
సాక్షి, వరంగల్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు పిల్లలపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తప్పు చేస్తే దండించాల్సింది పోయి అతనే తప్పుగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని చిన్నపిల్లలపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. మట్టేవాడ ప్రభుత్వ పాఠశాలలో బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు పోశాల శ్రీనివాస్ చిన్నపిల్లలపై అసభ్యంగా ప్రవర్తించాడు. ద్వంద్వార్థాలతో మాట్లాడుతూ, పిల్లలపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ.. అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఓ బాలిక ఇంట్లో చెప్పగా ఆగ్రహించిన కుటుంబ సభ్యులు పాఠశాలకు వచ్చి కీచక ఉపాధ్యాయుడిని చితకబాదారు. అనంతరం అతన్ని విధుల నుంచి తొలగించాలని పాఠశాల ఎదుట బైఠాయించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment