీఎం ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల వృద్ధి రేట్లను ప్రజలకు తెలపాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ మూడు రంగాల వృద్ధి రేటునే ఎవరైనా పెరుగుదలగా గుర్తిస్తారని, ఇందులో ఒక రంగం పెరిగినా, మరొక రంగం లోటులో ఉన్నా, సగటున ఈ రంగాల స్థూల ఉత్పత్తి రేటుతో పాటు, జీవన ఆదాయం, వయో పరిమాణం పెరుగుదల, విద్య, ఆరోగ్యం, తాగునీరు, శానిటేషన్, పర్యావరణం వంటి రంగాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ అంచనా వేస్తుందని తెలియజేశారు. ఇన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తే, ఆ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు.