rationalisation
-
3,282 వర్సిటీ పోస్టులకు నోటిఫికేషన్
రాజానగరం: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 20న నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. వీటితో పాటు డిప్యుటేషన్‌పై మరో 70 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ తదితర ప్రతి పోస్టునూ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వర్సిటీల్లో ఇంత భారీ ఎత్తున ఖాళీల భర్తీ గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. యూనివర్సిటీలను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీకి సోమవారం వచ్చిన హేమచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 18 వర్సిటీల్లో చదువుతున్న 12 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో వారిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడ్హాక్ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ వర్సిటీల అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడ్హాక్ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ మార్కులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని హేమచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో సుమారు 2,600 మంది కాంట్రాక్టు పద్ధతిలో బోధిస్తున్నరన్నారు. వీరిలో సుమారు వెయ్యి మంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ (విద్యార్థులు చెల్లించే ట్యూషన్ ఫీజుల నుంచి జీతాలు పొందేవారు) కింద పని చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం చేపట్టే పోస్టుల భర్తీ ప్రక్రియలోకి వీరు రారని, వారి విధులకు ఎటువంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు. మిగిలిన వారు ఓపెన్ రిక్రూట్మెంట్లో ఇతరులతో పాటే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు. వారి సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఇచ్చే 10 శాతం వెయిటేజీ మార్కులను ఏడాదికి ఒకటి చొప్పున లెక్కిస్తారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, ఒక్కో పోస్టుకు 12 మందిని ఎంపిక చేస్తారన్నారు. వారి నుంచి అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఒక పోస్టుకు నలుగురిని ఎంపిక చేస్తారని చెప్పారు. వర్సిటీల్లోని బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రస్తుతం రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతోందన్నారు. దీని కోసం ఉర్దూ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రెహమాన్ అధ్యక్షతన కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా భర్తీ ప్రక్రియను ప్రకటిస్తామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కోసమే ఇంటర్న్‌షిప్ డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం విద్యార్థుల్లో కొరవడుతోందనే ఉద్దేశంతోనే చదువుకునే సమయంలోనే ఇంటర్న్‌షిప్ చేయాలనే నిబంధన పెట్టామని ఆచార్య హేమచంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు కలెక్టర్ చైర్మన్‌గా కమిటీలుంటాయన్నారు. వారు ఇచ్చిన నివేదిక మేరకు ఎక్కడెక్కడ అవకాశాలున్నాయనే సమాచారాన్ని ఐఐసీ పోర్టల్‌లో ఉంచుతున్నామని వివరించారు. ఇవి కాకుండా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు వర్చువల్ విధానంలో ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే వెసులుబాటు కల్పిస్తున్నమని చెప్పారు. ఏడాదికి 3.50 లక్షల మంది ఇంటర్న్‌షిప్ చేయాల్సి వస్తుండగా సుమారు 5 లక్షల అవకాశాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. -
అయోమయం
- కొలిక్కిరాని బదిలీలు, రేషనలైజేషన్ – జుట్టు పీక్కుంటున్న అధికారులు – ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ), ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అంధకారంగా మారింది. మార్గదర్శకాలపై జీఓలు, టీచర్ల బదిలీపై షెడ్యూలు ఇచ్చి చేతులు దులుపుకుంది. క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. షెడ్యూలు ప్రకారం రేషనలైజేషన్ ((హేతుబద్ధీకరణ) ప్రక్రియ ఈ నెల 8 నాటికి పూర్తి కావాల్సి ఉంది. శుక్రవారం నుంచి 12 వరకు అన్ని కేడర్లు టీచర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే రేషనలైజేషన్ ప్రక్రియ కొలిక్కి రాలేదు. మరోవైపు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ పని చేయడం లేదు. దరఖాస్తు చేసుకునేందుకు ఇక రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రేషనలైజేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వివిధ అంశాలు ప్రతిబంధకంగా మారాయి. హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తయితే పలు పాఠశాలలు మూతపడనున్నాయి. ఉపాధ్యాయ పోస్టులను ఇతర పాఠశాలలకు బదలాయించనున్నారు. ముఖ్యంగా యూపీ స్కూళ్లకు సంబంధించి చాలా అంశాల్లో స్పష్టత లేదు. చాలా స్కూళ్ల నుంచి బయాలజీ టీచర్లు బయటకు రానున్నారు. వారిని ఎలా సర్దుతారనే దానిపై సమాచారం లేదు. హేతుబద్ధీకరణ పూర్తయితేనే టీచర్ల బదిలీల ప్రక్రియ ముందుకు సాగుతుంది. తలనొప్పిగా పాయింట్ల కేటాయింపు మరోవైపు టీచర్లకు వివిధ ప్రతిభ ఆధారిత పాయింట్లు కేటాయింపు తలనొప్పిగా మారింది. సంబంధిత ఉపాధ్యాయులు ఫలానా పాయింట్లు తనకు వర్తిస్తాయని ఎంఈఓలకు వినతులిచ్చారు. దీనిపై రికార్డులు పరిశీలించేందుకు స్కూళ్లు పునఃప్రారంభం కాలేదు. ఇదే అదనుగా అక్రమాలకు చోటు చేసుకునే వీలుంది. మండల విద్యాశాఖ అధికారులు, డెప్యూటీ డీఈఓలు ధ్రువీకరించే పాయింట్లపై కొందరు వ్యాపారం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. – పదో తరగతిలో 90–99.99 శాతం మంది ఉత్తీర్ణత సాధించి ఉంటే 5 పాయింట్లు, 80–89.99 శాతం మంది ఉత్తీర్ణత సాధించి ఉంటే 3 పాయింట్లు ఇస్తారు. ఇది కేవలం ఉన్నత పాఠశాలల టీచర్లకే మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే పదో తరగతి ఆ స్కూళ్లలో మాత్రమే ఉంటుంది. మరి ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ల పరిస్థితి ఏమిటి? తాము స్కూల్ అసిస్టెంట్లు కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. – మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి 90 శాతం రోజుల్లో గడువులోగా ఆన్లైన్లో ఇండెంట్ వివరాలు పంపింటే 2 పాయింట్లు. 80–89.99 శాతం రోజుల్లో పంపింటే 1 పాయింటు కేటాయిస్తారు. వాస్తవానికి ఇండెంట్ దాదాపు ప్రతి మండలంలోనూ ఎమ్మార్సీ సిబ్బందే పంపుతున్నారు. మరి ఏస్కూల్లో ఏ టీచరుకు పాయింట్లు కేటాయిస్తారన్నది అంతుచిక్కడం లేదు. – స్పౌజ్ పాయింట్లు వినియోగించుకునేందుకు 8 ఏళ్లా లేక 8 ఏళ్లు పూర్తి కావాలా? దీనిపై స్పష్టత లేదు. – పండిట్లు, పీఈటీల అప్‌గ్రెడేషన్ పోస్టుల్లో ఉన్న పండిట్లు, పీఈటీలు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో లేదు. స్పష్టత వచ్చిన తర్వాతనే బదిలీల ప్రక్రియ రేషనలైజేషన్ ప్రక్రియ ఇంకా తేలలేదు. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాతనే బదిలీల ప్రక్రియ ముందుకు సాగుతుంది. షెడ్యూలు ప్రకారం శుక్రవారం నుంచే ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నా...వెబ్సైట్ పని చేయడం లేదు. వివిధ పాయింట్లపై స్పష్టత కోసం ప్రభుత్వానికి రాశాం. -లక్ష్మీనారాయణ, డీఈఓ -
గందరగోళంగా రేషనలైజేషన్
– ఉత్వర్వులను పాటించలేదన్న ఉపాధ్యాయ సంఘాలు – మునిసిపల్ ఆర్డీతో మూడు గంటల చర్చలు – ఆర్డీ హామీతో శాంతించిన నాయకులు అనంతపురం న్యూసిటీ : జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలు, ఒక నగగరపాలక సంస్థ పరిధిలోని స్కూళ్లకు సంబంధించిన రేషనలైజేషన్ గందరగోళానికి దారితీసింది. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్హాల్లో రేషనలైజేషన్ ప్రక్రియ ప్రారంభించారు. మునిసిపల్ అధికారుల తీరును తప్పుపడుతూ ఉపాధ్యాయ సంఘాలు రేషనలైజేషన్‌ను అడ్డుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఎందుకు పాటించలేదంటూ నగరపాకల సంస్థ కార్యదర్శి జ్యోతిలక్ష్మిని నిలదీశారు. అనంతరం మునిసిపల్ ఆర్డీ, కమిషనర్ పీవీవీఎస్ మూర్తి చాంబర్‌కు వెళ్లారు. రేషన లైజేషన్ విధానంలో అధికారులు తీరు వివాదాలకు దారితీస్తోందంటూ ఆర్డీకి వివరించారు. ఇంగ్లిష్ మీడియంను ప్రారంభించకుండా ఏవిధంగా సర్దుబాటు చేశారని, వెంటనే ఆ ఆంగ్ల మీడియంను ప్రైమరీ స్కూళ్లలో ప్రవేశపెట్టాలన్నారు. సర్‌ప్లస్‌గా గుర్తించిన ఉపాధ్యాయ పోస్టులను ఇంగ్లిష్ మీడియం పాఠశాలలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో సర్‌ప్లస్‌గా ఉన్న సబ్జెక్ట్ ఉపాధ్యాయులను ప్రాథమిక పాఠశాలలకు కేటాయించాలన్నారు. మథర్‌థెరిస్సా ప్రైమరీ స్కూల్లో 5 మంది ఉపాధ్యాయులంటే వారిలో ముగ్గుర్ని మిగులు ఉపాధ్యాయులుగా చూపారని, మిగితా ఇద్దరినీ రేషనలైజేషన్‌లో పరిగణించలేదన్నారు. ఆ ఇద్దరి ఆసక్తిని అడిగి సర్దుబాటు చేయాలన్నారు. ప్రధానంగా సీనియారిటీను పరిగణ లోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. నాగసముద్రం వెంగోబరావు పాఠశాలలో ముగ్గురు ఎస్జీటీ, ఇక ఉర్దూ సబ్జెక్ట్ టీచర్ ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులను ఏవిధంగా ఇతర స్కూళ్లకు కేటాయిస్తారన్నారు. ఒక్క ఉపాధ్యాయుడు ఏవిధంగా పాఠశాలను రన్ చేస్తారో చెప్పాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఆర్డీ పీవీవీఎస్ మూర్తి డీఎంఏ అధికారులతో మాట్లాడారు. చివరకు ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్న డిమాండ్లు సరైనవని నిర్ధారణకు వచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎంటీఎఫ్ రామానాయక్, ఏపీటీఎఫ్(1938) కులశేఖర్ రెడ్డి, ఏపీటీఎఫ్ నరసింహులు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఫణిభూషణ్, నాయుడు, ఆర్జేయూపీ రామాంజినేయులు, ఆర్‌యూపీపీ తులసిరెడ్డి, యూటీఎఫ్ జిలాన్, తదితరులున్నారు. రేషనలైజేషన్ వివరాలిలా.. రీజియన్‌లోని ఆరు మునిసిపాలిటీల రేషనలైజేషన్‌ను మునిసిపల్ ఆర్డీ, కమిషనర్ పీవీవీఎస్ మూర్తి ప్రకటించారు. కదిరి మునిసిపాలిటీలో 23 ఎస్జీటీలను సర్‌ప్లస్‌లో చూయించి 9 మందిని ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేశారు. అదే మునిసిపాలిటీలో 15 మంది స్కూల్ అసిస్టెంట్లను సర్‌ప్లస్‌లో చూపి, 15 మందిని వేరే స్కూళ్లకు కేటాయించారు. రాయదుర్గం మునిసిపాలిటీలో ఎస్జీటీలు 11 మంది సర్‌ప్లస్‌గా చూపి, 9 మందికి స్థానాలు కేటాయించారు. స్కూల్ అసిస్టెంట్లలో 6 మందిని సర్‌ప్లస్‌గా చూయించి ఇద్దరికి స్థానాలు కేటాయించారు. గుంతకల్లులో ఎస్జీటీలు 46 మంది సర్‌ప్లస్‌గా 33 మందిని ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేశారు. ఎస్ఏలో 35 మంది సర్ప్లస్, 24 మందికి ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేశారు. హిందూపురంలో ఎస్జీటీలు 43 మందిని సర్ప్లస్ కాగా నలుగురిని ఇతర స్కూళ్లకు కేటాయించారు. 35 మంది ఎస్ఏలను సర్‌ప్లస్‌గా చూయించి 14 మందికి స్థానాలు కేటాయించారు. తాడిపత్రి 19 మంది ఎస్జీటీలను సర్‌ప్లస్‌గా చూయించి 16 మంది స్థానాలు కేటాయించారు. 14 మంది ఎస్ఏలను సర్‌ప్లస్‌గా చూయించి 7 మందిని ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేశారు. ధర్మవరం ముగ్గురు ఎస్జీటీలను సర్‌ప్లస్‌గా చూయించి ఇద్దరికి స్థానాలు కేటాయించారు. 11 మంది ఎస్ఏలుగా చూయించి 11 మందికి స్థానాలు కేటాయించారు. -
తర్జన భర్జన!
– కొలిక్కిరాని రేషనలైజేషన్ ప్రక్రియ – 55 స్కూళ్లకు అడ్డంకిగా మారిన ‘దూరం’ – ఎంఈఓలు, జీపీఎస్ జాబితాలో వ్యత్యాసం – రేపటి వరకు గడువు పొడిగింపు అనంతపురం ఎడ్యుకేషన్ : పాఠశాలల రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ)కు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే పలు పాఠశాలలు మూతపడనున్నాయి. ఉపాధ్యాయ పోస్టులను ఇతర పాఠశాలలకు బదలాయించనున్నారు. నిబంధనలను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఆ మేరకు మండల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేసినా తుది దశకు చేరుకోవడం లేదు. 2016 డిసెంబర్ 31 తేదీ కటాఫ్‌గా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, మంజూరు పోస్టులు, స్కూళ్ల మధ్య దూరం తదితర వివరాలను మండల విద్యాశాఖ అధికారులు తేలాల్సి ఉంది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ నుంచి ప్రొఫార్మాలు పంపారు. వాటిని భర్తీ చేసి జిల్లా విద్యాశాఖకు పంపితే వారు ఆన్లైన్లో భర్తీ చేసి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతారు. ఇందుకోసం మంగళవారం నాటికే గడువు ముగిసింది. అయితే చాలా విషయాల్లో స్పష్టత రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య నెలకొంది. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల కిందట జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్ సంధ్యారాణి మాట్లాడుతూ జూన్ 2 వరకు గడువు పొడిగిస్తున్నామని, ఆలోగా పూర్తి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. 3న తుది వివరాలను వెల్లడించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 55 స్కూళ్లకు ‘దూరం’ సమస్య ముఖ్యంగా ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్‌కు ఉన్న దూరం ఆధారంగా చాలా స్కూళ్లు మూతపడే పరిస్థితి. స్కూళ్ల మధ్య దూరాన్ని ప్రభుత్వం ఆన్లైన్ జీపీఎస్ (గ్లోబల్ పొజిషినింగ్ సిస్టం) ద్వారా గుర్తించారు. అయితే క్షేత్రస్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు గుర్తించిన దూరానికి వ్యత్యాసం వస్తోంది. జిల్లాలో సుమారు 55 స్కూళ్లకు ఈ సమస్య నెలకొంది. సీఆర్పీలతో జీపీఎస్ ద్వారా మరోసారి దూరాన్ని పరిశీలించి అమరావతి ఐటీ విభాగానికి పంపాలని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయా స్కూళ్లకు వెళ్లిన సీఆర్పీలు వివరాలను ఐటీ విభాగానికి పంపారు. ఇదిలా ఉండగా పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, డీ. హీరేహాల్ మండలం సోమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం విద్యార్థులను ఇంగ్లిష్ మీడియంలో చేర్చడంతో రెండు మీడియాల్లోనూ సంఖ్య తక్కువై మూతపడే ప్రమాదం నెలకొంది. అయితే యూడైస్‌లో తప్పుగా నమోదు చేశారని, వాస్తవానికి తెలుగు మీడియం విద్యార్థులు అధికంగా ఉన్నారని పొరబాటున ఆన్లైన్లో ఇలా నమోదు చేశారంటూ ఆయా పాఠశాలల హెచ్ఎంలు వాపోతున్నారు. ఇదే జరిగితే ఈ రెండు స్కూళ్లలోనూ ఒక మీడియం రద్దయి ఒక మీడియం కొనసాగే వీలుంటుంది. దీనిపై విద్యాశాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. వీటిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాం = పగడాల లక్ష్మీనారాయణ, డీఈఓ ‘రేషనలైజేషన్ ప్రక్రియ ఈపాటికి పూర్తికావాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో నెలకొన్న చిన్న చిన్న సమస్యల వల్ల కాస్త ఆలస్యమైంది. ఈ నెల 2 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈలోగా పూర్తి చేస్తాం. జిల్లాలో కొన్ని స్కూళ్ల మధ్య ఉన్న దూరం, పరిగి, సోమలాపురం పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యపై స్పష్టత కోసం ప్రభుత్వానికి పంపాం. అక్కడి నుంచి రాగానే వాటిపై ఓ నిర్ణయం తీసుకుంటాం.’ -
మూసేయండి
ఆకివీడు : ప్రాథమిక పాఠశాలల్ని మూసివేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. హేతుబద్ధీకరణ పేరిట మూడేళ్లుగా బడులను మూసివేస్తున్న ప్రభుత్వం ఈ ఏడాదీ అదే పనిలో నిమగ్నమైంది. జిల్లాలో 70కి పైగా ప్రాథమిక పాఠశాలల్ని మూసివేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు విద్యాశాఖ వర్గాల సమాచారం. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సర్దుబాటు పేరిట బడుల మూతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 19 మందికంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 30 మందికంటే తక్కువ విద్యార్థులు ఉంటే.. వాటిస్థాయి తగ్గించి ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తారు. జెడ్పీ హైసూ్కళ్లలో 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే.. వాటిని ప్రాథమికోన్నత పాఠశాలలుగా మారుస్తారు. 6, 7, 8 తరగతులున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 40లోపు విద్యార్థులు ఉంటే.. వాటిని కూడా ప్రాథమిక పాఠశాల స్థాయికి తగ్గిస్తారు. జిల్లాలో 2,250 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. వాటిలో 70కి పైగా బడులను మూసివేస్తారని తెలుస్తోంది. ఇవి కాకుండా 50 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల స్థాయిని కుదించే అవకాశం ఉన్నట్టు అంచనా. ఉపాధ్యాయుల కేటాయింపు ఇలా.. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం 2016 డిసెంబర్ 31 నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల్ని కేటాయిస్తారు. 20 మంది విద్యార్థులుండే ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటారు. 21 నుంచి 60 లోపు పిల్లలుంటే ఇద్దర్లు, 60 మంది దాటితే ముగ్గురు ఉపాధ్యాయుల్ని కేటాయిస్తారు. 80 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు ఉపాధ్యాయుల్ని నియమించి దానిని మోడల్ పాఠశాలగా గుర్తిస్తారు. 80 నుంచి 131 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ఐదుగురు ఉపాధ్యాయులతోపాటు ఒక ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తారు. ఈ మేరకు జీవో–29 జారీ కాగా.. దానికి అనుబంధంగా ఆర్సీ నంబర్ 4102తో మార్గదర్శకాలు సైతం వెలువడ్డాయి. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారీగా హేతుబద్ధీకరణ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలతో కూడిన నివేదికలను ఈనెల 30న విద్యాశాఖకు సమర్పించాల్సి ఉంటుంది. సదరు నివేదికల తుది పరిశీలన అనంతరం ఆయా పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల, విద్యార్థుల వివరాలను జూన్ 1న అధికారికంగా ప్రకటిస్తారు. బలోపేతం చేయాలి ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమ బోధనను అందుబాటులోకి తెచ్చాక విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ స్థాయి నుంచి తరగతులు ఉండాలి. పాఠశాలలు మూసివేయడమనేది అవివేక చర్య. విద్య ఉమ్మడి వ్యవస్థగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకూడదు. దీనిని వ్యతిరేకిస్తున్నాం. – కె.రామలింగరాజు, ఎస్టీయూ అధ్యక్షుడు, ఆకివీడు మండలం పాఠశాలల్ని కుదించడం దారుణం విద్యార్థుల శాతం తక్కువగా ఉందనే నెపంతో ప్రభుత్వ పాఠశాలల్ని కుదించడం దారుణం. అక్షరాస్యతలో మన రాష్ట్రం దేశంలో 27వ స్థానంలో ఉంది. ఈ చర్యల వల్ల మరింత దిగజారుతుంది. నిరుపేదలకు విద్యను దూరం చేస్తున్నారు. ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. పాఠశాలల కుదింపు, ఎత్తివేత వంటి చర్యల్ని వెంటనే మానుకోవాలి. – పిల్లి జయకర్, అధ్యక్షుడు, యూటీఎఫ్ జిల్లా శాఖ -
136 పాఠశాలలు మూత !
నిజామాబాద్‌అర్బన్ : విద్యాశాఖలోని రేషనలైజేషన్ ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. వచ్చేనెలలో రేషనలైజేషన్ చేపట్టనున్నారు. విద్యార్థులు ఉన్నచోట టీచర్లు లేకపోవడం.. టీచర్లు ఉన్నచోట విద్యార్థులు లేకపోవడం.. ఉపాధ్యాయుల గైర్హాజరు అంశాలపై సుప్రీంకోర్టు పాఠశాల విద్యాశాఖపై మండిపడింది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక కోరింది. ఈ క్రమంలో రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సూచనల మేరకు వచ్చేనెలలో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. జిల్లాలో 1,475 ప్రాథమిక పాఠశాలలు, 432 ఉన్నత పాఠశాలలు, 268 యూపీఎస్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 2.10 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే పాఠశాలల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. రేషనలైజేషన్ నిబంధనల ప్రకారం పది మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలను మూసేయనున్నారు. అంతేగాక అసలే విద్యార్థులు లేని పాఠశాలలు ఏడు ఉన్నాయి. 10 మంది విద్యార్థుల్లోపు ప్రాథమిక పాఠశాలలు 80, యూపీఎస్‌లు 56 ఉన్నాయి. రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే ఈ పాఠశాలలు మూతపడనున్నాయి. కొంతకాలంగా యూపీఎస్ పాఠశాలల్లో (6, 7 తరగతులు) విద్యార్థులు లేని పాఠశాలల్లో కూడా టీచర్లు కొనసాగుతున్నారు. ఇందులో బోధన్ మండలం సాలూర, జాడి జమాల్పూర్, దోమకొండ మండలం లింగుపల్లి, మోర్తాడ్ మండలం గాండ్లపేట, కమ్మర్పల్లి మండలం బడితండా, కామారెడ్డి, బోధన్ మండలం హున్సా, జుక్కల్ మండలం బస్వాపూర్, నాగల్గావ్, కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి పాఠశాలలు ఉన్నాయి. అంతేగాక మాక్లూర్ మండలం గంగరమంద యూపీఎస్‌లో ఆరుగురు విద్యార్థులు, ఇదే మండలం వల్లభాపూర్ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు, కంఠేశ్వర్‌లోని యూపీఎస్‌లో ఆరుగురు, నిజామాబాద్ మండలం ముల్లంగిలో ముగ్గురు విద్యార్థుల చొప్పున కొనసాగుతున్నారు. ఎడపల్లి మండలం ఎన్సీ ఫారం, నవీపేట్ మండలం కమలాపూర్‌లో ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అత్యధికంగా జుక్కల్ మండలంలో ఏడు పాఠశాలలు, జక్రాన్‌పల్లి మండలంలో 10 యూపీఎస్‌లు 10లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఉన్నాయి. రేషనలైజేషన్ ప్రకారం వీటిని మూసేసే అవకాశం ఉంది. అంతేగాక ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి అత్యధికంగా ఉర్దూమీడియం పాఠశాలలు, 10 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు అధికంగా ఉన్నాయి. ఈ పాఠశాలల్లో టీచర్లు మాత్రం ఎక్కువగానే ఉన్నారు. దీని ప్రకారం జిల్లా వ్యాప్తంగా 136 పాఠశాలలు మూతపడనున్నాయి. మార్పులు ఇలా ఉండొచ్చు... రేషనలైజేషన్ ప్రక్రియలో 10 మందిలోపు ఉన్న పాఠశాలలను సమీప ప్రాంతంలోని 1 లేదా 2 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలల్లో కలిపేస్తారు. టీచర్లను సైతం ఇదేమాదిరిగా కలిపేయడమా.. లేక పోస్టుతోసహా ఇతర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నచోట భర్తీ చేయడమో చేస్తారు. మరోఅంశం పదిమంది లోపు విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలను తమ సమీపంలోని కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో కలిపేస్తారు. యూపీఎస్ పాఠశాలల విషయానికొస్తే సంబంధిత పాఠశాల విద్యార్థులను అదేప్రాంతంలో సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలు, గురుకుల, కస్తూర్బాగాంధీ విద్యాలయాలకు తరలించనున్నారు. సంబంధిత పాఠశాల టీచర్లను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి నివేదించి జిల్లాలో మిగతా పాఠశాలల్లో ఖాళీగా ఉన్నచోట నియమిస్తారు. అంతేగాక సమీపంలోని 2 కిలోమీటర్ల పరిధిలో పాఠశాల ఉంటే అక్కడకు విద్యార్థులు వెళ్లేందుకు రవాణాభత్యాలు చెల్లించాలని రేషనలైజేషన్ కమిటీ సిఫారసు చేసింది. కానీ ఈ అంశంపై ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో జీవోనెంబర్ 76 ప్రకారం జరిగిన రేషనలైజేషన్‌లో తక్కువగా ఉన్న పాఠశాలలను మూసేసి, టీచర్లను పోస్టులతో సహా ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ విధానంలో కమ్మర్పల్లి మండలం హసకొత్తూర్, చౌట్పల్లి, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్, పాలెంలో హైస్కూల్, యూపీఎస్ పాఠశాలలు ఒకే దగ్గర ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఇలా ఉండకూడదు. ప్రస్తుతం రేషనలైజేషన్ జరిగితే వీటి విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటారన్నది అధికారులు ఆలోచించాలి. ఒకవేళ యూపీఎస్ పాఠశాలను విద్యార్థులు తక్కువగా ఉండటంతో ఇతరప్రాంతాలకు తరలిస్తే విద్యార్థులను పక్కనే ఉన్న హైస్కూల్లో కలపడం అసాధ్యం. సమీపంలో ఉన్న పాఠశాలకు వెళ్లడమా.. లేదా అక్కడే కొనసాగించడమా అనేది ఆలోచించాల్సి ఉంటుంది. ఆదేశాలు రాగానే.. జిల్లా విద్యాశాఖ అధికారి టి లింగయ్య, రేషనలైజేషన్ ప్రక్రియకు సంబంధించి ఆదేశాలు రాగానే అమలు చేస్తాం. ప్రస్తుతం జీరో విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో సంబంధిత టీచర్లను అదేమండలంలో అవసరమున్న మరోచోటకు కేటాయించాము. రేషనలైజేషన్ ప్రక్రియకు సంబంధించి వివరాలతో సిద్ధంగా ఉన్నాం. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు ఎప్పుడు వస్తే అప్పుడు చేపడుతాం. -
19 లోపు విద్యార్థులున్నబడులు విలీనం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకర ణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ మేనేజ్మెంట్ల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉండాల్సిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 2013-14 డైస్ లెక్కల ఆధారంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ కోసం జిల్లా స్థాయిలో సాధికారిక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి సాధికారిక కమిటీకి చైర్మన్‌గా ఆ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. జిల్లా విద్యాశాఖాధికారి సభ్య కార్యదర్శిగా, జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీఈవో, ఐటీడీఏ పీవో, ఆర్వీఎం పీవో సభ్యులుగా ఉంటారు. రేషనలైజేషన్ ప్రక్రియ అమలుకు షెడ్యూల్, మార్గదర్శకాలు, సూచనలను జారీ చేయాల్సిందిగా పాఠశాల విద్యా కమిషనర్‌ను ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 19 మం దిలోపు పిల్లలున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను కిలోమీటరు పరిధిలోని ఇతర పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఆ స్కూళ్లలోని ఉపాధ్యాయ పోస్టులను విద్యార్థులున్న పాఠశాలలకు బదిలీ చేస్తారు. గిరి జన ప్రాంతాల్లో 19 మందిలోపు విద్యార్థులు ఉన్నా, లేకపోయినా కిలోమీటరు పరిధిలోని ఉన్న మరో ప్రభుత్వ లేదా సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో విలీనం చేస్తారు. ఒకవేళ కిలోమీటర్ పరిధిలో మరో పాఠశాల లేకపోతే కనీసం 15 మంది విద్యార్థులున్నా ఆ పాఠశాలను కొనసాగిస్తారు. ఇక ఈ హేతుబద్దీకరణపై 29న విద్యాశాఖ అధికారులు సమావేశమై షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. వచ్చే నెల చివరలో ఈ రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. -
టీచర్ల హాజరుకు బయోమెట్రిక్!!
ప్రభుత్వ ఉపాధ్యాయులపై నియంత్రణలు విధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమంగా ఒక్కో చర్య మొదలుపెడుతోంది. ఇప్పటికే వారి పనిగంటలను 30 నిమిషాల పాటు పెంచిన సర్కారు, తాజాగా వాళ్ల హాజరు విషయంలోనూ మరింత కఠినమైన నిబంధనలు అమలుచేసేందుకు సిద్ధం అవుతోంది. సాధారణంగా పిల్లల హాజరు టీచర్లు తీసుకుంటే, టీచర్ల హాజరును బయోమెట్రిక్ విధానంలో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ముందుగా విశాఖపట్నం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తారు. దీంతోపాటు పదివేల మందికి పైగా టీచర్లను హేతుబద్ధీకరించాలని (రేషనలైజేషన్) కూడా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయించింది. ఉపాధ్యాయుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని, తీసుకుంటున్న నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయమై తమ నిరసనను తెలియజేసేందుకు పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు.