19 లోపు విద్యార్థులున్నబడులు విలీనం | schools will be closed below 19 students | Sakshi
Sakshi News home page

19 లోపు విద్యార్థులున్నబడులు విలీనం

Published Sun, Sep 28 2014 5:19 PM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM

schools will be closed below 19 students

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకర ణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ మేనేజ్‌మెంట్ల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉండాల్సిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 2013-14 డైస్ లెక్కల ఆధారంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ కోసం జిల్లా స్థాయిలో సాధికారిక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి సాధికారిక కమిటీకి చైర్మన్‌గా ఆ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. జిల్లా విద్యాశాఖాధికారి సభ్య కార్యదర్శిగా, జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీఈవో, ఐటీడీఏ పీవో, ఆర్వీఎం పీవో సభ్యులుగా ఉంటారు. రేషనలైజేషన్ ప్రక్రియ అమలుకు షెడ్యూల్, మార్గదర్శకాలు, సూచనలను జారీ చేయాల్సిందిగా పాఠశాల విద్యా కమిషనర్‌ను ఉత్తర్వుల్లో ఆదేశించారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం 19 మం దిలోపు పిల్లలున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను కిలోమీటరు పరిధిలోని ఇతర పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఆ స్కూళ్లలోని ఉపాధ్యాయ పోస్టులను విద్యార్థులున్న పాఠశాలలకు బదిలీ చేస్తారు. గిరి జన ప్రాంతాల్లో 19 మందిలోపు విద్యార్థులు ఉన్నా, లేకపోయినా కిలోమీటరు పరిధిలోని ఉన్న మరో ప్రభుత్వ లేదా సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో విలీనం చేస్తారు. ఒకవేళ కిలోమీటర్ పరిధిలో మరో పాఠశాల లేకపోతే కనీసం 15 మంది విద్యార్థులున్నా ఆ పాఠశాలను కొనసాగిస్తారు. ఇక ఈ హేతుబద్దీకరణపై 29న విద్యాశాఖ అధికారులు సమావేశమై షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. వచ్చే నెల చివరలో ఈ రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement