సాక్షి, నల్లగొండ : బతుకుదెరువు కోసం పండ్లమ్ముకుంటున్న ఈ ఫొటోలో ఉన్న మహిళ ఓ గ్రామ సర్పంచ్. కుటుంబ పోషణ కోసం పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం బొల్లెపల్లి సర్పంచ్‌గా మంగ ఇటీవల ఎన్నికైంది. సర్పంచ్ అయినా ఎప్పటి మాదిరిగానే జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్ సమీపంలో పండ్లు అమ్ముకుంటోంది. కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉండడంతో తిరిగి అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నానని ఆమె తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment