గురుకుల టీచర్ల సమస్యలపై త్వరలో భేటీ
ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ గురుకుల విద్యా సంస్థల టీచర్ల సమస్యలు, ఇతరత్రా అంశాలపై త్వరలోనే సమావేశం నిర్వహించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్సీ అభివృద్ధి మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్టాఫ్ అసోసియేషన్ తెలిపింది. శుక్రవారం సచివాలయంలో మంత్రిని వివిధ సంఘాల నాయకులు కొల్లు వెంకటరెడ్డి, ఎం.వెంకటేశ్వర్లు, ఏ.వి.రంగారెడ్డి, బి.సక్రు కలసి వినతిపత్రం సమర్పించారు. గురుకుల విద్యా డెరైక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని, పీఆర్సీ 2015లో వేతన సవరణ చేయాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు (కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచ ర్లు) చేయాలని, రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 2,800 ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.