తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
ఢిల్లీ: కాళేశ్వరం-సుందిళ్ల బ్యారేజ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా భూ సేకరణ చేశారని దాఖలు చేసిన పిల్‌పై వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
రైతులకు పరిహారం ఇచ్చిన తరువాత ప్రాజెక్టుకు ఎలాంటి అవాంతరాలు ఉండవని తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ప్రాజెక్ట్ ఆపాలనే ఉద్దేశంతోనే కొంతమంది పిల్ దాఖలు చేశారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. డివిజన్ బెంచ్ లేకపోవడంతో దీనికి సంబంధించిన కేసును జులై రెండోవారానికి వాయిదా వేశారు.